శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 457 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 457 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 457 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 457 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀
🌻 457. 'మలయాచల వాసినీ' - 1 🌻
మలయాచల మందు వసించునది శ్రీమాత అని అర్థము. 'మలయాచల' మనగా గంధపు చెట్లతోకూడిన పర్వతము. గంధపు చెక్క అన్న శ్రీమాత కత్యంత ప్రియము. శ్రీమాత గంధప్రియ అని ముందు నామములో తెలుపబడినది. కనుక గంధపుచెట్లు ఏ ప్రాంతమున నుండునో అచ్చట విశేషముగ సాన్నిధ్య మిచ్చుచుండును. గంధ ధారణము, గంధపు చెక్కను వద్ద నుంచుకొనుట, గంధముతో పూజించుట యిత్యాదివి అనుగ్రహ కారణములు. గంధవనమే యేర్పరచినచో శ్రీమాత విశేషముగ ఆనందించును. మరి గంధపు చెట్ల పర్వతమే యున్నచో ఎట్లుండును? వివరింపనలవిగాని ఆనందము శ్రీమాతకు కలుగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 457 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 95. Tejovati trinayana lolakshi kamarupini
Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻
🌻 457. 'malayachala vasini' - 1 🌻
It means the one who resides in Malayachala is Srimata. 'Malayachala' means a mountain with sandalwood trees. Sandalwood is dearest to Srimata. Earlier Srimata was named as Gandhapriya. Therefore, sandalwood trees have a special affinity with Srimata in the region they are. Holding sandalwood, putting sandalwood on oneself, worshiping with sandalwood etc. are auspicious reasons. If Sandalwood forest itself is built, Srimata will be very happy. And what if there is a mountain of sandalwood trees? Srimata will be infinitely pleased.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment