🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 71 / Osho Daily Meditations - 71 🌹
✍️. ప్రసాద్ భరద్వాజ
🍀 71. బలమైన గాలులు 🍀
🕉. గట్టిగా కొట్టే బలమైన గాలులు నిజంగా శత్రువులు కాదు. అవి మిమ్మల్ని ఏకత్వం వైపు నడిపిస్తాయి. అవి మిమ్మల్ని సమూలంగా పెకలించి వేస్తాయేమో అని మీకు అనిపించ వచ్చు. కానీ నిజానికి అవి మిమ్మల్ని ఇంకా బలపరుస్తాయి. 🕉
ఒక చెట్టు గురించి ఆలోచించండి. మీరు గది లోపలకి ఒక చెట్టు తీసుకురావచ్చు. అప్పుడు అది ఒక విధంగా రక్షించ బడుతుంది; దాని మీద గాలి అంత గట్టిగా ఉండదు. బయట తుఫానులు వచ్చినప్పుడు, అది ప్రమాదంలో ఉండదు. కానీ ఎటువంటి సవాలు ఉండదు; ప్రతిదీ రక్షించ బడుతుంది. మీరు దానిని వెచ్చని ఇంట్లో ఉంచవచ్చు, కానీ చెట్టు నెమ్మదిగా పాలిపోతుంది. ఇంక అది పచ్చగా ఉండదు. దానిలోని ప్రాణం క్రమంగా క్షీణిస్తుంది. ఎందుకంటే సవాలు జీవితాన్ని బలపరుస్తుంది. గట్టిగా కొట్టే బలమైన గాలులు నిజంగా శత్రువులు కాదు. అవి మిమ్మల్ని ఏకత్వం వైపు నడిపిస్తాయి. అవి మిమ్మల్ని పెకిలించి వేస్తాయేమో అని మీకు అనిపించవచ్చు. కానీ, నిజానికి అవి మిమ్మల్ని బలపరుస్తాయి.
మీరు మీ మూలాలను తుఫాను చేరుకుని నాశనం చేయగల దానికంటే మరింత లోతుగా పంపుతారు. సూర్యుడు చాలా వేడిగా ఉండి కాల్చేస్తాడేమో అనిపిస్తుంది. కానీ చెట్టు సూర్యుని నుండి తనను తాను రక్షించుకోవడానికి ఎక్కువ నీటిని పీల్చుకుంటుంది. ఇది ఇంకా పచ్చగా మారుతుంది. సహజ శక్తులతో పోరాడడం వల్ల అది ఒక నిర్దిష్ట ఆత్మను పొందుతుంది. ఆత్మ పోరాటం ద్వారానే పుడుతుంది. విషయాలు చాలా సులభం అయితే, మీరు చెదిరి వేయబడతారు. అలా క్రమేణా మీరు చెదిరిపోతారు. ఎందుకంటే మీలో మిమ్మల్ని ఏకీకృతం చేసే ప్రాణం ఉండదు. మీరు అతిగా ముద్దు చేయడం వల్ల పాడైన పిల్లాడిలా తయారవుతారు. కాబట్టి సవాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొండి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 71 🌹
📚. Prasad Bharadwaj
🍀 71. STRONG WINDS 🍀
🕉 Those strong winds that hit hard are not really enemies. They help to integrate you. They look as if they will uproot you, but in fighting with them you become rooted. 🕉
Think of a tree. You can bring a tree inside the room and, in a way, it will be protected; the wind will not be so hard on it. When storms are raging outside, it will be out of danger. But there w ill be no challenge; everything will be protected. You can put it in a hothouse, but by and by the tree will start becoming pale, it w ill not be green. Something deep inside it will start dying-because challenge shapes life. Those strong winds that hit hard are not really enemies. They help to integrate you. They look as if they will uproot you, but in fighting with them you become rooted.
You send your roots even deeper than the storm can reach and destroy. The sun is very hot and it seems it will burn, but the tree sucks up more water to protect itself against the sun. It becomes greener and greener. Fighting with natural forces, it attains to a certain soul. The soul arises only through struggle. If things are very easy, you start dispersing. By· and by you disintegrate, because integration is not needed at all. You become like a pampered child. So when a challenge happens, live it courageously.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment