✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 20 🌴
🌻. రుద్రగణములతో రాక్షసుల యుద్ధము - 4 🌻
సనత్కుమారుడిట్లు పలికెను - మహేశ్వరుని ఈ మాటను విని గరుడధ్వజుడగు విష్ణువు వినయముతో నిండిన అంతః కరణము గలవాడై చేతులు జోడించి నమస్కరించి ఇట్లు బదులిడెను (28).
విష్ణువు ఇట్లు పలికెను - నీ అంశనుండి జన్మించిన వాడగుట, లక్ష్మికి సోదరుడగు అను కారణములచే ఆ రాక్షసుని నేను యుద్ధములో సంహరించలేదు. వానిని నీవే సంహరించుము (29) ఓ దేవదేవా! మహాబలుడు, మహావీరుడు అగు ఆ రాక్షసుని సర్వదేవతలు గాని, ఇతరులు గాని జయించలేరు. ఈ నామాట సత్యము (30). నేను దేవతలతో గూడి చిరకాలము ఆ రాక్షస వీరునితో యుద్ధమును చేసితిని. నా ఉపాయము వాని యందు విఫలమాయెను (31). ఆతని పరాక్రమమునకు నేను సంతసిల్లి 'వరమును కోరుకొనుము' అని పలికితిని. నా ఈ మాటను విని ఆతడు ఉత్తమమగు వరమును కోరెను (32). 'ఓ మహావిష్ణు! నా సోదరియగు లక్ష్మితో మరియు దేవతలతో గూడి నా ఇంటిలో నివసించుము; నాకు ఆధీనుడవై ఉండుము' అని ఆతడు కోరినాడు. కావుననే, నేనాతని గృహమునకు వెళ్లియుంటిని (33).
సనత్కుమారుడిట్లు పలికెను- విష్ణువు యొక్క ఈ మాటను విని, మంగళకరుడు దయామయుడు భక్తవత్సలుడు నగు ఆ మహేశ్వరుడు మిక్కిలి సంతసిల్లి నవ్వుతూ ఇట్లు పలికెను (34).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 786🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 20 🌴
🌻 The fight between the Gaṇas and the Asuras - 4 🌻
Sanatkumāra said:—
28. On hearing the words of lord Śiva, Viṣṇu replied humbly bowing down with palms joined in reverence.
Viṣṇu said:—
29. He was not killed in war by me because he was born of a part of yours. Moreover he is Lakṣmī’s brother. Please kill him.
30. O lord of the gods, he is very powerful, heroic and indefatigable by all the heaven-dwellers and others too. I am telling you the truth.
31. In fact a war was fought with him by me in the company of the gods. But my strategy was ineffective in regard to this great Dānava.
32. I told him “I am delighted with your valour. Tell me the boon you wish to have”. On hearing these words of mine he chose an excellent boon.
33. “O great Viṣṇu please stay in my mansion subservient to me along with my sister,[2] the gods and myself.” So I went to his mansion.
Sanatkumāra said:—
34. On hearing the words of Viṣṇu, lord Śiva who is favourably disposed to his devotees laughed and said delightedly and sympathetically.
Continues....
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment