🌹 . శ్రీ శివ మహా పురాణము - 815 / Sri Siva Maha Purana - 815 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 25 🌴
🌻. దేవతలు శివుని స్తుతించుట - 1 🌻
సనత్కుమారుడిట్లు పలికెను - అపుడు బ్రహ్మాదిదేవతలు మరియు మునులందరు దేవదేవుడగు శివుని నమస్కరించి ఆనందకరమగు వచనములతో స్తుతించిరి (1).
దేవతలిట్లు పలికిరి - ఓ దేవదేవా! మహాదేవా! శరణు జొచ్చు వారిని ప్రేమతో రక్షించువాడా! నీవు సర్వకాలములయందు సాధుపురుషులకు సౌఖ్యముల నొసంగెదవు ; మరియు భక్తుల దుఃఖమును పోగొట్టెదవు (2). గొప్ప అద్భుతమైన పవిత్రలీలలు గల నీవు భక్తిచే పొందదగుదువు. దుష్టులకు నిన్ను ఆరాధించుటగాని, పొందుటగాని సంభవము కాదు. ఓ నాథా! నీవు సర్వకాలములలో ప్రసన్నుడవు కమ్ము (3). వేదము కూడ నీ మహిమను యథాతథముగా నెరుంగదు. మహాత్ములందరు తమ బుద్ధికి అందినంతవరకు నీ పవిత్రకీర్తిని గానము చేయుచున్నారు (4). ఇంద్రాదులు అతి రహస్యమగు నీ మహిమను సర్వకాలములలో మిక్కిలి ప్రీతితో గానముచేసి తమ వాక్కును పవిత్రము చేసుకొనుచున్నారు (5).
ఓ దేవదేవా! నీ దయచే మూర్ఖుడు బ్రహ్మజ్ఞాని యగును. నీవు సర్వదా భక్తిచే పొందదగుదువని వేదములు చెప్పుచున్నవి (6). వికారములు లేని వాడవు, సత్పురుషులకు శరణ్యుడవు, దీనుల పాలిట రక్షకుడవు, సర్వవ్యాపకుడవు అగు నీవు సర్వదా మంచి భక్తిచే సాక్షాత్కరించెదవు (7). ఓ మహేశ్వరా! అనేకులు నీ భక్తిచేతనే సిద్ధిని పొందినారు. వారు ఇహలోకములో సర్వ సుఖములనను భవించినప్పుడు, మరియు దుఃఖమును పొందినప్పుడు వికారమును పొందలేదు (8).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 815 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 25 🌴
🌻 Prayer by the gods - 1 🌻
Sanatkumāra said:—
1. Then Brahmā, other gods and the sages eulogised lord Śiva humbly by means of pleasing words.
The gods said:—
2. O great lord, lord of the gods favourably disposed to those who seek refuge, you always bestow happiness upon the saintly men and quell the misery of your devotees.
3. O lord, you exhibit wonderfully good divine sports and are available by devotion. You are incapable of being attained or propitiated by the evil-minded. Be favourable to us always.
4. Even the Veda does not know your greatness in reality. Noble men sing your great glory to the extent of their intellect.
5. Indra[1] and others sing your secret greatness always with pleasure and sanctify their own tongue.
6. O lord of gods, by your favour even a sluggish person realizes Brahman. The Vedas say that you are always attainable by devotion.
7. You are merciful to the distressed. You are all pervasive. You manifest yourself by good devotion. You are free from aberrations. You are the goal of the good.
8. O Lord Śiva, by devotion alone people have attained the power of miracles. They became indifferent to the pleasures they enjoy or the miseries they have to face.
Continues....
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment