🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 367 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. వాస్తవానికి, కల్పనకు మధ్య తేడా అంతగా లేదు. ప్రాచ్యం సత్యానికి సంబంధించిన నిర్వచనాన్ని కాలరహితంగా చేస్తుంది. ప్రపంచ వాస్తవం ప్రదర్శన మాత్రమే. 🍀
సత్యానికి నిర్వచనం శాశ్వతమైనది, అది శాశ్వతం కాదు, కేవలం వాస్తవం. సత్యం కాదు. నిజానికి వాస్తవానికి, కల్పనకు మధ్య తేడా అంతగా లేదు. క్షణకాలం సైతం వాస్తవం కల్పనగా వుండవచ్చు. ఇప్పుడు వాస్తవం కావచ్చు. అది కాల్పనిక సత్యం కావచ్చు. సత్య కల్పన కావచ్చు. అందుకనే తూర్పు దేశాలు చరిత్ర గురించి బాధపడవు. పట్టించుకోవు.
ఎందుకంటే చరిత్ర వాస్తవాల ఆధారంగా కలిగింది. పాశ్చాత్యం వాస్తవాల ఆధారంగా వున్నది. పాశ్చాత్య మనసు కాల స్పృహతో వుంటుంది. కాబట్టి ప్రాచ్యం సత్యానికి సంబంధించిన నిర్వచనాన్ని కాలరహితంగా చేస్తుంది. ప్రపంచ వాస్తవం ప్రదర్శన మాత్రమే. సినిమా ప్రొజెక్షన్ లాంటిది. తెర ఒక్కటే అక్కడ వాస్తవం. తెర దేవుడు. దానిపై సినిమా కదిలిపోతుంది. సినిమా క్షణికం. తెర శాశ్వతం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment