శ్రీ శివ మహా పురాణము - 819 / Sri Siva Maha Purana - 819


🌹 . శ్రీ శివ మహా పురాణము - 819 / Sri Siva Maha Purana - 819 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 26 🌴

🌻. విష్ణువు యొక్క మోహమును తొలగించుట - 1 🌻


వ్యాసుడిట్లు పలికెను - ఓ బ్రహ్మపుత్రా! నీకు నమస్కారము. ఓ శివభక్తాగ్ర గణ్యా! నీవు ధన్యుడవు. నీవు మహాదివ్యము. శుభకరమునగు ఈ శంకరుని గాథను వినిపించి నావు (1). ఓ మునీ! ఇపుడు విష్ణుచరితమును ప్రేమతో చెప్పుము. ఆయన బృందను మోహింప జేసిన తరువాత ఏమి చేసెను? ఎచటకు వెళ్లెను? (2).

సనత్కుమారుడిట్లు పలికెను- ఓ వ్యాసా! వినుము. నీవు గొప్ప బుద్ధిశాలివి. శివభక్తులలో ఉత్తముడవు. శంభుని చరితముతో విరాజిల్లునది, మిక్కిలి పవిత్రమైనది అగు విష్ణు చరితమును చెప్పెదను (3) శరణాగతవత్సలుడు, మహేశ్వరుడునగు శంభుడు బ్రహ్మాది దేవతలు మిన్నకుండగా మిక్కిలి ప్రసన్నుడై ఇట్లు పలికెను (4).

శంభుడు ఇట్లు పలికెను- ఓ బ్రహ్మా! సర్వదేవ పుంగవులారా! జలంధరుడు నా అంశనుండి జన్మించిన వాడే అయిననూ, మీ కొరకై వానిని సంహరించితిని. నేను నిస్సందేహముగా సత్యమును పలుకుచున్నాను (5). ఓ పుత్రులారా! మీకు సుఖము కలిగినదా? లేదా ? ఓ దేవతలారా! సత్యమును పలుకుడు. సర్వదా నిర్వికారుడనగు నా లీల మీకొరకు మాత్రమే గదా! (6)

సనత్కుమారుడిట్లు పలికెను - అపుడు బ్రహ్మ మొదలగు దేవతలు ఆనందముతో విప్పారిన నేత్రములు గల వారై రుద్రునకు తలవంచి నమస్కరించి విష్ణువృత్తాంతమును చెప్పిరి (7).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 819 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 26 🌴

🌻 The Vanishing of Viṣṇu’s delusion - 1 🌻


Viṣṇu said:—

1. O son of Brahmā, obeisance be to you. O excellent devotee of Śiva, you are blessed, since you have narrated this highly divine and auspicious story of Siva.

2. O sage, now narrate lovingly the story of Viṣṇu. After enchanting Vṛndā what did he do? Where did he go?


Sanatkumāra said:—

3. O Vyāsa, listen. O intelligent excellent devotee of Śiva, listen to the good story of Viṣṇu mingled with the story of Śiva.

4. When Brahmā and other gods became silent, lord Śiva, favourably disposed to those who seek refuge in him, was delighted and said.


Śiva said:—

5. O Brahmā, O ye excellent gods, it is for you that Jalandhara has been killed by me although he was a part of myself. Truth. It is the truth that I say.

6. O dear gods, tell me the truth. Have or have not you attained happiness? It is for you that I indulge in sports though I am always free from all aberrations.


Sanatkumāra said:—

7. Then Brahmā and other gods, with eyes blooming with delight, bowed to Śiva with bent heads and mentioned to him the activities of Viṣṇu.



Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment