శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 -1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 484 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 484 -1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 99. పాయసాన్నప్రియా, త్వక్​స్థా, పశులోక భయంకరీ ।
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ ॥ 99 ॥ 🍀

🌻 484. 'డాకినీశ్వరీ' - 1 🌻


డాకినీ అను పేరు గల ఈశ్వరి శ్రీమాత అని అర్థము. నాలుగు వందల డెబ్భై నాలుగవ నామము నుండి నాలుగు వందల ఎనభై నామము వరకు గల పదకొండు నామములు విశుద్ధి చక్రమందు వసించు డాకినీ రూపముగల శ్రీమాత వర్ణనము. మానవ దేహమందలి సప్త చక్రములను అధిష్ఠించి, సప్త మాతలుగ, సప్తయోగినీ దేవతలుగ శ్రీమాత యున్నది. అందు విశుద్ధి చక్రము మొదలుకొని మూలాధారము వరకు గల పంచభూతాత్మకమైన ఐదు చక్రములను మొదటగ వర్ణించి అటుపైన ఆత్మప్రజ్ఞకు మూలస్థానమగు ఆజ్ఞా చక్రమును వర్ణించి తుదకు సప్తమ మగు సహస్రారమును శ్రీమాత శాశ్వత నిలయముగ వర్ణించుట జరిగినది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 484 -1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 Payasanna priya tvaksdha pashuloka bhayankari
amrutadi mahashakti sanvruta dakinishvari ॥ 99 ॥ 🌻

🌻 484. 'Dakinishwari' - 1 🌻


Sri Mata is the Goddess Iswari by name Dakini. The eleven names from the four hundred and seventy-fourth name to the four hundred and eighty-fourth name are the description of Srimata in the form of Dakini who resides in the Vishuddhi Chakra. The seven chakras of the human body are presided over by the Seven Mothers and the Seven Yoginis. The five chakras, which are the Panchabhuta Chakra starting from the Visuddhi Chakra and ending with the Muladhara, are first described, then the Ajna Chakra which is the root of Atmaprajna is described and finally the seventh Sahasrara is described as Srimata's eternal abode.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment