✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 15 🌴
15. స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ |
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే
🌷. తాత్పర్యం :
ఓ పురుషోత్తమా! సర్వకారణుడా! సర్వేశ్వరుడా! దేవదేవా! జగన్నాథా! నీవొక్కడవే నీ అంతరంగశక్తి ద్వారా నిజాముగా నిన్నెరుగుదువు.
🌷. భాష్యము :
అర్జునుడు మరియు అతని మార్గమును అనుసరించువారివలె భక్తియుతసేవ ద్వారా శ్రీకృష్ణునితో సంబంధమును కలిగియున్నవారికే ఆ దేవదేవుడు విడితుడు కాగలడు. దానవ, నాస్తికప్రవృత్తి గలవారు శ్రీకృష్ణుని ఎన్నడును ఎరుగలేరు. శ్రీకృష్ణభగవానుని నిజతత్త్వము నుండి దూరముగా గొనిపోవు మానసికకల్పనము వాస్తవమునకు గొప్ప పాపము. ఆ విధముగా శ్రీకృష్ణుని ఎరుగజాలనివారు గీతకు వ్యాఖ్యానమును చేయరాడు. భగవద్గీత శ్రీకృష్ణుని ఉపదేశము. అది కృష్ణసంబంధవిజ్ఞానమై యున్నందున కృష్ణుని నుండి దానిని అర్జునుడు అవగతము చేసికొన రీతిలోనే మనము అవగతము చేసికొనవలెను. దానినెన్నడును నాస్తికులైనవారి నుండి గ్రహింపరాదు.
శ్రీమద్భాగవతమున పరతత్త్వమును గూర్చి ఇట్లు తెలుపబడినది (1.2.11)
వదన్తి తత్ తత్త్వవిదస్తత్త్వమ్ యద్ జ్ఞానమద్వయం |
బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ధ్యతే
పరతత్త్వమనునది నిరాకారబ్రహ్మము, పరమాత్మ, అంత్యమున భగవానునిగా వివధదశలలో అనుభవమునకు వచ్చును. అనగా పరతత్త్వావగాహనలో మనుజుడు అంత్యమున శ్రీకృష్ణభగవానుని అనుభూతికి చేరును. ఆ దేవదేవుని స్వరూపమును సామాన్యమానవుడు గాని, బ్రహ్మానుభవము లేదా పరమాత్మానుభూతి కలిగిన ముక్తపురుషుడు గాని అవగతము చేసికొనలేడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 387 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 15 🌴
15. svayam evātmanātmānaṁ vettha tvaṁ puruṣottama
bhūta-bhāvana bhūteśa deva-deva jagat-pate
🌷 Translation :
Indeed, You alone know Yourself by Your own internal potency, O Supreme Person, origin of all, Lord of all beings, God of gods, Lord of the universe!
🌹 Purport :
The Supreme Lord, Kṛṣṇa, can be known by persons who are in a relationship with Him through the discharge of devotional service, like Arjuna and his followers. Persons of demonic or atheistic mentality cannot know Kṛṣṇa. Mental speculation that leads one away from the Supreme Lord is a serious sin, and one who does not know Kṛṣṇa should not try to comment on Bhagavad-gītā. Bhagavad-gītā is the statement of Kṛṣṇa, and since it is the science of Kṛṣṇa, it should be understood from Kṛṣṇa as Arjuna understood it. It should not be received from atheistic persons.
As stated in Śrīmad-Bhāgavatam (1.2.11):
vadanti tat tattva-vidas tattvaṁ yaj jñānam advayam
brahmeti paramātmeti bhagavān iti śabdyate
The Supreme Truth is realized in three aspects: as impersonal Brahman, localized Paramātmā and at last as the Supreme Personality of Godhead. So at the last stage of understanding the Absolute Truth, one comes to the Supreme Personality of Godhead. A common man or even a liberated man who has realized impersonal Brahman or localized Paramātmā may not understand God’s personality. Such men, therefore, may endeavor to understand the Supreme Person from the verses of Bhagavad-gītā, which are being spoken by this person, Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment