శ్రీ శివ మహా పురాణము - 795 / Sri Siva Maha Purana - 795
🌹 . శ్రీ శివ మహా పురాణము - 795 / Sri Siva Maha Purana - 795 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 21 🌴
🌻. గణాధ్యక్షుల యుద్ధము - 6 🌻
అపుడు విఘ్నేశ్వరుడు మిక్కిలి కోపించి శివుని పాదపద్మములను స్మరించి అచటకు వచ్చి మహాబలశాలియై పరశువుతో రాక్షసుని గదను విరుగగొట్టెను (40). వీరభద్రుడు ఆ రాక్షసుని వక్షస్థ్సలముపై మూడు బాణములతో కొట్టి ఏడు బాణములతో గుర్రములను సంహరించి జెండాను, ధనస్సును మరియు గొడుగును ఛేదించెను (41). అపుడ ఆ రాక్షసరాజు మిక్కిలి కోపించి భయంకరమగు శక్తని ప్తెకి ఎత్తి విఘ్నేశ్వరుని నేలప్తె బడవేసి తాను మరియొక రథము నధిష్ఠించెన (42).
అపుడు మహాబలశాలియగు ఆ రాక్షసరాజు మనస్సులో ఆ వీరభద్రుని ఏమియూ లెక్కచేయక కోపముతో నిండినవాడై వేగముగా ఆతని ప్తెకి దండెత్తెను (43). మహవీరుడు, రాక్షసరాజు అగు జలంధరుడు ఆ వీరభద్రుని ఒక వాడి బాణముతో వేగముగా కొట్టి సింహనాదమును చేసెను (44). వీరభద్రుడు కోపించి పదున్తెన బాణముతో ఆ బాణమును ఛేదించి ఒక గొప్ప బాణముతో ఆతనిని కొట్టెను (45). ఆ తరువాత మహావీరులలో అగ్రగణ్యులు, సూర్యునితో సమమగు తేజస్సు గలవారు అగు వారిద్దరు అనేక శస్త్రాస్త్రములతో చిరకాలము ద్వంద్వయుద్దమును చేసిరి (46). అపుడు వీరభద్రుడు రథియగు ఆ జలంధరుని గుర్రములను బాణములతో నేలగూల్చి, ధనస్సును ఛేదించి, వేగముగా జెండాను కూడా పడగొట్టెను (47).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 795 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 21 🌴
🌻 Description of the Special War - 6 🌻
40. Then the infuriated hero Gaṇeśa came there after remembering the lotus like feet of Śiva and split the mace of the Daitya with his axe.
41. Vīrabhadra then hit the Dānava in his chest with three arrows. He cut off the banner, umbrella, bow and the horses of the Daitya with seven arrows.
42. Then the infuriated leader of the Daityas lifted up his terrible Śakti and felled Gaṇeśa. He mounted another chariot then.
43. The powerful leader of the Daityas did not mind Vīrabhadra at all. Angrily he rushed at him.
44. Jalandhara, the heroic king of Daityas, hit Vīrabhadra with a fierce arrow and roared.
45. The infuriated Vīrabhadra split that arrow with a sharp-edged arrow. With another great arrow he hit him too.
46. Then both of them, the most excellent of heroes refulgent like the sun, fought each other with different kinds of weapons and missiles.
47. Vīrabhadra then felled his horses with his arrows. He forcefully cut off him bow and flags too.
Continues....
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment