🌹 . శ్రీ శివ మహా పురాణము - 793 / Sri Siva Maha Purana - 793 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 21 🌴
🌻. గణాధ్యక్షుల యుద్ధము - 4 🌻
అపుడు నంది, మరియు గుహుడు వేగముగా యుద్దములోనికి ప్రవేవించి అవకాశము లేని విధముగా బాణపరంపరలతో రాక్షసులను ముంచెత్తి సంహరతించిరి (25). తెగ గొట్ట బడిన వారు, చితుక గొట్టబడినవారు, సంహరింపబడిన వారు, నేలగూలిన వారు మరియు భక్షింపబడినవారు అగు రాక్షసులతో ఆ స్తెన్యము అల్లకల్లోలమయ్యెను. స్తెన్యములో విషాదము అలుముకొనెను (26). ఈ తీరున భయంకరాకారుడు ప్రతాపవంతుడు అగు కుమారస్వామి, నంది, వీరభద్రుడు మరియు ఇతర గణములు ఆ యుద్ధములో అధికముగా గర్జించిరి (27). జలంధరుని సేనానాయకులగు నిశుంభ శుంభులు, మహాసురుడగు కాలనేమి మరియు ఇతర రాక్షసులు పరాజయమును పొందిరి (28).
అపుడు సముద్రపుత్రుడు, బలశాలి యగు జలంధరుడు తన సేన చెల్లాచెదరగుటను గాంచి, రెపరెపలాడు తున్న జెండా గల రథముప్తె నెక్కి గణముల వైపునకు వేగముగా వెళ్లెను (29). ఓ వ్యాసా! అపుడు పరాజితులై యున్న రాక్షసులు కూడా గొప్ప ఉత్సాహమును పొంది యుద్ధమునకు సన్నద్ధులై అధికముగా గర్జించిరి (30). నంది, కుమారస్వామి, గజాననుడు, వీరభద్రుడు మొదలుగా గల రుద్రగణములందరు కూడా జయోత్సాహము గలవారై, గర్జించిరి. ఓ మునీ! (31) రెండు సేనలలో గుర్రముల సకిలింపులు, ఏనుగుల ఘీంకారములు, రథముల ధ్వని, శంఖముల ధ్వని, భేరీల ధ్వని, మరియు సింహనాదములు మిన్ను ముట్టెను (32).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 793 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 21 🌴
🌻 Description of the Special War - 4 🌻
25. Nandin and Kārttikeya came hurriedly and struck the Daityas in the battle ground with incessant volleys of arrows.
26. Then the army of the Daityas became agitated and dejected with many Daityas wounded, split, killed, felled to the ground and devoured.
27. Thus Nandin, Kārttikeya the formidable and valorous, Vīrabhadra and the other Gaṇas roared much in the battle.
28. Then those two generals of the son of the ocean, Niśumbha and Śumbha, the great Daitya Kālanemi and the other Asuras were defeated.
29. On seeing the army destroyed, the powerful son of the ocean rushed at the Gaṇas in his chariot of waving and wafting colours.
30. There at even the defeated Daityas became jubilant. O Vyāsa, they roared much and got ready for the fray.
31. The victorious Gaṇas of Śiva too roared, led by Nandin, Kārttikeya, Gaṇeśa and Vīrabhadara, O sage.
32. The trumpets of the elephants, the neighing of the horses, the rumbling of the chariots, the sounds of the conches and war-drums and the leonine roars of the armies rose up.
Continues....
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment