శ్రీ శివ మహా పురాణము - 780 / Sri Siva Maha Purana - 780


🌹 . శ్రీ శివ మహా పురాణము - 780 / Sri Siva Maha Purana - 780 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 19 🌴

🌻. దూత సంవాదము - 4 🌻

సనత్కుమారుడిట్లు పలికెను- రాహువు ఇట్లు పలుకు చుండగా, శూలపాణియగు శివుని కనుబొమల మధ్యనుండి భయంకరుడు, తీవ్రమగు పిడుగుతో సమమగు ధ్వని గలవాడు అగు పురుషుడు ఉదయించెను (30). సింహపు నోటిలో వలె కదలాడు చున్న నాలుక గలవాడు, నిప్పులు గ్రక్కు కన్నులవాడు, పెద్ద శరీరము గలవాడు, పైకి లేచి నిలబడిన శిరోజములు గలవాడు, శుష్కించిన దేహము గలవాడు అగు ఆ పురుషుడు అపరనృసింహుని వలె నుండెను (31). పెద్ద దేహము, పొడుగాటి బాహువులు, తాటిచెట్ల వంటి పిక్కలు కలిగి భయమును గొల్పుచున్న ఆ పురుషుడు వెంటనే వేగముగా రాహువుపైకి పరుగెత్తెను (32). తనను తినివేయుటకు వచ్చుచున్న ఆ పురుషుని గాంచి రాహువు భయపీడితుడై వేగముగా పారిపోవుచుండగా ఆ పురుషుడు ఆతనిని బయట పట్టుకొనెను (33).

రాహువు ఇట్లు పలికెను- ఓ దేవ దేవా! శరణు జొచ్చిన నన్ను రక్షించుము. నీవు దేవతలచే, రాక్షసులచే సర్వదా నమస్కరింపబడు ప్రభుడవు. నీ ఐశ్వర్యము పరమోత్కృష్టమైనది (34). ఓ మహాదేవా! ఈశానా! నీ సేవకుడు, అతి భయంకరుడు నగు ఈ పురుషుడు బ్రాహ్మణుడునగు నన్ను భక్షించుటకై మీదకు వచ్చుచున్నాడు (35). ఓ దేవదేవా! శరణాగత రక్షకుడవగు నీవు ఈతడు నన్ను తినివేయకముందే వీని నుండి నన్ను రక్షింపుము. నీకు అనేక పర్యాయములు ప్రణమిల్లు చున్నాను (36)


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 780🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 19 🌴

🌻 Jalandhara’s emissary to Śiva - 4 🌻



Sanatkumāra said:—

30. When Rāhu spoke thus, a terrific being resonant like the thunder came out from the space between the eyebrows of the trident-bearing deity.

31. He had a leonine mouth with a moving tongue; his eyes shed fiery flames; his hair stood at its end; his body was dry and rough. He appeared to be the man-lion incarnation of Viṣṇu.

32. He was huge in size. He had long arms. His calves were as stout and huge as the palmyra tree. He was very terrible. He immediately rushed at Rāhu.

33. On seeing him rushing to devour, Rāhu was terrified. He ran out when he was caught by the terrible being.


Rāhu said:—

34. “O great lord, O lord of the gods, save me who have sought refuge in you. You are always worthy of being worshipped by the gods and Asuras. You are the lord endowed with all riches and accomplishments.

35. O great lord, your terrible servant has come here to swallow me, a brahmin.

36. O lord of gods, favourably disposed to your devotees, save me lest he should devour me. Obeisance be to you again and again.”


Continues....

🌹🌹🌹🌹🌹



No comments:

Post a Comment