🌹 27, NOVEMBER 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 27, NOVEMBER 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 27, NOVEMBER 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 463 / Bhagavad-Gita - 463 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 49 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 49 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 819 / Sri Siva Maha Purana - 819 🌹
🌻. దేవతలు శివుని స్తుతించుట - 5 / Prayer by the gods - 5 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 76 / Osho Daily Meditations  - 76 🌹
🍀 76. ప్రేమ తక్షణ కాఫీ కాదు / 76. LOVE IS NOT A INSTANT COFFEE 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 505 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 505 - 1 🌹 
🌻 505. 'చతుర్వక్త్ర మనోహరా' - 1 / 505. Chaturvaktra manohara - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 27, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*🍀. శ్రీ గురునానక్‌ జయంతి శుభాకాంక్షలు అందరికి, Sri Guru Nanak Jayanti Good Wishes to All 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : కార్తీక పౌర్ణమి, శ్రీ గురునానక్‌ జయంతి, Kartik Purnima, Sri Guru Nanak Jayanti 🌻*

*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 53 🍀*

*109. ప్రీతాత్మా పరమాత్మా చ ప్రయతాత్మా ప్రధానధృత్ |*
*సర్వపార్శ్వ ముఖస్త్ర్యక్షో ధర్మసాధారణో వరః*
*110. చరాచరాత్మా సూక్ష్మాత్మా అమృతో గోవృషేశ్వరః |*
*సాధ్యర్షిర్వ సురాదిత్యః వివస్వాన్స వితాఽమృతః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఆత్మ సమత - మానసిక సమత - యోగ సాధన యందు రక్షించబడే సమత ఆత్మసమత గాని, మానసిక సమత గాదు. అభివ్యక్తిలో ఏ భేదాలు, తారతమ్యాలు వున్నా అంతటా ఒకే ఆత్మను, ఒకే దైవాన్ని దర్శించడంపై ఆధారపడిన సమత అది. మానసిక సమత ఈ భేదాలను, తారతమ్యాలను, త్రోసిపుచ్చి, అంతా సమానమేనన్నట్లు వ్యవహరించడానికి, అంతా సమానం చేసి వేయడానికి ప్రయత్నిస్తుంది.🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: పూర్ణిమ 14:47:35 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: కృత్తిక 13:37:14 వరకు
తదుపరి రోహిణి
యోగం: శివ 23:38:47 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: బవ 14:49:35 వరకు
వర్జ్యం: 01:51:00 - 03:25:00
మరియు 29:33:20 - 31:09:04
దుర్ముహూర్తం: 12:25:50 - 13:10:39
మరియు 14:40:17 - 15:25:07
రాహు కాలం: 07:51:18 - 09:15:20
గుళిక కాలం: 13:27:27 - 14:51:30
యమ గండం: 10:39:23 - 12:03:25
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:25
అమృత కాలం: 11:15:00 - 12:49:00
సూర్యోదయం: 06:27:15
సూర్యాస్తమయం: 17:39:34
చంద్రోదయం: 17:34:24
చంద్రాస్తమయం: 06:12:02
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: స్థిర యోగం - శుభాశుభ
మిశ్రమ ఫలం 13:37:14 వరకు తదుపరి
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 463 / Bhagavad-Gita - 463 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 49 🌴*

*49. మా తే వ్యథా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్ |*
*వ్యపేతభీ: ప్రీతమనా: పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య ||*

*🌷. తాత్పర్యం : నా ఈ ఘోర రూపమును చూచి నీవు కలత నొందిన వాడవు, భ్రాంతుడవు అయితివి. అదియంతయు నిపుడు అంతరించును గాక, ఓ భక్తుడా! అన్ని కలతల నుండియు విముక్తుడవై నీవు కోరిన రూపమును ప్రశాంత మనస్సుతో ఇప్పుడు గాంచుము.*

*🌷. భాష్యము : పూజనీయ పితామహుడైన భీష్ముని మరియు గురువైన ద్రోణుని వధించుటపట్ల అర్జునుడు ఆది యందు వ్యథ నొందెను. కాని పితామహుని వధించుట యందు అట్టి వెరుగు అవసరము లేదని శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశించెను. ధృతరాష్ట్ర తనయులు ద్రౌపదని కౌరవసభలో వివస్త్రను చేయ యత్నించినపుడు ఆ భీష్మ, ద్రోణులు మౌనము వహించిరి. ధర్మనిర్వహణలో అట్టి నిర్లక్ష్యకారణముగా వారు వాధార్హులు. వారు అధర్మయుత కర్మ వలన వారు ఇదివరకే సంహరింపబడిరని తెలియజేయుటకే అర్జునునకు శ్రీకృష్ణుడు విశ్వరూపమును చూపెను.*

*సాధారణముగా భక్తులు శాంతులును మరియు అట్టి ఘోరకార్యములను నొనరింప లేని వారును అయి యుందురు కావున అర్జునునకు విశ్వరూపము చూపబడినది. విశ్వరూప ప్రదర్శన ప్రయోజనము సిద్ధించియున్నందున అర్జునుడు చతుర్భుజ రూపమును గాంచగోరగా, శ్రీకృష్ణుడు దానిని అర్జునునకు చూపెను. ప్రేమభావముల పరస్పర వినిమయమునకు అవకాశమొసగనందున భగవానుని విశ్వరూపము నెడ భక్తుడు ఎక్కువగా ఆసక్తిని కలిగియుండడు. అతడు కేవలము దేవదేవునికి భక్తిపూర్వక నమస్సులు అర్పించవలెను గాని లేదా ద్విభుజ కృష్ణరూపమును గాంచవలెను గాని కోరును. తద్ద్వారా అతడు ఆ దేవదేవునితో ప్రేమయుక్తసేవలో భావవినిమయము కావింపగలడు.*
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 463 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 49 🌴*

*49. mā te vyathā mā ca vimūḍha-bhāvo dṛṣṭvā rūpaṁ ghoram īdṛṅ mamedam*
*vyapeta-bhīḥ prīta-manāḥ punas tvaṁ tad eva me rūpam idaṁ prapaśya*

*🌷 Translation : You have been perturbed and bewildered by seeing this horrible feature of Mine. Now let it be finished. My devotee, be free again from all disturbances. With a peaceful mind you can now see the form you desire.*

*🌹 Purport : In the beginning of Bhagavad-gītā Arjuna was worried about killing Bhīṣma and Droṇa, his worshipful grandfather and master. But Kṛṣṇa said that he need not be afraid of killing his grandfather. When the sons of Dhṛtarāṣṭra tried to disrobe Draupadī in the assembly of the Kurus, Bhīṣma and Droṇa were silent, and for such negligence of duty they should be killed. Kṛṣṇa showed His universal form to Arjuna just to show him that these people were already killed for their unlawful action. That scene was shown to Arjuna because devotees are always peaceful and they cannot perform such horrible actions.*

*The purpose of the revelation of the universal form was shown; now Arjuna wanted to see the four-armed form, and Kṛṣṇa showed him. A devotee is not much interested in the universal form, for it does not enable one to reciprocate loving feelings. Either a devotee wants to offer his respectful worshipful feelings, or he wants to see the two-handed Kṛṣṇa form so that he can reciprocate in loving service with the Supreme Personality of Godhead.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 818 / Sri Siva Maha Purana - 818 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 25 🌴*

*🌻. దేవతలు శివుని స్తుతించుట - 4 🌻*

*సనత్కుమారుడిట్లు పలికెను- ఆ బ్రహ్మాది దేవతలు మహర్షులతో గూడి ఇట్లు స్తుతించి శివుని పాదములపై లగ్నమైన మనస్సులు గలవారై అపుడు మిన్నకుండిరి (32). అపుడు మహేశ్వరుడగు శంభుప్రభుడు పవిత్రమగు దేవతల స్తుతిని విని శ్రేష్ఠమగు వరములనిచ్చి వెంటనే అచటనే అంతర్హితుడాయెను (33). బ్రహ్మ మొదలగు దేవతలందరు కూడ శత్రువులు నశించుటచే ఆనందించిన వారై శివుని సత్కీర్తిని ప్రేమతో గానము చేయుచూ తమ తమ స్థానములకు వెళ్లిరి (34).*

*మహేశ్వరుడు జలంధరుని సంహరించుట అనే ఈ గొప్ప గాథ పవిత్రమైనది, మరియు మహాపాపములను నశింపచేయునది (35). ఈ పవిత్రమగు దేవతల స్తుతి పాపములనన్నిటినీ పోగొట్టి నిత్యము సర్వసుఖముల నిచ్చును. ఈ స్తుతి మహేశునకు ఆనందమును కలిగించును (36). ఈ రెండు గాథలను ఎవరు పఠించెదరో, లేదా పఠింపజేసెదరో వారు ఇహలోకములో గొప్ప సుఖమునను భవించి గణాధ్యక్షస్థానమును పొందెదరు (37).*

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండములో దేవస్తుతి వర్ణనమనే ఇరువది అయిదవ అధ్యాయము ముగిసినది (25).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 818 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 25 🌴*

*🌻 Prayer by the gods - 4 🌻*

Sanatkumāra said:—
32. After eulogising Brahmā, other gods and the great sages, the gods remained silent with their minds fixed on Śiva’s feet.

33. The great lord Śiva heard the auspicious prayer of the gods, conferred boons on them and then vanished immediately from the scene.

34. Brahmā and other gods were jubilant as the enemies had been killed. Delightfully singing the great glory of Śiva, they left for their own abodes.

35. This great narrative describing the suppression of Jalandhara is a sanctifying story of lord Śiva that destroys all sins.

36. This prayer of the gods is holy and destructive of sins. It bestows happiness on the devotees and is delightful to Śiva.

37. He who reads or teaches the two narratives, enjoys great happiness here and becomes the lord of Gaṇas hereafter.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 76 / Osho Daily Meditations  - 76 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 76. ప్రేమ తక్షణ కాఫీ కాదు 🍀*

*🕉. ప్రేమ అనేది మీరు చేయగలిగేది కాదు. కానీ మీరు ఇతర పనులు చేసినప్పుడు, ప్రేమ జరుగుతుంది. 🕉*

*మీరు చేయగలిగే చిన్న చిన్న పనులు ఉన్నాయి - కలిసి కూర్చోవడం, చంద్రుడిని చూడటం, సంగీతం వినడం-ఏవీ నేరుగా ప్రేమ కాదు. ప్రేమ చాలా సున్నితమైనది. మీరు దానిని నేరుగా చూస్తే, అది అదృశ్యమవుతుంది. మీకు తెలియకుండా, వేరే పని చేస్తున్నప్పుడు మాత్రమే ఇది వస్తుంది. మీరు బాణంలా నేరుగా వెళ్ళలేరు. ప్రేమ లక్ష్యం కాదు. ఇది చాలా సూక్ష్మమైన దృగ్విషయం; చాలా బెరుకుగా ఉంటుంది. నేరుగా వెళ్తే దాక్కుంటుంది. నేరుగా ఏదైనా చేస్తే మిస్ అవుతారు. ప్రపంచం ప్రేమ విషయంలో చాలా మూర్ఖంగా మారింది. వారికి వెంటనే కావాలి. వారికి ఇది ఇన్‌స్టంట్ కాఫీ లాగా కావాలి-మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ చేస్తే అది అక్కడ ఉండాలి. ప్రేమ ఒక సున్నితమైన కళ; మీరు చేయగలిగేది ఏమీ లేదు.*

*అప్పుడప్పుడు ఆ అరుదైన ఆనంద క్షణాలు వస్తాయి... తర్వాత ఏదో తెలియనిది దిగుతుంది. ఆపై మీరు భూమిపై లేరు; స్వర్గంలో ఉన్నారు. మీ ప్రేమికుడితో కలిసి ఒక పుస్తకాన్ని చదవడం, ఇద్దరూ దానిలో లోతుగా నిమగ్నమైనప్పుడు, అకస్మాత్తుగా మీ ఇద్దరి చుట్టూ భిన్నమైన స్వభావం ఏర్పడినట్లు మీరు కనుగొంటారు. ఏదో ఒక ప్రకాశంలా మీ ఇద్దరినీ చుట్టుముట్టింది మరియు అంతా ప్రశాంతంగా ఉంది. కానీ మీరు నేరుగా ఏమీ చేయలేదు. మీరు ఇప్పుడే ఒక పుస్తకాన్ని చదువుతున్నారు, లేదా సుదీర్ఘ నడక కోసం వెళుతున్నారు, బలమైన గాలికి వ్యతిరేకంగా చేయి చేయి పట్టుకుని-అకస్మాత్తుగా అది ఉంది. ఇది ఎల్లప్పుడూ అకస్మాత్తుగా వస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 76 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 76. LOVE IS NOT A INSTANT COFFEE 🍀*

*🕉  Love is not a thing you can do. But when you do other things, love will happen.  🕉*

*There are small things you can do-sitting together, looking at the moon, listening to music-nothing directly to do with love. Love is very delicate, fragile. If you look at it, gaze at it directly, it will disappear. It comes only when you are unaware, doing something else. You cannot go directly, arrowlike. Love is not a target. It is a very subtle phenomenon; it is very shy. If you go directly, it will hide. If  you do something directly, you will miss it. The world has become very stupid about love. They want it immediately.  They want it like instant coffee-whenever you want it, order it, and it is there. Love is a delicate art; it is nothing you can do.*

*Sometimes those rare blissful moments come ... then something of the unknown descends. You are no longer on the earth; you are in paradise. Reading a book with your lover, both deeply absorbed in it, suddenly you find that a different quality of being has arisen around you both.  Something surrounds you both like an aura, and everything is peaceful. But you were not doing anything directly. You were just reading a book, or just going for a long walk, hand-in-hand against the strong wind-and suddenly it was there. It always takes you unaware.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 505 -1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 505 - 1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  104. స్వాధిష్ఠానాంబుజగతా, చతుర్వక్త్ర మనోహరా ।*
*శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,ఽతిగర్వితా ॥ 104 ॥ 🍀*

*🌻 505. 'చతుర్వక్త్ర మనోహరా' - 1 🌻*

*నాలుగు ముఖములతో మనోజ్ఞముగ నుండునది శ్రీమాత అని అర్ధము. నాలుగు ముఖములనగా నాలుగు భూతములు అస్థిత్వముగా కలది అని అర్థము. అవి వరుసగా 1. ఆకాశము (విశుద్ధి), 2. వాయువు (అనాహతము), 3. అగ్ని (మణిపూరకము), 4. జలము (స్వాధిష్ఠానము). పంచభూతాత్మకమగు సృష్టిలో స్వాధిష్టానము చేరుసరికి నాలుగు భూతముల సృష్టి ఏర్పడును. ఐదవది అయిన పృథివి మూలాధారమున ఏర్పడును. అందువలన మూలాధార దేవత పంచవక్త్ర. స్వాధిష్ఠాన దేవత చతుర్వక్త్ర. మణిపూరక దేవత త్రివక్త్ర. అనాహత దేవత ద్వివక్త్ర (వదనద్వయ). విశుద్ధి దేవత ఏకవక్త్ర (ఏకవదన). ఇట్లు తెలియ నగును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 505 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻104. Svadhishtananbujagata chaturvaktra manohara*
*shuladyayudha sanpanna pitavarna tigarvita ॥ 104 ॥ 🌻*

*🌻 505. Chaturvaktra manohara - 1 🌻*

*It means the beautiful one with four faces is Srimata. By four faces it means that she is identified by the four elements. They are respectively 1. Sky (Vishuddhi), 2. Vayu (Anahata), 3. Fire (Manipuraka), 4. Water (Svadhishthana). When Swadhishthana joins the creation that has five elements the creation of four elements takes place. The fifth element Prithivi is formed in the Mooladhara. Thus the diety at Mooladhara is Panchavaktra. Swadhishthana deity is Chaturvaktra. Manipuraka Goddess Trivaktra. Anahata Goddess Dvivaktra (two faced). Vishuddhi Goddess Ekavaktra (single faced). Thus it goes.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment