శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 505 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 505 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 505 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 505 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 104. స్వాధిష్ఠానాంబుజగతా, చతుర్వక్త్ర మనోహరా ।
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,ఽతిగర్వితా ॥ 104 ॥ 🍀

🌻 505. 'చతుర్వక్త్ర మనోహరా' - 2 🌻


ఆకాశము నందు నాలుగు భూతములు యిమిడి యున్నవి. వాయువు నందు మిగిలిన మూడును. అట్లే యితర భూతములను అవగాహన చేసుకొనవలెను. స్వాధిష్ఠానము విశుద్ధి నుండి నాలుగవ చక్రము. అనగా యిందు ఆకాశము, వాయువు, అగ్ని, జలము వ్యక్తమై పృథివి అవ్యక్తముగ యుండును. కనుక నాలుగు ముఖములు. నాలుగు ముఖముల తల్లి మనోజ్ఞముగ నుండుటకు కారణము ఘనీభవింపక యుండుట చేతనే. రూపము కరుడు గట్టిన తరువాత అందము కోల్పోవును. లేతగా యున్నప్పుడు అందముండును. పృథివీ తత్త్వము లేశమాత్రమే యున్నప్పుడు అంద మెక్కువగా గోచరించును. లేతదనమునకు ముదురుతనమునకు గల తేడా సులభముగనే యుండును కదా!



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 505 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻104. Svadhishtananbujagata chaturvaktra manohara
shuladyayudha sanpanna pitavarna tigarvita ॥ 104 ॥ 🌻

🌻 505. Chaturvaktra manohara - 2 🌻

There are four elements in the sky. The other three in the air. Similarly other elements should be understood. Swadhisthana is the fourth chakra from Vishuddhi. That is, the sky, air, fire, and water are manifested and the earth is invisible. So four faces. The reason for the four-faced mother's beauty is because of the liquidity. The beauty loses after the appearance becomes solidified. It's beautiful when it's tender. Beauty is most visible when the earthy spirit is barely present. The difference between tender and tough is easy!


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment