🌹 30, MAY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 30, MAY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 30, MAY 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 185 / Kapila Gita - 185🌹 
🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 39 / 4. Features of Bhakti Yoga and Practices - 39 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 777 / Vishnu Sahasranama Contemplation - 777 🌹 
🌻777. దుర్లభః, दुर्लभः, Durlabhaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 736 / Sri Siva Maha Purana - 736 🌹
🌻. మయస్తుతి - 1 / The Gods go back to their abodes (Maya’s prayer) - 1 🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 357 / Osho Daily Meditations - 357 🌹 
🍀 357. సంగీతం / 357. MUSIC 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 458 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 458 - 1 🌹 
🌻 458. 'సుముఖీ' - 1 / 458. 'Sumukhi' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 30, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : గంగా దసరా, Ganga Dussehra 🌻*

*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 6 🍀*

*11. జానకీప్రాణదాతా చ రక్షఃప్రాణాపహారకః | పూర్ణః సత్యః పీతవాసా దివాకరసమప్రభః*
*12. ద్రోణహర్తా శక్తినేతా శక్తిరాక్షసమారకః | అక్షఘ్నో రామదూతశ్చ శాకినీజీవితాహరః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : దివ్యప్రేమ అంతస్తులు - మూల స్వరూపమందు ప్రేమ స్వయంసిద్ధం, విశ్వాతీతం, నిరపేక్షం. అదే విశ్వవ్యాప్తమై సర్వమునూ భుక్తపరచు కొనునప్పుడు విశ్వప్రేమ అనబడుతుంది. అట్లు విశ్వవ్యాప్తం గాక ఏ ఒక వ్యక్తి యందో గాఢంగా లగ్నమై తద్వారా ఏకత్వానందం పొందునప్పుడు దానిని వ్యక్తిగతమైన దివ్యప్రేమగా పేర్కొనవలసి వుంటుంది.🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: శుక్ల-దశమి 13:09:21 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: హస్త 30:01:15 వరకు
తదుపరి చిత్ర
యోగం: సిధ్ధి 20:55:05 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: గార 13:04:21 వరకు
వర్జ్యం: 13:25:12 - 15:07:20
దుర్ముహూర్తం: 08:18:05 - 09:10:26
రాహు కాలం: 15:29:53 - 17:08:01
గుళిక కాలం: 12:13:37 - 13:51:45
యమ గండం: 08:57:21 - 10:35:29
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39
అమృత కాలం: 23:38:00 - 25:20:08
సూర్యోదయం: 05:41:05
సూర్యాస్తమయం: 18:46:09
చంద్రోదయం: 14:25:50
చంద్రాస్తమయం: 02:03:47
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: సౌమ్య యోగం - సర్వ
సౌఖ్యం 30:01:15 వరకు తదుపరి
ధ్వాoక్ష యోగం - ధన నాశనం, కార్య హాని
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 185 / Kapila Gita - 185 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 39 🌴*

*39. యథా పుత్రాచ్చ విత్తాచ్చ పృథఙ్మర్యః ప్రతీయతే|*
*అప్యాత్మత్వేనాభిమతాద్దేహాదేః పురుషస్తథా॥*

*తాత్పర్యము : సామాన్య జీవుడు అతిప్రేమ కారణముగా పుత్రులు, సంపదలు మొదలగు వాటియందు ఆత్మబుద్ధిని (మమకారము) కలిగియుండును. కాని, అతడు విచక్షణతో పరిశీలించిన పిమ్మట ఆ పుత్రాది సంపదలన్నియును తనకంటె వేరని గ్రహించును. అట్లే, ఆత్మజ్ఞానము కలిగినంతనే అతనికి ఇంతకుముందు దేహముపై గల ఆత్మభావము నశించిపోవును. అనగా ఆత్మ దేహముకంటే వేరని బోధపడును.*

*వ్యాఖ్య : శరీరమూ బుద్ధి మనసు అహంకారం చిత్తం. ఈ ఆరింటికన్నా ఆత్మ వేరే ఉందా. ఉన్నట్లు ఎలా నమ్మాలి? ఏ ప్రమాణం ఉంది? "నా శరీరం" అంటే నేను వేరు శరీరం వేరు. "నా పుత్రుడు" అంటే నేను వేరు పుత్రుడు వేరు. ఏది నా అంటున్నామో అది ఆత్మ. ప్రపంచములో అందరికంటే అన్నిటికన్నా ప్రీతిపాత్రమైనది పుత్రుడు. అయినా కొడుకు వేరు "నేను " వేరు. పుత్రుడు మిత్రుడూ వీరు మనకు ప్రీతి పాత్రమైన వారు. వారికంటే మనిషి విడిగానే కనపడతాడూ, తెలుసుకుంటాడు. కొడుకు మీద ప్రేమ ఉంది అంటే మొదట తన మీద తనకు ప్రీతి ఉన్నది అని అర్థం. అత్యంత ప్రీతి పాత్రమైంది దేహం. "నాకు నా మిత్రునికీ/పుత్రునికి భేధమే లేదు" అని మాటలలో అన్నా, ఆ "నేను" వేరు, పుత్రుడు/మిత్రుడు వేరు. అలాగే దేహము వేరు పురుషుడు వేరు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 185 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 4. Features of Bhakti Yoga and Practices - 39 🌴*

*39. yathā putrāc ca vittāc ca pṛthaṅ martyaḥ pratīyate*
*apy ātmatvenābhimatād dehādeḥ puruṣas tathā*

*MEANING : Because of great affection for family and wealth, one accepts a son and some money as his own, and due to affection for the material body, one thinks that it is his. But actually, as one can understand that his family and wealth are different from him, the liberated soul can understand that he and his body are not the same.*

*PURPORT : The status of real knowledge is explained in this verse. There are many children, but we accept some children as our sons and daughters because of our affection for them, although we know very well that these children are different from us. Similarly, because of great affection for money, we accept some amount of wealth in the bank as ours. In the same way, we claim that the body is ours because of affection for it. I say that it is "my" body. I then extend that possessive concept and say, "It is my hand, my leg," and further, "It is my bank balance, my son, my daughter." But actually I know that the son and the money are separate from me. It is the same with the body; I am separate from my body. It is a question of understanding, and the proper understanding is called pratibuddha. By obtaining knowledge in devotional service, or Kṛṣṇa consciousness, one can become a liberated soul.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 . శ్రీ శివ మహా పురాణము - 738 / Sri Siva Maha Purana - 738 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 12 🌴*
*🌻. మయస్తుతి - 1 🌻*

సనత్కుమారుడిట్లు పలికెను -

ఇంతలో శంభుడు ప్రసన్నుడగుటను గాంచి, శంభుని అనుగ్రహ బలముచే దహింప బడలని మయాసురుడు ఆనందముతో అచటకు వచ్చెను (1). అతడు చెతులు జోడించి శివునకు ప్రీతితో నమస్కరించి, ఇతర దేవతలకు గూడ నిశ్శంకముగా నమస్కరించి, మరల శివునకు సాష్టాంగ నమస్కారమును చేసెను (2). దానవ శ్రేష్ఠుడగు ఆ మయుడు అపుడు లేచి శివుని చూచి ప్రేమతో బొంగురు వోయిన కంఠస్వరము గలవాడై, భక్తితో నిండిన అంతరంగము గలవాడై ఇట్లు స్తుతించెను (3).

మయుడిట్లు పలికెను -

దేవ దేవా! మహా దేవా! భక్తప్రియా! శంకరా! కల్పవృక్ష స్వరూపుడవగు నీకు స్వపర భేదము లేదు (4). జ్యోతిస్స్వరూపుడవగు నీకు నమస్కారము. జగద్రూపుడవగు నీకు నమస్కారము. పవిత్రమగు అంతఃకరణము గల నీకు నమస్కారము. పవిత్రము చేయు నీకు అనేక నమస్కారములు (5). చిత్రమగు ఆకారము గల వాడవు, నిత్యుడవు, రూపములకు అతీతమైన వాడవు అగు నీకు నమస్కారము. దివ్య స్వరూపుడవు. దివ్యమగు ఆకారము గలవాడవు అగు నీకు నమస్కారము (6). నమస్కరించిన వారి కష్టముల నన్నిటినీ నశింపచేయువాడు. మంగళ స్వరూపుడు, ముల్లోకములను సృష్టించి భరించి పోషించి లయమును చేయువాడు అగు నీకు అనేక నమస్కారములు (7). భక్తిచే పొందదగినవాడు, భక్తులయోడ దయతో నిండినవాడు, తపస్సునకు యోగ్యమగు ఫలము నొసంగువాడు, పార్వతీపతి, మంగళరూపుడు, జగదీశ్వరుడు అగు నీకు నమస్కారము (8). ఓ శ్రేష్ఠమగు ప్రభువా! నీవు స్తోత్రప్రియుడవు. కాని స్తుతించుట నేను ఎరుంగను. ఓ సర్వేశ్వరా! నీవు ప్రసన్నుడవై శరణు జొచ్చిన నన్ను రక్షింపుము (9).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 738🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 12 🌴*

*🌻 The Gods go back to their abodes (Maya’s prayer) - 1 🌻*

anatkumāra said:—
1. In the meantime the Asura Maya who was not burnt due to the strength of grace, came there on seeing Śiva delighted.

2. With great delight he bowed to Śiva and other gods. With palms joined in reverence and with stooping shoulders he bowed to Śiva again.

3. Then he got up. Maya the foremost among the Asuras, with his mind full of devotion and voice choked with emotions of love he eulogised facing Śiva.

Maya said:—
4. O great lord, lord of the Gods and favourably disposed to your devotees, O Śiva, you are in the form of the wish-yielding Kalpa tree and devoid of special leaning to any side.

5. Obeisance to you O splendour-formed, obeisance to you omniformed; obeisance to you, O sanctified soul; obeisance to you, O holy one.

6. Obeisance to you of variegated forms; to you, the eternal one; obeisance to you who extend beyond all forms. Obeisance to you of divine forms, shapes, and features.

7. Obeisance to the destroyer of the distress of those who bow to you; obeisance to the welfare-hearted; to the creator, sustainer and annihilator of the three worlds.

8. O Śiva, O consort of Pārvatī, obeisance to you who are accessible through devotion of the devotees; obeisance to the compassionate and the bestower of the good fruits of penance.

9. O great lord, fond of eulogy, I know not how to eulogise you. O lord of all, be pleased. Save me who have sought refuge in you.”

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 777 / Vishnu Sahasranama Contemplation - 777🌹*

*🌻777. దుర్లభః, दुर्लभः, Durlabhaḥ🌻*

*ఓం దుర్లభాయ నమః | ॐ दुर्लभाय नमः | OM Durlabhāya namaḥ*

భక్త్యా దుర్లభాయ లభ్యో విష్ణుర్దుర్లభ ఉచ్యతే ।
జన్మాన్తర సహస్రేషు భక్త్యా లభ్యస్త్వనన్యయా ॥
ఇత్యాది వ్యాసమునిరాడ్ భగవద్యాక్య సంస్మృతేః ॥

దుర్లభమగు భక్తి చేతనే పొందబడువాడు. 'జన్మాంతర సహస్రములయందు ఆచరించబడిన తపము, జ్ఞానము, ధ్యానము, యోగసమాధి మొదలగు వానిచే పాపములు క్షీణించినవారికి మాత్రమే కృష్ణుని విషయమున భక్తి కలుగును' అను శ్రీ వ్యాస భగవద్వచనమును, 'నేను అనన్య భక్తిచేతనే లభ్యుడను' అను భగవద్వచనమును ఇందు ప్రమాణములు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 777🌹*

*🌻777. దుర్లభః, दुर्लभः, Durlabhaḥ🌻*

*OM Durlabhāya namaḥ*

भक्त्या दुर्लभाय लभ्यो विष्णुर्दुर्लभ उच्यते ।
जन्मान्तर सहस्रेषु भक्त्या लभ्यस्त्वनन्यया ॥
इत्यादि व्यासमुनिराड् भगवद्याक्य संस्मृतेः ॥

Bhaktyā durlabhāya labhyo viṣṇurdurlabha ucyate,
Janmāntara sahasreṣu bhaktyā labhyastvananyayā.
Ityādi vyāsamunirāḍ bhagavadyākya saṃsmr‌teḥ.

As He can be attained only by devotion, which is difficult to practice, He is called Durlabhaḥ vide 'Devotion to Kr‌ṣṇa arises only to men whose sins have died out by tapas, jñāna and samādhi in thousands of other lives' and also the Lord's words: 'I can be attained only by devotion to Me alone'.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥
సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥
Samāvarto’nivr‌ttātmā durjayo duratikramaḥ,Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 357 / Osho Daily Meditations  - 357 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 357. సంగీతం 🍀*

*🕉. ఈ ఉనికి ఒక సంగీతం, మరియు మనం దానికి అనుగుణంగా ఉండాలి. అందుకే సంగీతం మానవ మనస్సుకు, మానవ హృదయానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఎందుకంటే కొన్నిసార్లు అందమైన సంగీతాన్ని వింటూ, మీరు ఆ సార్వత్రిక సామరస్యంలోకి జారడం ప్రారంభిస్తారు. 🕉*

*బీథోవెన్ లేదా మొజార్ట్ వినడం, శాస్త్రీయ తూర్పు సంగీతాన్ని వినడం ద్వారా, ఒకరు వేరే ప్రపంచంలోకి వెళ్లడం ప్రారంభిస్తారు; పూర్తిగా భిన్నమైన లయ పుడుతుంది. మీరు ఇప్పుడు మీ ఆలోచనలలో లేరు-మీ తరంగదైర్ఘ్యం మారుతుంది. ఆ గొప్ప సంగీతం మిమ్మల్ని చుట్టుముట్టడం మొదలవుతుంది, మీ హృదయంలో ప్లే చేయడం ప్రారంభిస్తుంది, మీరు కోల్పోయిన లయను సృష్టించడం ప్రారంభిస్తుంది. ఇది గొప్ప సంగీతం యొక్క నిర్వచనం: ఇది మొత్తంగా, పూర్తిగా--కొన్ని క్షణాల పాటు ఎలా ఉండగలదో మీకు ఒక సంగ్రహావలోకనం ఇస్తుంది. గొప్ప శాంతి దిగివస్తుంది, మరియు హృదయంలో గొప్ప ఆనందం ఉంది. ఏమి జరిగిందో మీకు అర్థం కాకపోవచ్చు, కానీ గొప్ప మాస్టర్, గొప్ప సంగీతకారుడు, చాలా ప్రాథమిక స్థావరంలో వాద్యం చేస్తున్నారు.*

*ప్రాథమిక ఆధారం ఏమిటంటే ఉనికికి ఒక నిర్దిష్ట లయ ఉంటుంది. ఆ లయకు అనుగుణంగా సంగీతాన్ని సృష్టించగలిగితే, ఆ సంగీతం వినడంలో పాల్గొనే వారు కూడా అందులో పడిపోతారు. మరియు మీరు దీన్ని అనేక విధాలుగా చేయవచ్చు. ఉదాహరణకు, మీరు జలపాతం దగ్గర కూర్చొని ఉంటే, జలపాతం శబ్దాన్ని విని, దానితో ఒక్కటి అవ్వండి. మీ కళ్ళు మూసుకుని, మీరు జలపాతంతో ఒక్కటయ్యారని భావించండి - లోపల లోతుగా నీటితో పడటం ప్రారంభించండి. మరియు క్షణాలు, కొన్ని క్షణాలు ఉంటాయి, అకస్మాత్తుగా మీరు పాల్గొనడం జరిగిందని, మీరు జలపాతం యొక్క శ్లోకాన్ని పొందవచ్చని మరియు మీరు దానికి అనుగుణంగా ఉన్నారని మీరు కనుగొంటారు. ఆ క్షణాల నుండి గొప్ప పారవశ్యం పుడుతుంది. పక్షులను వినడం, అదే చేయండి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 357 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 357. MUSIC 🍀*

*🕉.  This existence is an orchestra, and we have to be in tune with it. That is why music has so much appeal to the human mind, to the human heartbecause sometimes listening to beautiful music, you start slipping into that universal harmony.  🕉*

*Listening to Beethoven or to Mozart, to classical Eastern music, one starts moving into a different world; a totally different gestalt arises. You are no longer in your thoughts-your wavelength changes. That great music starts surrounding you, starts playing on your heart, starts creating a rhythm that you have lost. That's the definition of great music: that it can give you a glimpse of how one can exist, totally, with the whole--even for a few moments. Great peace descends, and there is great joy in the heart. You may not understand what has happened, but the great master, the great musician, is simply playing on a very fundamental base.*

*The fundamental base is that existence has a certain rhythm. If you can create music according to that rhythm, those who participate in listening to that music will also start falling into it. And you can do it in many ways. For example, if you are sitting by a waterfall just listen to the sound of the waterfall and become one with it. Close your eyes and feel that you have become one with the waterfall--start falling with the water, deep inside. And there will be moments, a few moments, when suddenly you will find that there has been a participation, that you could get the chanting of the waterfall, and you were in tune with it. Great ecstasy will arise out of those moments. Listening to the birds, do the same.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 458 -1  / Sri Lalitha Chaitanya Vijnanam  - 458  - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀*

*🌻 458. 'సుముఖీ' - 1 🌻* 

*మంచి ముఖము కలది శ్రీమాత అని అర్థము. మంచి ముఖమనగా నేమి? జ్ఞానముచే ప్రకాశించు ముఖమే సుముఖము. ఆ ముఖము సర్వశుభములకు కారణమై యున్నది. అదే శోభనమగు ముఖము. జ్ఞానము కలవారి ముఖము ప్రకాశవంతమై యుండును. ఆ ప్రకాశము ఆకర్షణీయముగ నుండును. వారి కన్నులు, నవ్వు అత్యంత ఆకర్షణీయముగ వుండును. ఆ ముఖమును చూడగనే చూపరులకు ప్రకోపములన్నియూ ఉపశమించును. ప్రశాంతత కలుగును. ప్రసన్నమగు ముఖమై యుండుటచే ధ్యానమున ఉపకరించును. ఇచ్చట జ్ఞానముఖ మనగా ఇచ్ఛా జ్ఞాన క్రియల సమ్మేళనము  కలిగిన ముఖమని తెలియవలెను. ఇట్టి ముఖారాధన జీవుల ఉద్ధారణకు ఎంతయో ఉపకరించును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 458 - 1  🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻*

*🌻 458. 'Sumukhi' - 1 🌻*

*It means SriMata who has a good face. What is a good face? A face that shines with knowledge is willing. That face is the cause of all auspiciousness. The same beautiful face. The face of the wise is radiant. That brightness is attractive. Their eyes and smile are very attractive. Seeing that face relieves all anger in the onlookers. There will be peace. Having a pleasant face helps in meditation. Here we should know that the face of wisdom is a face that is a combination of will and knowledge and action. This facial worship is very helpful for the upliftment of living beings.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

No comments:

Post a Comment