🌹 01, SEPTEMBER 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 01, SEPTEMBER 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 01, SEPTEMBER 2023 FRIDAY శుక్రవారం, బృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 422 / Bhagavad-Gita - 422 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 08 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 08 🌴
3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 783 / Sri Siva Maha Purana - 783 🌹
🌻. రుద్రగణములతో రాక్షసుల యుద్ధము - 1 / The fight between the Gaṇas and the Asuras - 1 🌻
4) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 36 / Osho Daily Meditations  - 36 🌹
🍀 36. అవసరాలు మరియు కోరికలు / 36. NEEDS AND DESIRES 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 473 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 473 - 2 🌹 
🌻 473. ‘యశస్విని’ - 2 / 473. 'Yasaswini' - 2🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 01, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 06 🍀*

*11. కాళీ మా పంచికా వాగ్మీ హవిఃప్రత్యధిదేవతా ।*
*దేవమాతా సురేశానా దేవగర్భాఽంబికా ధృతిః ॥*
*12. సంఖ్యా జాతిః క్రియాశక్తిః ప్రకృతిర్మోహినీ మహీ ।*
*యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యా విభావరీ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : చేతనలో శ్రద్ధ - అన్నమయ చేతనలో శ్రద్ధ భౌతిక స్తబ్దతకు వశం కానివ్వక సత్యచేతనా ప్రతిష్ఠకు సహాయకారి ఆవుతుంది, అంతరాత్మలో శ్రద్ధ సాక్షాత్తుగా భగవతుని స్పర్శకి ఆవకాశం కల్పించి భగవంతుని సంయోగానికి సమర్పణకూ మార్గం చేస్తుంది. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ విదియ 23:51:05
వరకు తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: పూర్వాభద్రపద 14:57:33
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: ధృతి 13:09:08 వరకు
తదుపరి శూల
కరణం: తైతిల 13:35:42 వరకు
వర్జ్యం: 23:34:00 - 25:00:20
దుర్ముహూర్తం: 08:31:40 - 09:21:33
మరియు 12:41:01 - 13:30:53
రాహు కాలం: 10:42:34 - 12:16:05
గుళిక కాలం: 07:35:35 - 09:09:04
యమ గండం: 15:23:05 - 16:56:35
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:40
అమృత కాలం: 07:52:20 - 09:17:04
సూర్యోదయం: 06:02:05
సూర్యాస్తమయం: 18:30:05
చంద్రోదయం: 19:42:21
చంద్రాస్తమయం: 07:05:52
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: ధ్వాo క్ష యోగం - ధన
నాశనం, కార్య హాని 14:57:33 వరకు
తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 422 / Bhagavad-Gita - 422 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 08 🌴*

*08. న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా |*
*దివ్యం దదామి తే చక్షు: పశ్య మే యోగమైశ్వరమ్ ||*

*🌷. తాత్పర్యం : కాని ప్రస్తుత నేత్రములందే నన్ను గాంచలేవు గనుక నేను నీకు దివ్య నేత్రములను ఒసగుచున్నాను. నా యోగ వైభావమును వీక్షింపుము!*

*🌷. భాష్యము : శుద్ధభక్తుడైన వాడు శ్రీకృష్ణుని అతని ద్విభుజరూపమున కన్నను అన్యమైన ఏ రూపమునందు గాంచగోరడు. విశ్వరూపమును అతడు మనస్సుతోగాక, ఆధ్యాత్మిక చక్షువులతో ఆ దేవదేవుని కరుణ ద్వారా గాంచవలెను. కనుకనే విశ్వరూప దర్శనమునకు మనస్సునుగాక, దృష్టిని మార్చుకొనమని అర్జునుడు ఉపదేశింపబడినాడు. రాబోవు శ్లోకములందు స్పష్టపరుపబడినట్లు శ్రీకృష్ణుని విశ్వరూపము ప్రాధాన్యమైనది కాదు. అయినను అర్జునుడు కోరియున్నందున దాని దర్శనము కొరకై భగవానుడు అతనికి దివ్యదృష్టి నొసగినాడు. శ్రీకృష్ణునితో దివ్యమైన ప్రేమపూర్వక సంబంధమున చక్కగా నెలకొనిన భక్తులు అతని ప్రేమలక్షణములతోనే ఆకర్షితులగుదురు కాని విభూతిప్రదర్శచే కాదు.*

*శ్రీకృష్ణునితో ఆటలాడుకొను వారు, మిత్రులు, అతని తల్లితండ్రులు ఎన్నడును అతడు విభూతులను మరియు వైభవములను ప్రదర్శించవలెనని కోరియుండలేదు. శుద్ధప్రేమలో వారెంత మునిగియుండిరనగా అతడు దేవదేవుడనియు వారెరుగకుండిరి. తమ ప్రేమపూర్వక వ్యవహారములందు వారు శ్రీకృష్ణుడు దేవదేవుడనెడి విషయమును సైతము మరచిపోయిరి. శ్రీకృష్ణునితో ఆటలాడిన బాలురు కృతపుణ్య పుంజులనియు (ఘన పుణ్యాత్ములని) మరియు బహుజన్మల పిదపనే వారు ఆ విధముగా కృష్ణునితో క్రీడింప గలిగిరనియు శ్రీమద్భాగవతమున తెలుపబడినది. ఆ బాలురు శ్రీకృష్ణుని దేవదేవునిగా నెరుగక, తమ సన్నిహిత మిత్రునిగా భావించిరి.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 422 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 08 🌴*

*08. na tu māṁ śakyase draṣṭum anenaiva sva-cakṣuṣā*
*divyaṁ dadāmi te cakṣuḥ paśya me yogam aiśvaram*

*🌷 Translation : But you cannot see Me with your present eyes. Therefore I give you divine eyes. Behold My mystic opulence!*

*🌹 Purport : A pure devotee does not like to see Kṛṣṇa in any form except His form with two hands; a devotee must see His universal form by His grace, not with the mind but with spiritual eyes. To see the universal form of Kṛṣṇa, Arjuna is told not to change his mind but his vision. The universal form of Kṛṣṇa is not very important; that will be clear in subsequent verses. Yet because Arjuna wanted to see it, the Lord gives him the particular vision required to see that universal form.*

*Devotees who are correctly situated in a transcendental relationship with Kṛṣṇa are attracted by loving features, not by a godless display of opulences. The playmates of Kṛṣṇa, the friends of Kṛṣṇa and the parents of Kṛṣṇa never want Kṛṣṇa to show His opulences. They are so immersed in pure love that they do not even know that Kṛṣṇa is the Supreme Personality of Godhead. In their loving exchange they forget that Kṛṣṇa is the Supreme Lord. In the Śrīmad-Bhāgavatam it is stated that the boys who play with Kṛṣṇa are all highly pious souls, and after many, many births they are able to play with Kṛṣṇa. Such boys do not know that Kṛṣṇa is the Supreme Personality of Godhead. They take Him as a personal friend.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 783 / Sri Siva Maha Purana - 783 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 20 🌴*

*🌻. రుద్రగణములతో రాక్షసుల యుద్ధము - 1 🌻*

*వ్యాసుడిట్లు పలికెను- ఓ సనత్కుమారా! సర్వజ్ఞుడవగు నీవు శంకరమహాప్రభుని అద్భుతగాథను వినిపించితివి. ఈ గాథలోని లీల పావనము (1). ఓ మహర్షీ! నీవిపుడు నాపై దయను చూపి, ఆ పురుషునిచే విడిచిపెట్టబడిన రాహువు ఎచటకు వెళ్లెను? అను విషయమును మిక్కలి ప్రీతితో చెప్పుము (2).*

*సూతుడిట్లు పలికెను- మహాబుద్ధి మంతుడగు ఆ వ్యాసుని ఈ మాటను విని బ్రహ్మపుత్రుడగు ఆ మహర్షి ప్రసన్మగు మనస్సు గలవాడై ఇట్లు బదులిడెను (3).*

*సనత్కుమారుడిట్లు పలికెను- ఆ పురుషుడు రాహువును అభీరదేశములో విడిచి పెట్టుటచే, రాహువు జాతి బాహ్యుడై, భూలోకములో అట్టి ప్రఖ్యాతిని గాంచినాడు (4). తరువాత ఆతడు తనకు పునర్జన్మ లభించినదని భావించి తలవంచుకొని తొలగిన గర్వము గలవాడై మెల్లగా జలంధరుని నగరమును చేరెను (5). ఓ వ్యాసా! ఆతడు జలంధరుని వద్దకు వెళ్లి ఈశ్వరుని వ్యవహారము నంత నూ ఆ రాక్షసరాజునకు సంగ్రహముగా చెప్పెను (6). సముద్రపుత్రుడు, రాక్షసవీరులలో శ్రేష్ఠుడు, బలవంతుడు అగు జలంధరుడు ఆ వృత్తాంతమును విని కోపముతో కదలిపోయిన దేహము గలవాడు ఆయెను (7). అపుడు కొపమునకు పూర్తిగా వశమైన మనస్సు గల ఆ రాక్షసవీరుడు రాక్షససైన్యములన్నియు యుద్ధమునకు సన్నథ్ధము కావలెనని ఆదేశించెను (8).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 783🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 20 🌴*

*🌻 The fight between the Gaṇas and the Asuras - 1 🌻*

Vyāsa said:—
1. O omniscient Sanatkumāra, a wonderful story has been narrated by you, wherein the sanctifying sports of Śiva the great lord are included.

2. Now take pity on me and tell me with pleasure. O great sage, when released by that being where did Rāhu go?

Sūta said:—
3. On hearing the words of Vyāsa of immeasurable intelligence, the great sage, the delighted son of Brahmā, replied.

Sanatkumāra said:—
4. Rāhu had been let off in the land of the outcastes.[1] He too became an outcaste and came to be known in the world as such.

5. Considering that as his second birth he became humble. He became free from haughtiness. He slowly wended his way to the city of Jalandhara.

6. After approaching Jalandhara the lord of Daityas, he explained everything concerning Śiva in detail, O Vyāsa.

7. On hearing it, the powerful son of the ocean, the excellent lord of Daityas, Jalandhara became furious from head to foot.

8. Then the infuriated excellent Daitya commanded the entire army of the Daityas to enter into the fray.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 36 / Osho Daily Meditations  - 36 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 36. అవసరాలు మరియు కోరికలు 🍀*

*🕉. కోరికలు ఎక్కువ, అవసరాలు తక్కువ. అవసరాలు తీర్చవచ్చు; ఎప్పుడూ కోరికలు అనేది వెర్రి. అన్నింటినీ నెరవేర్చడం అసాధ్యం. మీరు వాటిని నెరవేర్చడానికి ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తారో, అది అంత ఎక్కువగా అడుగుతుంది.  🕉*

*అలెగ్జాండర్ మరణించి స్వర్గానికి చేరుకున్నప్పుడు అతను తన మొత్తం రాజ్యాన్ని, బంగారం, వజ్రాలు--నిజంగా కాదు, ఒక ఆలోచనగా తన బరువును మోస్తున్నాడని ఒక సూఫీ కథ ఉంది. అతను అలెగ్జాండర్ కావడం వల్ల చాలా భారం పడింది. ద్వారపాలకుడు నవ్వడం ప్రారంభించి, 'అంత భారం ఎందుకు మోస్తున్నావు?' అలెగ్జాండర్, 'ఏం భారం?' ద్వారపాలకుడు అతనికి ఒక త్రాసు ఇచ్చి, ఒక వైపు కన్ను వేసి, అలెగ్జాండర్ బరువు, హోదా, సంపద మరియు రాజ్యాన్ని మరొక వైపు వేయమని చెప్పాడు. కానీ ఆ ఒక్క కన్ను అలెగ్జాండర్ మొత్తం రాజ్యం కంటే బరువైనది. ద్వారపాలకుడు ఇలా అన్నాడు, 'ఇది మానవ నేత్రం. ఇది మానవ కోరికను సూచిస్తుంది.*

*రాజ్యం ఎంత గొప్పదైనా మరియు మీ కృషి ఎంత గొప్పదైనా అది నెరవేరదు.' అప్పుడు ద్వారపాలకుడు కంటికి కొద్దిగా ధూళిని విసిరాడు. కన్ను వెంటనే రెప్పపాటు వేసి తన బరువునంతా కోల్పోయింది. కంటి కోరికలో అవగాహన యొక్క చిన్న దుమ్ము వేయాలి. కోరిక అదృశ్యమవుతుంది మరియు అవసరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి, అవి బరువుగా ఉండవు. అవసరాలు చాలా తక్కువ, మరియు అవి అందంగా ఉంటాయి. కోరికలు వికారమైనవి మరియు అవి మనుషులను రాక్షసులుగా చేస్తాయి. పిచ్చి వ్యక్తులను సృష్టిస్తాయి. మీరు శాంతియుతంగా ఎలా ఎంచుకోవాలో నేర్చుకోవడం ప్రారంభించిన తర్వాత, ఒక చిన్న గది సరిపోతుంది; ఒక చిన్న పరిమాణంలో ఆహారం సరిపోతుంది; కొన్ని బట్టలు సరిపోతాయి; ఒక్క ప్రేమికుడు చాలు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 36 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 36. NEEDS AND DESIRES 🍀*

*🕉 Desires are many, needs are few. Needs can be fulfilled; desires never. A desire is a need Bone crazy. It is impossible to fulfill it. The more you try to fulfill it, the more it goes on asking and asking'  🕉*

*There is a Sufi story that when Alexander died and reached heaven he was carrying all his weight-his whole kingdom, gold, diamonds--of course not in reality, but as an idea. He was burdened too much by being Alexander. The gatekeeper started laughing and asked, "Why are you carrying such a burden?" Alexander said, "What burden?" So the gatekeeper gave him a scale and put an eye on one side of the scale He told Alexander to put all his weight, all his greatness, treasures and kingdom, on the other side. But that one eye still remained heavier than Alexander's whole kingdom. The gatekeeper said, "This is a human eye. It represents human desire.*

*It cannot be fulfilled, however great the kingdom and how ever great your efforts." Then the gatekeeper threw a little dust into the eye. The eye immediately blinked and lost all its weight. A little dust of understanding has to be thrown into the eye 0 desire. The desire disappears and only needs remain, which are no weighty. Needs are very few, and they are beautiful. Desires are ugly and they make monsters of men. They create mad people Once you start learning how to choose the peaceful, a small room is enough; a small quantity of food is enough; a few clothes are enough; one lover is enough.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 473 - 2  / Sri Lalitha Chaitanya Vijnanam  - 473 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।*
*సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀*

*🌻 473. ‘యశస్విని’ - 2 🌻*

*శ్రీమాత సృష్టి యందు గో రూపమునను, స్త్రీ రూపమునను, గురు రూపమునను, సద్గ్రంథ రూపముననూ, సాధువర్తనము గల సకల జీవుల యందు మిక్కుటముగ నుండును. ఇట్టి వారిని మన్నించుట, గౌరవించుట, పూజించుట, సేవలు చేయుట ద్వారా శ్రీమంతులు, కీర్తిమంతులు అగుదురు. కేవలము సమర్థత ద్వారా యశస్సు పొందుట సాధ్యపడదు. ఇట్టి వారిని కూడ శ్రీమాత అనుగ్రహించినపుడే యశస్సు కలుగును. జీవుల యశస్సు శ్రీమాత అధీనమున యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 473 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita*
*sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻*

*🌻 473. 'Yasaswini' - 2🌻*

*In the world, Shrimata resides in the form of a cow, a woman, a Guru, a Sadgrantha, and all living beings with good deeds. By forgiving them, respecting them, worshiping them, and serving them, one becomes rich and famous. Success cannot be achieved by capability alone. Success will come only when Srimata blesses them too. The glory of living beings is under the control of Sri Mata.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment