శ్రీ శివ మహా పురాణము - 765 / Sri Siva Maha Purana - 765
🌹 . శ్రీ శివ మహా పురాణము - 765 / Sri Siva Maha Purana - 765🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 17 🌴
🌻. విష్ణు జలంధర యుద్ధము - 1 🌻
సనత్కుమారుడిట్లు పలికెను - అపుడు మహావీరులగు రాక్షసులు భయముతో కల్లోలపడిన మనస్సు గల దేవతల నందరినీ శూలములతో, గొడ్డళ్లతో, పట్టిశములతో హింసించ మొదలిడిరి (1). రాక్షసుల ఆయుదములచే కొట్టబడిన దేహములు గల ఇంద్రాది దేవతలు అందరు భయముచే కల్లోల పడిన మనస్సులు గలవారై యుద్ధరంగమునుండి పరుగులెత్తిరి (2). ఇంద్రియములకు ప్రభువగు విష్ణువు పారిపోవుచున్న దేవతలను గాంచి గరుడుని అధిష్ఠించిన వాడై వెంటనే యుద్ధమునకు ముందునకురికెను (3). భక్తులకు అభయమునిచ్చు విష్ణువు అంతటా ప్రకాశించే కాంతులు గల సుదర్శన చక్రముతో విరాజిల్లు, పద్మము వంటి హస్తము గలవాడై ప్రకాశించెను (4).
శంఖమును, ఖడ్గమును, గదను, శార్‌ఙ్గమను ధనస్సును ధరించిన వాడు, బయంకరమగు అస్త్రములు గలవాడు, మహావీరుడు, అన్ని విధముల యుద్ధమునందు నిపుణుడు అగు విష్ణువు మిక్కిలి కోపించెను (5). విష్ణువు శార్‌ఙ్గధనస్సుపై బాణము నెక్కుపెట్టి సింహనాదమును చేసెను. ఓ మునీ! ఆ గొప్ప నాదముచు ముల్లోకములు నిండెను (6). దుఃఖముచే కల్లోలమైన మనస్సు గల విష్ణుభగవానుడు శారఞ్గధనస్సు నుండి బయల్వెడలిన బానములతో కోట్ల సంఖ్యలో రాక్షసుల తలలు తెగవేసెను (7).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 765🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 17 🌴
🌻 The fight between Viṣṇu and Jalandhara - 1 🌻
Sanatkumāra said:—
1. Then the heroic Asuras hit and struck the gods distressed and terrified, with the spears, axes and clubs.
2. With their bodies cut and pierced by the weapons of the Asuras, the gods including Indra became distressed in mind by fear and they fled from the battle.
3. On seeing the gods fleeing, Viṣṇu hastened to the battle ground seated on his vehicle Garuḍa.
4. By means of his discus Sudarśana he diffused his splendour all round. He shone with the brilliant lotus in his hand and offered fearlessness to his devotees.
5. Holding the conch, sword, mace and the bow, the heroic deity was very furious. He was efficient in the battle using fierce weapons.
6. He produced the twanging sound from his bow and roared aloud. O sage, all the three worlds were filled with its loud sound.
7. The lord Viṣṇu who was highly infuriated cut off the heads of countless Asuras by means of the arrows discharged from his bow.
Continues....
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment