శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 456 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 456 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 456 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 456 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀
🌻 456. 'మాతా' - 2 🌻
తత్వము అన్ని జీవుల యందు ఒక్కటియే. శక్తి మాత్రము వేర్వేరుగ నుండును. ఇట్లు చీమ నుండి దోమ వరకు కోటానుకోట్ల జీవులు శ్రీమాత నుండి యేర్పడుచున్నవి. ఇట్లు వివిధమైన కొలతలతో వివిధమగు లోకములను, జీవులను యేర్పరచుట వలన మాత అని పిలువబడు చున్నది. కొలమానమును ధరించునది గనుక మాత. ఎలుక యందు, ఏనుగు నందు తత్త్వ మొక్కటియే శక్తి మాత్రము వేరై యుండును. తత్వపరముగ అంతయూ సమానమని తెలియుట, శక్తిపరముగ వైవిధ్యము ఉన్నదని తెలియుట పూర్ణ జ్ఞానము. జీవులు ఒకరినొకరు గుర్తించుటకు వైవిధ్య మవసరము. ఆ వైవిధ్యము శక్తి, రూపముల పరముగ నుండును. అందరూ సమానమే అను వాక్యము తత్త్వపరముగ సత్యమేగాని, శక్తి సామర్థ్యముల పరముగ సత్యము కాదు. సృష్టి యందు ఏకత్వము భిన్నత్వము ఏకకాలమున దర్శించుట సరియగు జ్ఞానము. అట్టి జ్ఞానము లేనివారు పొరపాటు పడుదురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 456 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 95. Tejovati trinayana lolakshi kamarupini
Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻
🌻 456. 'Mata' - 2 🌻
Tattva is one in all beings. Only the energy is different. From the ant to the mosquito, millions of living beings are born from the mother. Because She creates different worlds in different measures and with different beings, She is called the Mother. Mother is the one who wears the measure. In rat and elephant, the only difference is the energy but the tattva is the same. To know that in principle all are equal and that they differ only in energy and to know that there is diversity in energy is complete knowledge. Diversity is necessary for organisms to recognize each other. That diversity is from the energy and forms. The statement that all are equal is true in principle, but not true from the perspective of energy and capability. Seeing unity and diversity at the same time is the right knowledge. Those without such knowledge fall into error.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment