శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 454 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 454 -1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 454 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 454 -1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀

🌻 454. 'మాలినీ'- 1 🌻


మాలారూపము గలది శ్రీమాత అని అర్థము. మాల అనగా పుష్పముల దండ పుష్పములన్నియూ సూత్రముచే దండగా యేర్పడి యుండును. దండయందలి సూత్రము (దారము) గోచరింపదు. దండయే గోచరించును. అట్లే సృష్టి యందలి అల్లిక జరుగుచున్నది. ఏడు లోకముల సృష్టి ఒక దండవలె ఏర్పడుటకు అందనుస్యుతముగ, అదృశ్యముగ ప్రవహించుచున్న శ్రీమాత చైతన్యమే ఆధారమై యున్నది. జీవుల యందు సప్త ప్రజ్ఞా కేంద్రములు దండవలె ఏర్పడుటకు కారణము చైతన్య స్రవంతియే. దారము లేనపుడు పుష్పము లెట్లు విడిపోవునో అట్లే సృష్ట అల్లిక కూడ శ్రీచైతన్యమే ఆధారముగ నిలచి యున్నది. సూర్యమండలమందు గ్రహములు కూడ అట్లే కట్టుగ నున్నవి. వృక్షమునందు వ్రేళ్ళు మొదలుకొని ఆకుల వరకు అన్నియూ కట్టుగ నుండుటకు కారణము మాలినీ చైతన్యమే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 454 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 95. Tejovati trinayana lolakshi kamarupini
Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻

🌻 454. 'Malini'- 1 🌻


It means that Srimata has a form of a garland. A garland of flowers are connected by one thread. But the thread is not visible. Only the flowers are visible. That's how the weaving of creation is going on. The creation of the seven worlds is based on Srimata consciousness, which flows through all and is invisible. The reason for the formation of sapta prajna kendras (7 centres of wisdom) in living beings is the flow of consciousness. Just as the flowers fall apart when there is no thread, Srimata consciousness is the binding force of the creation. The planets in the solar system are also bound in the same way. Malini Consciousness is the reason why everything in a tree, starting from the roots to the leaves, is bound.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment