1) 🌹 21, NOVEMBER 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 460 / Bhagavad-Gita - 460 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 46 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 46 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 816 / Sri Siva Maha Purana - 816 🌹
🌻. దేవతలు శివుని స్తుతించుట - 2 / Prayer by the gods - 2 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 73 / Osho Daily Meditations - 73 🌹
🍀 73. ప్రేమ / 73. LOVE 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 503 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 503 - 2 🌹
🌻 503. 'లాకిన్యంబా స్వరూపిణి' - 2 / 503. lakinyanba svarupini - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 21, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : అక్షయ నవమి, జగధ్దాత్రి పూజ, Akshaya Navami, Jagaddhatri Puja 🌻*
*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 28 🍀*
*56. అపరాజితో జితారాతిః సదానందద ఈశితా |*
*గోపాలో గోపతిర్యోద్ధా కలిః స్ఫాలః పరాత్పరః*
*57. మనోవేగీ సదాయోగీ సంసారభయనాశనః |*
*తత్త్వదాతాఽథ తత్త్వజ్ఞస్తత్త్వం తత్త్వప్రకాశకః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : అసత్ప్రవృత్తి - నీలోని ఏ విభాగమందు ఏ అసత్ప్రవృత్తి వున్నా అది గుర్తించడం నీ అంతరంగిక వికాసానికి మొదటిమెట్టు, అసత్ప్రవృత్తి అనగా తప్పు తలపు, తప్పు మాట, తప్పుచేత, ఏదైనా కావచ్చు. సత్యం నుండి పరచేతన నుండి, భగవత్సథం నుండి తప్పించేది ఏదైనా అది అసత్ప్రవృత్తే అవుతుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల-నవమి 25:11:17 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: శతభిషం 20:02:27 వరకు
తదుపరి పూర్వాభద్రపద
యోగం: వ్యాఘత 17:41:13 వరకు
తదుపరి హర్షణ
కరణం: బాలవ 14:13:35 వరకు
వర్జ్యం: 04:13:30 - 05:43:50
మరియు 26:03:36 - 27:34:00
దుర్ముహూర్తం: 08:38:59 - 09:24:02
రాహు కాలం: 14:50:38 - 16:15:06
గుళిక కాలం: 12:01:42 - 13:26:10
యమ గండం: 09:12:46 - 10:37:14
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23
అమృత కాలం: 13:15:30 - 14:45:50
సూర్యోదయం: 06:23:51
సూర్యాస్తమయం: 17:39:33
చంద్రోదయం: 13:23:12
చంద్రాస్తమయం: 00:23:14
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: మృత్యు యోగం - మృత్యు
భయం 20:02:27 వరకు తదుపరి
కాల యోగం - అవమానం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 460 / Bhagavad-Gita - 460 🌹*
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 46 🌴*
*46. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ |*
*తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే ||*
*🌷. తాత్పర్యం : ఓ విశ్వరూపా! సహస్రబాహో! కిరీటము ధరించి శంఖ,చక్ర, గద, పద్మములను హస్తములందు కలిగియుండెడి నీ చతుర్భుజ రూపమును గాంచగోరుదురు. నిన్ను ఆ రూపమునందు గాంచ నేను అభిలషించుచున్నాను.*
*🌷. భాష్యము : బ్రహ్మసంహిత యందు (5.39) “రామాదిమూర్తిషు కలానియమేన తిష్ఠన్” అని చెప్పబడినది. అనగా శ్రీకృష్ణభగవానుడు వేలాది రూపములలో నిత్యస్థితుడై యుండుననియు మరియు రాముడు, నృసింహుడు, నారాయాణాది రూపములు వానిలో ముఖ్యమైనవనియు తెలుపబడినది. వాస్తవమునకు అట్టి రూపములు అసంఖ్యాకములు. కాని శ్రీకృష్ణుడు ఆదిదేవుడనియు, ప్రస్తుతము తన తాత్కాలిక విశ్వరూపమును ధరించియున్నాడనియు అర్జునుడు ఎరిగియున్నాడు. కనుకనే అతని దివ్యమగు నారాయణరూపమును చూపుమని అర్జునుడు ప్రార్థించుచున్నాడు. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడనియు మరియు ఇతర రూపములు అతని నుండియే ఉద్భవించుననియు తెలిపిన శ్రీమధ్భాగవత వచనము ఈ శ్లోకము నిస్సందేహముగా నిర్ధారించు చున్నది.*
*ప్రధాన విస్తృతాంశములైన వివిధ రూపములు అతనికి అభిన్నములు. అట్టి అసంఖ్యాక రూపములన్నింటి యందును అతడు భగవానుడే. వాటన్నింటి యందును నిత్య యౌవననిగా అలరారుట యనునది ఆ దేవదేవుని ముఖ్యలక్షణమై యున్నది. దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చి తెలిసికొనగలిగినవాడు భౌతికజగత్తు యొక్క సమస్త కల్మషము నుండి శీఘ్రమే ముక్తుడు కాగలడు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 460 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 46 🌴*
*46. kirīṭinaṁ gadinaṁ cakra-hastam icchāmi tvāṁ draṣṭum ahaṁ tathaiva*
*tenaiva rūpeṇa catur-bhujena sahasra-bāho bhava viśva-mūrte*
*🌷 Translation : O universal form, O thousand-armed Lord, I wish to see You in Your four-armed form, with helmeted head and with club, wheel, conch and lotus flower in Your hands. I long to see You in that form.*
*🌹 Purport : In the Brahma-saṁhitā (5.39) it is stated, rāmādi-mūrtiṣu kalā-niyamena tiṣṭhan: the Lord is eternally situated in hundreds and thousands of forms, and the main forms are those like Rāma, Nṛsiṁha, Nārāyaṇa, etc. There are innumerable forms. But Arjuna knew that Kṛṣṇa is the original Personality of Godhead assuming His temporary universal form. He is now asking to see the form of Nārāyaṇa, a spiritual form.*
*This verse establishes without any doubt the statement of the Śrīmad-Bhāgavatam that Kṛṣṇa is the original Personality of Godhead and all other features originate from Him. He is not different from His plenary expansions, and He is God in any of His innumerable forms. In all of these forms He is fresh like a young man. That is the constant feature of the Supreme Personality of Godhead. One who knows Kṛṣṇa becomes free at once from all contamination of the material world.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 816 / Sri Siva Maha Purana - 816 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 25 🌴*
*🌻. దేవతలు శివుని స్తుతించుట - 2 🌻*
*ఓ ప్రభూ! పూర్వము యదువంశమునకు ప్రభువు, భక్తుడు అగు దాశార్హుడు, మరియు ఆతని భార్యయగు కలావతి భక్తిచేతనే పరమసిద్ధి (మోక్షము)ని పొందియున్నారు (9). ఓ దేవదేవా! అదే విధముగా, మిత్రసహ మహారాజు మరియు ఆతని ప్రియురాలగు మదయంతి నీయందలి భక్తి చేతనే పరమకైవల్య (మోక్ష)మును పొందినారు (10). కేకయమహారాజుయొక్క అన్నగారి కుమార్తె యగు సౌమిని అదే విధముగా నీయందలి భక్తిచే మహాయోగులకైననూ లభించని పరమసుఖము (మోక్షము) ను పొందెను (11).*
*ఓ ప్రభూ! విమర్షణ మహా రాజు నీ భక్తిచే ఏడు జన్మలవరకు అనేక భోగములననుభవించి ఉత్తమగతి (మోక్షము) ని పొందెను (12). చంద్రసేన మహారాజు నీ భక్తిచే దుఃఖమునుండి విముక్తుడై ఇహలోకములో భోగముల నన్నిటినీ అనుభవించి దేహత్యాగానంతరము పరమసుఖమును పొందెను (13). గొల్లయువతి పుత్రుడు, మహావీరుని శిష్యుడు అగు శ్రీకరుడు నీ భక్తిచే ఇహలోకములో గొప్ప సుఖముననుభవించి పరలోకములో సద్గతిని పొందెను (14). నీవు సత్యరథ మహారాజుయొక్క దుఃఖమును పోగొట్టి సద్గతినొసంగితివి. నీవు రాజకుమారుడగు ధర్మగుప్తునకు ఇహలోకములో సుఖములనొసంగి సంసారసముద్రమును దాటించితివి (15).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 816 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 25 🌴*
*🌻 Prayer by the gods - 2 🌻*
9. O lord, it was by his devotion alone that the founder of the Yadu family, the devotee Dāśārha and his wife Kalāvatī attained great success.
10. O lord of gods, the king Mitrasaha and his beloved queen Madayantī attained great salvation through devotion to you.
11. The daughter of the elder brother of the king of Kekayas named Sauminī attained happiness inaccessible to even great Yogins, by his devotion to you.
12. O lord, by devotion to you the excellent king Vimarṣaṇa enjoyed worldly pleasures for seven births in various ways and ultimately attained the goal of the good.
13. The excellent king Candrasena enjoyed all pleasures, became free from misery and experienced great happiness here and hereafter by devotion to you.
14. Śrīkara, the son of a cowherdess and the disciple of Mahāvīra enjoyed the goal of the good here and great happiness hereafter by his devotion to you.
15. You removed the misery of the king Satyaratha and you conferred good goal on him. You enabled the prince Dharmagupta to cross the ocean of worldly existence and made him happy here.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 73 / Osho Daily Meditations - 73 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 73. ప్రేమ 🍀*
*🕉. ప్రేమ అసంపూర్తిగా ఉన్నందున ప్రతి ప్రేమికుడు ఏదో కోల్పోయినట్లు భావిస్తాడు. ప్రేమ అనేది ఒక ప్రక్రియ, ఒక విషయం కాదు. ప్రతి ప్రేమికుడు ఏదో తక్కువైనట్లు అనుభూతి చెందుతాడు. దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఇది కేవలం ప్రేమ క్రియాశీలకమైనది అవడం వల్ల వచ్చిన అనుభూతి మాత్రమే. 🕉*
*ప్రేమ అనేది ఒక నది లాంటిది, ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. నది యొక్క ఉనికి కదలికలోనే ఉంది. ఎప్పుడైతే అది కదలడం మానేస్తుందో, అప్పుడే అది నదిగా ఉండడం మానేసింది. నది అంటేనే మనకు అందులో కదలిక ఉందని మనకు అర్థమవుతుంది. దాని శబ్దం మీకు కదలిక అనుభూతిని ఇస్తుంది. ప్రేమ ఒక నది. కాబట్టి ఏదో తప్పిపోయిందని అనుకోకండి; అది ప్రేమ ప్రక్రియలో భాగం. ఇంకా పూర్తికాకపోవడమే విశేషం. ఏదైనా తక్కువైనప్పుడు మీరు దాని గురించి ఏదైనా చేయాలి-అది ఉన్నత మరియు ఉన్నత శిఖరాల నుండి పిలుపు. మీరు వాటిని చేరుకున్నప్పుడు మీరు సంపూర్ణత అనుభూతి చెందుతారని కాదు. ప్రేమ ఎప్పుడూ నెరవేరినట్లు అనిపించదు. దానికి నెరవేర్పు తెలియదు, కానీ అది అందంగా ఎందుకు ఉంటుందంటే అందులో సజీవత ఉంటుంది కాబట్టి.*
* మరియు ఏదో సమన్వయంతో లేదని మీరు ఎల్లప్పుడూ భావిస్తారు. అది కూడా సహజమే, ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు, రెండు వేర్వేరు ప్రపంచాలు కలుస్తాయి. అవి సరిగ్గా సరిపోతాయని ఆశించడం అసాధ్యమైన విషయం. అది నిరాశను సృష్టిస్తుంది. అంటే పూర్తి సమన్వయంతో ఉన్న అరుదైన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది ఇలాగే ఉండాలి. ఆ సమన్వయం సృష్టించడానికి అన్ని ప్రయత్నాలు చేయండి, కానీ అది సరిగ్గా జరగకపోతే నిరాశ చెందకండి. దాని గురించి చింతించకండి, లేకుంటే మీరు మరింతగా సమన్వయం కోల్పోతారు. మీరు దాని గురించి చింతించనప్పుడు మాత్రమే ఇది వస్తుంది. మీకు దాని గురించి ఆదుర్దా లేనప్పుడు, మీరు ఆశించనప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది - అలా అకస్మాత్తుగా.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 73 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 73. LOVE 🍀*
*🕉 Every lover feels that something is missing, because love is unfinished. It is a process, not a thing, Every lover is bound to feel that something is missing. Don’t interpret it wrongly. It simply shows the love in itself is dynamic. 🕉*
*Love is just like a river, always moving. In the very movement is the life of the river. Once it stops it becomes a stagnant thing; then it is no longer a river. The very word river shows a process, the very sound of it gives you th e feeling of movement. Love is a river. So don't think that something is missing; it is part of love's process. And it is good that it is not completed. When something is missing you have to do something about it-that is a call from higher and higher peaks. Not that when you reach them you will feel fulfilled; love never feels fulfilled. It knows no fulfillment, but it is beautiful because then it is alive forever and ever.*
*And you will always feel that something is not in tune. That too is natural, because when two persons are meeting, two different worlds are meeting. To expect that they will fit perfectly is to expect the impossible, and that will create frustration. At the most there are a few moments when everything is in tune, rare moments. This is how it has to be. Make all efforts to create that intuneness, but always be ready if it doesn't happen perfectly. And don't be worried about it, otherwise you will fall more and more out of tune. It comes only when you are not worried about it. It happens only when you are not tense about it, when you are not even expecting it-just out of the blue.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 503- 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 503 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 103. రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా ।*
*సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ ॥ 103 ॥ 🍀*
*🌻 503. 'లాకిన్యంబా స్వరూపిణి' - 2 🌻*
*అన్నపానీయాదులు, శరీర సుఖము అలవడిన జీవుడు అందే యుండుట కిష్టపడుచూ శరీరమును వదలుటకు దుఃఖ పడుచుండును. అంతకు మునుపు రక్తమాంసాదులతో కూడిన పిండములో ప్రవేశించుటకు దుఃఖపడును. శ్రీమాత మాయ ప్రాతిపదికగ దుఃఖకరమైనది సుఖముగను, సుఖకరమైనది దుఃఖముగను జీవుడు అనుభవించుచు నుండును. జీవుల సంస్కారమును బట్టి సుఖ దుఃఖములు మారుచు నుండును. లాకిణీ మాత అనుగ్రహ మున్నచో అవస్థితి, ఉత్తమ స్థితి అను భేదము నశించును. బురద యందు జీవించుటకు సాధారణముగ మనిషి అంగీకరింపడు. కాని బురద యందు వానపాములు వసించు చున్నవి.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 503 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻103. Rakta-varna mansanishta gudanna pritamanasa*
*samsta bhakta sukhada lakinyanba svarupini ॥ 103 ॥ 🌻*
*🌻 503. lakinyanba svarupini - 2 🌻*
*A person who is addicted to food and drink and the pleasures of the body will be sad to leave the body. Before that, it grieves to enter the flesh-and-blood embryo. According to Srimata's Maya, what is sad becomes happiness and what is happiness becomes sad. Pleasures and sorrows vary according to the samskara of living beings. But if one has Mother's grace, the difference between lower state and best state disappears. A common man would not agree to live in mud. But earthworms live in mud.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj
No comments:
Post a Comment