శ్రీ మదగ్ని మహాపురాణము - 234 / Agni Maha Purana - 234
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 234 / Agni Maha Purana - 234 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 70
🌻. వృక్షాది ప్రతిష్ఠా విధానము 🌻
శ్రీ భగవంతుడు చెప్పెను : ఇపుడు భోగమోక్షముల నిచ్చు వృక్ష ప్రతిష్ఠనుగూర్చి చెప్పెదను. వృక్షములకు సర్వౌషధిజలములు పూసి, సగుంధచూర్ణము చల్లి, మాలలచే అలంకరించి వస్త్రములు చుట్టబెట్టవలెను. అన్ని వృక్షములకు బంగారు సూదులతో కర్ణవేధనము చేసి, సువర్ణమయ శలాకతో అంజన ముంచవలెను. వేదికపై ఏడు ఫలము లుంచి, ఒక్కొక్క వృక్షమునకు అధివాసనముచేసి కుంభము సమర్పించవలెను. పిదప ఇంద్రాది దిక్పాలకుల నుద్దేశించి బలిప్రదానము చేయవలెను. వృక్షాధివాసన సమయము, బుగ్వేద మంత్రములతో గాని, యజుర్వేదమంత్రుమలతో గాని, సామవేద మంత్రములతోగాని, వరుణ దేవతాకమంత్రములతో గాని, మత్తభైరవమంత్రములతో గాని హోమము చేయవలెను.
శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు వృక్షవేదికపై నున్న కలశలతో వృక్షములకును, యజమానునకును స్నానము చేయించవలెను. యజమానుడు అలంకరించుకొని బ్రాహ్మణులకు గో-భూ-భూషణ-వస్త్రాదులు దక్షిణగా ఇచ్చి నాలుగు దివసములు క్షీరయుక్త భోజనము పెట్టవలెను. తిల-ఘృత-పలాశసమిధలతో హోమము చేయించవలెను. ఆచార్యునకు రెట్టింపు దక్షణ ఇవ్వవలెను. మండపాది నిర్మాణము వెనుక చెప్పిన విధముననే చేయవలెను. వృక్ష-ఉద్యానముల ప్రతిష్ఠ చేయుటటే పాపములు నశించి పరమసిద్ధి లభించును. ఇపుడు సూర్య-శివ-గణపతి-శక్తి-శ్రీహరి పరివారముల ప్రతిష్ఠా విధానమును వినుము. దీనిని మహేశ్వరుడు కుమారస్వామికి చెప్పెను.
అగ్ని మహాపురణామునందు వృక్షాది ప్రతిష్ఠా విధాన కథనమను డెబ్బదవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 234 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 70
🌻 Mode of planting trees (vṛkṣa-pratiṣṭhā) 🌻
The Lord said:
1-2. I shall describe the mode of planting trees [i.e., vṛkṣa-pratiṣṭhā] conferring enjoyment and emancipation. The trees having been smeared with all the herbs and adorned with fragrant powders should be decorated with flower garlands. Cloth should be put around them. (The rite known as) the perforation of the ear should be done for them with a golden needle.
3-4. Collyrium should be applied with a short stick. Seven kinds of fruits (should be placed) on the platform. The pitchers should be consecrated. The offering should be made for (the gods) Indra and others and the consecration should be done. Oblations to the fire should be done for (the sake of) plants.. Remaining in the midst of trees [i.e., vṛkṣa] a cow should be let off with the (recitation of) abhiṣekamantra.
5-6. Brahmins should bathe the trees as well as the yajamāna with the waters of pitchers placed in the platform with (the recitation of) the ṛk, yajus, sāma mantras and also that of varuṇa accompanied by auspicious music. The yajamāna should adorn (himself) and should present the fees as well as a cow, ornament and cloth.
7. Food should be given along with milk (to brahmins) for four days consecutively. Oblation should be made with sesamum and twigs of palāśa (tree). The sacrificial priest should be paid the fees double (the value of what is given to other brahmins).
8. The construction of sheds etc. here should be done as. laid down earlier. The consecration of trees [i.e., vṛkṣa] and a garden destroys one’s sins and gets the highest merit.
9. Listen to the (mode of) installation (of the image) of Sūrya (sun), Gaṇeśa, the goddess (Gaurī) and the attendant deities of Lord Hari as described by Īśa (Śiva) to Skanda (earlier).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment