వినాయక చవితి శుభాకాంక్షలు, Good Wishes on Ganesh Chaturthi
🌹🍀. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి, Ganesh Chaturthi Good Wishes to All 🍀🌹
- ప్రసాద్ భరధ్వాజ
🍀. గణపతి ప్రార్ధన 🍀
శ్రీమద్గణేశం విధిముఖ్య వంద్యం గౌరీసుతం విఘ్నతమోదినేశం!
కళ్యాణ సంవర్థిత భక్తలోకం సర్వార్థ సిద్ధ్యర్థమహం భజామి!!
🌹. వినాయక చవితి ప్రాధాన్యత 🌹
భారతీయ సంప్రదాయంలో ప్రతీ పూజ, వ్రతములో విఘ్నేశ్వరుని ఆరాధన చాలా ప్రత్యేకమైంది. దక్షిణాయనంలో ప్రతీ మాసానికి ఒక ప్రాధాన్యత ఉంది. విశేషంగా భాద్రపద మాసం వినాయకుని ఆరాధనకు, ఆశ్వయుజ మాసం పార్వతీదేవి (దుర్దాదేవి) ఆరాధనకు, కార్తీకమాసం శివారాధనకు, మార్గశిరం సుబ్రహ్మణ్యుని ఆరాధనకు చాలా ప్రత్యేకమైనవి.
భాద్రపదమాసంలో వచ్చే పండుగలలో వినాయక చవితి చాలా ప్రత్యేకమైనది. ప్రప్రథమముగా ఏ పని ప్రారంభించాలన్నా గణపతి పూజతో ప్రారంభిస్తాం. పిన్నల నుండి పెద్దల వరకూ ఎంతో భక్తిశ్రద్ధలతో ఎంతో వేడుకగా చేసుకునేది ఈ చవితి పండుగ.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతా గణాలందరికీ విఘ్నేశ్వరుడు ప్రభువు. అంటే హిందువుల యొక్క సకల దేవతా గణాలకు ఆయనే ప్రభువన్న మాట. బ్రహ్మ మొదట ఈ సృష్టి కార్యాన్ని ప్రారంభించే ముందు గణపతిని పూజించినట్లు ఋగ్వేదం చెబుతోంది. బ్రహ్మవైవర్తన పురాణమందు 'గణ' శబ్దానికి "గ" అంటే విజ్ఞానమని 'ణ' అంటే మోక్షమని అర్థం చెప్పబడింది. ఈ సృష్టి అంతా గణాలతో కూడుకుని ఉంది. అటువంటి గణాలు అన్నీ కలిస్తేనే ఈ ప్రపంచం. అట్టి ప్రపంచాన్ని అహంకారానికి గుర్తు అయిన మూషికాన్ని అధిరోహించి పాలించే ప్రభువు ఈ మహాగణపతి. ఇట్టి గణపతిని ఆరు రూపాలుగా పూజలు జరుపుతూంటారు. 1. మహాగణపతి, 2. హరిద్ర గణపతి, 3. స్వర్ణ గణపతి, 4. ఉచ్చిష్ట గణపతి, 5. సంతాన గణపతి, 6. నవనీత గణపతి అని అలాగే ప్రపంచం అంతటా వారి వారి ప్రాంతీయతను బట్టి వివిధ నామాలతో ఆరాధిస్తూ ఉంటారు. ఈ జ్యేష్టరాజునకు సిద్ధి, బుద్ధి అను ఇద్దరు కుమార్తెలను విశ్వరూప ప్రజాపతి వివాహం చెయ్యగా వారికి క్షేముడు,లాభుడు అనే కుమారులు కలిగినారు. అందువల్ల ఆయన ఆరాధన వల్ల క్షేమం, లాభం కలుగుతుందని ప్రతీతి.
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment