🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 139 / DAILY WISDOM - 139 🌹
🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 18. సంపూర్ణత యొక్క తత్వశాస్త్రం 🌻
నిజమైన తాత్విక పద్ధతి పక్కదారి పట్టకూడదు, ఏదైనా నిర్దిష్ట లేదా ప్రత్యేక సిద్ధాంతానికి పక్షపాతంగా ఉండకూడదు. అది ఊహ ఏంటో, అంటర్ప్రక్రియ ఏంటో తెలుసుకుని, విశ్లేషణాత్మకంగా, ప్రేరకంగా ఆలోచించ గలగాలి. అత్యున్నత తత్వం అనేది అంచెలంచెలుగా ఉన్నత సత్యాలను అర్థం చేసుకుంటూ, సత్యం యొక్క వ్యాపకత్వాన్ని ఇంకా ఉన్నతంగా అనుభవం లోకి తెచ్చుకుంటూ, అదే సమయంలో తర్కాన్ని సైతం పరిగణనలోకి తీసుకుంటూ అత్యున్నత సత్యం వైపు అడుగులు వేస్తుంది.
అప్పుడు విశ్లేషణాత్మక పద్ధతి ద్వారా ఈ సత్యం యొక్క వెలుగులో అనుభవ వాస్తవాలను అర్థం చేసుకుని, వివరిస్తుంది. తాత్విక విచారణ యొక్క అత్యంత సంతృప్తికరమైన పద్ధతికి ఇది గొప్ప ఉదాహరణ. తత్వశాస్త్రం అనేది సత్యం యొక్క అన్వేషణ కాబట్టి అది ప్రతిపాదించేది సత్యం యొక్క స్వభావానికి అనుగుణంగా ఉండాలి. తత్వశాస్త్రంలో మరియు ఆధ్యాత్మికతలో మీ గమ్యం మీ సాధనాల స్వభావాన్ని నిర్ణయిస్తుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 139 🌹
🍀 📖 The Philosophy of Life 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 18. The Philosophy of the Absolute 🌻
The true philosophic method should not be lopsided, should not be biased to any particular or special dogma, but comprehend within itself the processes of reflection and speculation and at the same time be able to reconcile the deductive and inductive methods of reasoning. The philosophy of the Absolute rises above particulars to greater and greater universals, basing itself on facts of observation and experience by the method of induction and gradual generalisation of truths, without missing even a single link in the chain of logic and argumentation, reflection and contemplation, until it reaches the highest generalisation of the Absolute Truth.
Then by the deductive method comes down to interpret and explain the facts of experience in the light of the nature of this Truth. This is a great example of the most satisfactory method of philosophical enquiry. Philosophy being the way of the knowledge of Truth, its method must be in agreement with the nature of Truth. In philosophy and religion the end always determines the nature of the means.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment