🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 106 / DAILY WISDOM - 106 🌹
🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 15. ఒక అస్పష్టమైన మరియు సూక్ష్మమైన రహస్యము 🌻
మనస్సు మరియు శరీరం మధ్య సంబంధం యొక్క సమస్యకు పరిష్కారం బహుశా మానవ జీవి యొక్క మూలాల యొక్క లోతైన అధ్యయనంలో వెతకవచ్చు. ఖగోళ శాస్త్రం మరియు జీవ శాస్త్రం మానవ జీవి అణువు లేదా పరమాణువు అని పిలువబడే ఒక అవిభాజ్య పదార్థం యొక్క ఎదిగిన రూపం అని చెప్తాయి. ఉనికి యొక్క ఈ ఆదిమ స్థితిలో, పదార్థం మరియు చైతన్యం మధ్య, శరీరం మరియు మనస్సు మధ్య ఒక గీతను గీయడం అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ ఉనికి అనేది ఒక అస్పష్టమైన మరియు సూక్ష్మమైన అవ్యక్త దశలో ఉన్నట్లు కనిపిస్తుంది.
ప్రపంచాన్ని శాసించే ధృఢ నిశ్చయత, వైజ్ఞానిక మేధస్సు, తత్వ వివేకం మొదలైన ఈ అద్భుత విషయాలు వాటి సూక్ష్మ రూపంలో ఒక కణంలో నిక్షిప్తమై ఉండడం ఆశ్చర్యకరమైన విషయం కాదా? ఒక చిన్న విత్తనంలో శక్తివంతమైన మరియు విస్తృతంగా వ్యాపించే మర్రి చెట్టు ఉనికిని ఎలా వివరించవచ్చు? ఆలోచన యొక్క మూలం, శరీరం యొక్క మూలం, దాని నిర్మాణం ఇలాగే ఉండవచ్చా?
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 106 🌹
🍀 📖 The Ascent of the Spirit 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 15. An Indistinguishable and Subtle Mass of Mystery 🌻
The solution to the problem of the relation between the mind and the body is perhaps to be sought in a deeper study of the sources of the human organism itself. Investigations in the field of astrophysics and the science of life at the biological level have revealed that the human individual is a developed form of what was originally a united substance, call it an atom or cell. In this primordial condition of existence it would be impossible to draw a line between matter and consciousness, between body and mind, for here existence appears to be at the stage of an indistinguishable and subtle mass of mystery.
Is it not a wonder that poetic genius, scientific acumen and philosophic wisdom, which shake the world of mankind with their force of impact and power of conviction, should be hidden latently in a microscopic cellular form of sperm or gene or chromosome? How could one explain the presence of a mighty and wide-spreading banyan tree in an insignificantly small seed thereof? Could the origin of thought and the origin of the body be identical in its structure and formation?
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment