Agni Maha Purana - 233 / శ్రీ మదగ్ని మహాపురాణము - 233
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 233 / Agni Maha Purana - 233 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 69
🌻. స్నాన విధానము - స్నాపనోత్సవము - 3 🌻
పూర్వాది సౌమ్యనవకమునందు మధ్య దధికలశ నుంచి, మిగిలిన కలశములందు. పత్ర-ఏలా-త్వక్-కూట-బాలక చందనద్వయలతా-కస్తూరీ-కృష్ణాగురు-సిద్ధద్రవ్యములను ఉంచవలెను. ఈశాన్యనవకమధ్యమున శాంతిజలపూర్ణ కుంభముంచవలెను. మిగిలిన కలశములతో క్రమముగ చంద్ర-తార-రజత-లోహ-త్రపు-కాంస్య-సీసక-రత్నముల నుంచవలెను. ప్రతిమకు ఘృతము పూసి, ఉద్వర్తనముచేసి, మూలమంత్రముతో స్నానము చేయించవలెను. మరల దానికి గంధాదులతో పూజ చేయవలెను.
అగ్నిలో హోమము చేసి పూర్ణాహుతి ఇవ్వవలెను. సకలభూతములకు బలిప్రదానముచేసి బ్రహ్మణునకు, దక్షిణాపూర్వకముగ భోజనము చేయించవలెను. దేవతలు, మునులు, అనేకులు రాజులు కూడ భగవద్విగ్రహమునకు అభిషేకముచేయటచేతనే ఐశ్వర్యాదులను పొందిరి. ఈ విధముగ ఒక వెయ్యి ఎనిమిది కలశములతో స్నాపనోత్సవము చేయవలెను. ఇట్లు చేయుటచే మానవుడు అన్ని కామములను పొందగలడు. యజ్ఞా,వభృథస్నానమునందు కూడ పూర్ణప్నానసిద్ది కలుగును. పార్వతీలక్ష్మ్యాదుల వివాహాదులలోకూడ స్నపనోత్సవము చేయబడును.
అగ్ని మహాపురాణమునందు స్నపనోత్సవవిధి యను ఆరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 233 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 69
🌻 Mode of conducting the bathing festival (snāna) - 3 🌻
20. They should be anointed with ghee and lifted up and bathed with the principal mantra with perfumes and worshipped. Having offered oblations into the fire, the final oblation should be offered.
21. Offering should be made to all spirits. After paying fees to (the priest), (the priest and the brahmins) should be fed after having installed the images of deities, sages and other divinities.
22. Having installed (the image of the god) in this way one should conduct the bathing festival. One who bathes (the image) in one thousand eight pitchers gets all fortune.
23. By bathing at the conclusion of the rite, the bathing festival concludes. The marriage and other festivals of (the goddesses) Gaurī (consort of Śiva), Lakṣmī (consort of Viṣṇu) should be celebrated after the bathing festival.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment