విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 767 / Vishnu Sahasranama Contemplation - 767


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 767 / Vishnu Sahasranama Contemplation - 767🌹

🌻767. చతుర్వ్యూహః, चतुर्व्यूहः, Caturvyūhaḥ🌻

ఓం చతుర్వ్యూహాయ నమః | ॐ चतुर्व्यूहाय नमः | OM Caturvyūhāya namaḥ


శరీరపురుషశ్ఛన్దః పురుషో వేదపూరుషః ।
మహాపురుష ఇతి బాహ్వృచోపనిషదీరితాః ॥

చత్వారః పురుషా వ్యూహాః అస్య విష్ణోర్మహాత్మనః ।
యతస్తతో చతుర్వ్యూహ ఇతి కఙ్కీర్త్యతే బుధైః ॥

శరీర పురుషుడు, ఛందః పురుషుడు, వేద పురుషుడు, మహా పురుషుడు - అను నలుగురు పురుషులను తన నాలుగు వ్యూహములుగా అనగా అమరికలుగా కలవాడు చతుర్వ్యూహః అని బాహ్వృచోపనిషత్ యందు చెప్పబడినది.


:: పోతన భాగవతము తృతీయ స్కంధము :: 892-896

వాసుదేవము, సంకర్షణము, ప్రద్యుమ్నము, అనిరుద్ధము అనే దివ్యమైన ఈ నాలుగు వ్యూహములు ముల్లోకములలోను సేవింపదగినవి. సుగుణవతీ! వానిని నీకు వివరించి చెబుతాను.

వాసుదేవవ్యూహము ఆకలిదప్పులు, శోకమోహాలు, జరామరణాలు అనే ఆరు ఊర్ములనుండి విడివడినదై - ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము, అనే షడ్గుణములతో పరిపూరణమై - సత్త్వగుణ ప్రధానమై, నిర్మలమై, శాంతమై, నిత్యమై, భక్తజన సంసేవ్యమై అలరారుతు ఉంటుంది. మహత్తత్త్వము నుండి క్రియాశక్తి రూపమయిన అహంకారము పుట్టినది. ఆ అహంకారము వైకారికము, తైజసము, తామసము అని మూడు విధములుగా విడివడినది.

వానిలో వైకారికాహంకారము అనేది మనస్సునకు, పంచేంద్రియములకు, ఆకాశాది పంచభూతములకు ఉత్పత్తి స్థానమై దేవతా రూపమై ఉండునది.

తైకసాహంకారము బుద్ధి రూపమును, ప్రాణరూపమును కలిగి ఉండునది. తామసాహంకారము ఇంద్రియార్థములతో సమ్మేళనమును పొంది ప్రయోజనమాత్రమై ఉండునది.

వైకారికమైన సాత్త్వికాహంకారమును అధిష్ఠించి సంకర్షణ వ్యూహము ఒప్పుచుండును. వేయి పడగలతో ప్రకాశించెడివాడు, అనంతుడు అయిన సంకర్షణ పురుషుడు, మహానుభావుడు, పంచభూతములతో, పంచేద్రియములతో, మనస్సునతో నిండి ఉండెడివాడు. కర్త, కార్యము, కారణము అనే రూప భేదములు కలిగి శాంతత్వము, ఘోరత్వము, మూఢత్వమువంటి లక్షణములతో ఉల్లాసముగా ఉండెడివాడు. ఈ మేటి వ్యూహమే రెండవదయిన సంకర్షణ వ్యూహము. దీనినుంచె మనస్తత్త్వము పుట్టినది.

ఈ మనస్తత్త్వమునకు చింతనము సహజము. ఆ చింతనము రెండు విధములు. సామాన్య చింతనము, విశేష చింతనము. వీనికే క్రమముగా సంకల్పము, వికల్పము అని పేరు. ఈ సంకల్పవికల్పముల వల్లనే సృష్టిలోని వస్తువులు వేరు వేరు లక్షణములతో మనకు గోచరిస్తూ ఉంటాయి. వీని వల్లనే వివిధ కామములు ఉత్పన్నమవుతాయి. కనుకనే ఇది ప్రద్యుమ్న వ్యూహము అని చెప్పబడును. ఇక అనిరుద్ధమనే వ్యూహము సంగతి చెప్పెదను. ఇదే ఇంద్రియములు అలన్నింటికిని అధీశ్వరమై, యోగీంద్రులందరకు సంసేవ్యమై శరత్కాలమందలి నల్ల కలువవలె శ్యామల వర్ణముతో విరాజిల్లుతు ఉండునది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 767🌹

🌻767. Caturvyūhaḥ🌻

OM Caturvyūhāya namaḥ

शरीरपुरुषश्छन्दः पुरुषो वेदपूरुषः ।
महापुरुष इति बाह्वृचोपनिषदीरिताः ॥

चत्वारः पुरुषा व्यूहाः अस्य विष्णोर्महात्मनः ।
यतस्ततो चतुर्व्यूह इति कङ्कीर्त्यते बुधैः ॥

Śarīrapuruṣaśchandaḥ puruṣo vedapūruṣaḥ,
Mahāpuruṣa iti bāhvr‌copaniṣadīritāḥ.

Catvāraḥ puruṣā vyūhāḥ asya viṣṇormahātmanaḥ,
Yatastato caturvyūha iti kaṅkīrtyate budhaiḥ.


As mentioned in the Bāhvr‌copaniṣat - Śarīra puruṣa, Chandaḥ puruṣa, Veda puruṣa and Mahā puruṣa are His four vyūha forms. Therefore He is Caturvyūhaḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Continues....

🌹 🌹 🌹 🌹🌹




No comments:

Post a Comment