శ్రీ శివ మహా పురాణము - 729 / Sri Siva Maha Purana - 729

🌹 . శ్రీ శివ మహా పురాణము - 729 / Sri Siva Maha Purana - 729 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 10 🌴

🌻. త్రిపుర దహనము - 2 🌻


ఆ పరబ్రహ్మ స్వతంత్రుడు. సగుణుడు, నిర్గుణడు కూడ ఆయనయే. పరమాత్మ, కర్మలేపము లేనివాడు అగు ఆ స్వామి అందరికీ కానరాడు (11). ఆ పరమ ప్రభుడు పంచదేవ (బ్రహ్మ, విష్ణు,రుద్ర, ఈశాన, సదాశివ) స్వరూపుడు, పంచదేవతలచే ఉపాసింపబడువాడు.ఆయనచే ఉపాసింపబడే మరియొకరు ఎవ్వరూ లేరు. ప్రలయము వరకు అందరిచే ఉపాసింపబడువాడు ఆయనయే (12). అయిననూ, ఓ మునీ! దేవ దేవుడు, వరముల నిచ్చువాడు అగు మహేశ్వరుని లీలచే సర్వవృత్తాంతములు ఘటిల్లుచుండును (13). ఆ మహాదేవుడు గణాధిపతిని పూజించి అచల నిలబడి యుండగా, కొద్దిసేపటిలో ఆ మూడు పురములు ఒక్కటిగా అయినవి (14).

ఓ మహర్షీ! మూడు పురములు ఒక్క రేఖలోనికి రాగానే, మహాత్ములగు దేవతలు బిగ్గరగా హర్షధ్వానములను చేసిరి (15). అపుడు దేవగణములు, సిద్ధులు, మహర్షులు అందరు అష్టమూర్తియగు శివుని స్తుతించి జయ జయధ్వానములను చేసిరి (16). అపుడు బ్రహ్మ, మరియు జగత్ప్రభువడు విష్ణువు ఇట్లు పలికిరి : రాక్షసులను సంహరించే సమయము ఆసన్నమైనది (17). ఓ మహేశ్వరా! త్రిపురములు ఒక్కరేఖ లోనికి వచ్చినవి. హే విభో! తారకపుత్రులగు ఆ రాక్షసులను సంహరించి దేవకార్యమును చేయుము (18). ఓ దేవదేవా! ఆ పురములు మరల విడిపోకమునుపే బాణమును ప్రయోగించి త్రిపురమును భస్మము చేయుము (19). అపుడా శివుడు ధనస్సునకు నారిత్రాటిని తగిల్చి బాణములను సంధానము చుసి పూజ్యమగు పాశుపతాస్త్రమును మనస్సులో ధ్యానము చుసెను (20). అపుడు మహాదేవుడు,గొప్ప లీలలను నెరపుటలోనిపుణుడునగు ఆ శివుడు ఏదో ఒక కారణముచే దానిని నిరాదరణ భావముతో పరికించెను (21).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 729🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 10 🌴

🌻 The burning of the Tripuras - 2 🌻



Sanatkumāra said:—

11. He is independent, the great Brahman, both possessed and devoid of attributes. He is invisible, the supreme soul and unsullied.

12. He is the soul of five divinities. He is worshipped by the five deities[1]. He is the great lord. There is none else worthy of worship. He is the ultimate abode of all.

13. Or, O sage, the activities of Śiva, the lord of the Gods, the granter of boons are but proper inasmuch as they constitute his divine sports.

14. When the great God stood up after woeshipping Śiva, the three cities joined together into one unit.

15. O sage, when the three cities came to a unified whole, a tumultuous shout of joy rose up among the noble Gods and others.

16. Then all the Gods, Siddhas and the sages shouted out “Victory” and eulogised Śiva who has eight cosmic bodies[2].

17-18. Then Brahmā and Viṣṇu, the lord of the worlds said—“The time for killing the Asuras has arrived, O great God. The three cities of the sons of Tāraka have come into one unified whole. O lord, please perform the task of the Gods.

19. O lord of the gods please discharge the arrow and reduce the three cities to ashes lest they should be separated again.”

20. Then stringing the bow tight and fixing the arrow Pāśupata worthy of worship, he thought of the Tripuras.

21. Then lord Śiva, an expert in excellent divine sports for some reason looked at it with contempt.



Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment