శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 1🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।
దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀

🍀 101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀

🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 1 🌻


హృదయమందు పండ్రెండు దళములతో అనాహత పద్మము యున్నది. అందుండు శ్రీమాతను 'రాకినీదేవి' అందురు. “షట్చక్ర నిరూపణము" న యిచ్చటి మాతను 'కాకిని' అని పిలుతురు. ఈమె నలుపు నీల వర్ణము (కృష్ణ వర్ణము) గలది. అందువలన 'శ్యామా' అని పిలువ బడుచున్నది. ఈ శ్యామలాదేవి పదహారు సంవత్సరములు వయస్సుగల స్త్రీ వలె గోచరించును. శ్రీకృష్ణుడు, శ్రీమాత పదహారేండ్ల వయస్సు గల వారిగ, నిత్య యౌవనులుగ కీర్తింపబడుటకు, అతనిని 'శ్యాం' అని పిలుచుటకు, ఆమెను 'శ్యామల' అని పిలుచుటకు అంతరార్థము తెలియనగును. వారెల్లప్పుడు హృదయము నందు వసించి యుండుటయే కారణము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 485 to 494 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya
danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻

🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya
mahavirendra varada rakinyanba svarupini ॥ 101 ॥ 🌻


🌻 Description of Nos. 485 to 494 Names - 1🌻


In the heart there is an Anahata Padma with twelve petals. Srimata who resides here is called 'Rakini Devi'. In 'Shatchakra nirupana' this mother is called 'Kakini'. She is black in color (Krishna Varna). Hence she is called 'Shyama'. This dark goddess appears as a sixteen year old woman. To glorify Lord Krishna, Srimata are glorified as sixteen-year-old, eternally youthful, hence he is called 'Shyam' and she 'Shyamala'. The reason is that they always reside in the heart.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment