✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 25 🌴
🌻. దేవతలు శివుని స్తుతించుట - 2 🌻
ఓ ప్రభూ! పూర్వము యదువంశమునకు ప్రభువు, భక్తుడు అగు దాశార్హుడు, మరియు ఆతని భార్యయగు కలావతి భక్తిచేతనే పరమసిద్ధి (మోక్షము)ని పొందియున్నారు (9). ఓ దేవదేవా! అదే విధముగా, మిత్రసహ మహారాజు మరియు ఆతని ప్రియురాలగు మదయంతి నీయందలి భక్తి చేతనే పరమకైవల్య (మోక్ష)మును పొందినారు (10). కేకయమహారాజుయొక్క అన్నగారి కుమార్తె యగు సౌమిని అదే విధముగా నీయందలి భక్తిచే మహాయోగులకైననూ లభించని పరమసుఖము (మోక్షము) ను పొందెను (11).
ఓ ప్రభూ! విమర్షణ మహా రాజు నీ భక్తిచే ఏడు జన్మలవరకు అనేక భోగములననుభవించి ఉత్తమగతి (మోక్షము) ని పొందెను (12). చంద్రసేన మహారాజు నీ భక్తిచే దుఃఖమునుండి విముక్తుడై ఇహలోకములో భోగముల నన్నిటినీ అనుభవించి దేహత్యాగానంతరము పరమసుఖమును పొందెను (13). గొల్లయువతి పుత్రుడు, మహావీరుని శిష్యుడు అగు శ్రీకరుడు నీ భక్తిచే ఇహలోకములో గొప్ప సుఖముననుభవించి పరలోకములో సద్గతిని పొందెను (14). నీవు సత్యరథ మహారాజుయొక్క దుఃఖమును పోగొట్టి సద్గతినొసంగితివి. నీవు రాజకుమారుడగు ధర్మగుప్తునకు ఇహలోకములో సుఖములనొసంగి సంసారసముద్రమును దాటించితివి (15).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 816 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 25 🌴
🌻 Prayer by the gods - 2 🌻
9. O lord, it was by his devotion alone that the founder of the Yadu family, the devotee Dāśārha and his wife Kalāvatī attained great success.
10. O lord of gods, the king Mitrasaha and his beloved queen Madayantī attained great salvation through devotion to you.
11. The daughter of the elder brother of the king of Kekayas named Sauminī attained happiness inaccessible to even great Yogins, by his devotion to you.
12. O lord, by devotion to you the excellent king Vimarṣaṇa enjoyed worldly pleasures for seven births in various ways and ultimately attained the goal of the good.
13. The excellent king Candrasena enjoyed all pleasures, became free from misery and experienced great happiness here and hereafter by devotion to you.
14. Śrīkara, the son of a cowherdess and the disciple of Mahāvīra enjoyed the goal of the good here and great happiness hereafter by his devotion to you.
15. You removed the misery of the king Satyaratha and you conferred good goal on him. You enabled the prince Dharmagupta to cross the ocean of worldly existence and made him happy here.
Continues....
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment