శ్రీమద్భగవద్గీత - 458: 11వ అధ్., శ్లో 44 / Bhagavad-Gita - 458: Chap. 11, Ver. 44

 

🌹. శ్రీమద్భగవద్గీత - 458 / Bhagavad-Gita - 458 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 44 🌴

44. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయమ్ ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్ |
పితవే పుత్రస్య సఖేవ సఖ్యు: ప్రియ: ప్రియాయార్హసి దేవ సోఢుమ్ ||


🌷. తాత్పర్యం : నీవు ప్రతిజీవికిని పూజనీయుడైన దేవదేవుడవు. కనుకనే సాష్టాంగపడి గౌరవపూర్వక వందనములను అర్పించుచు నీ కరుణకై వేడుచున్నాను. కుమారుని మొండితనమును తండ్రి, మిత్రుని అమర్యాదను మిత్రుడు, ప్రియురాలిని ప్రియుడు సహించునట్లు, నీ యెడ నొనరించిన నా తప్పులను దయతో సహింపుము.

🌷. భాష్యము : కృష్ణభక్తులు శ్రీకృష్ణునితో పలువిధములైన సంబంధములను కలిగియుందురు. ఒకరు కృష్ణుని పుత్రునిగా భావించవచ్చును, ఇంకొకరు కృష్ణునిగా భర్తగా భావించవచ్చును, మరియొకరు అతనిని మిత్రునిగా లేదా ప్రభువుగా తలచవచ్చును. ఇచ్చట అర్జునుడు శ్రీకృష్ణునితో మిత్రత్వ సంబంధమును కలిగియున్నాడు. తండ్రి, భర్త లేదా యజమాని సహనగుణము కలిగియుండునట్లుగా శ్రీకృష్ణుడు సైతము సహనగుణమును కలిగియుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 458 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 44 🌴

44. tasmāt praṇamya praṇidhāya kāyaṁ prasādaye tvām aham īśam īḍyam
piteva putrasya sakheva sakhyuḥ priyaḥ priyāyārhasi deva soḍhum


🌷 Translation : You are the Supreme Lord, to be worshiped by every living being. Thus I fall down to offer You my respectful obeisances and ask Your mercy. As a father tolerates the impudence of his son, a friend the impertinence of a friend, or a husband the familiarity of his wife, please tolerate the wrongs I may have done You.

🌹 Purport : Kṛṣṇa’s devotees relate to Kṛṣṇa in various relationships; one might treat Kṛṣṇa as a son, or one might treat Kṛṣṇa as a husband, as a friend, or as a master. Kṛṣṇa and Arjuna are related in friendship. As the father tolerates, or the husband or a master tolerates, so Kṛṣṇa tolerates.

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment