శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 513 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 513 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 513 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 513 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 105. మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా ।
దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ ॥ 105 ॥ 🍀
🌻 513. 'కాకినీ రూప ధారిణీ' - 1🌻
స్వాధిష్ఠాన మందలి అమ్మవారిని కాకినీదేవి అని లలితా సహస్రమున చెప్పబడి యున్నది. కాకిని అనగా కకార భావము కలిగి యుండునది. కకారము కామబీజము. కామము దివ్యము, అమృతమయము. దానిని భూమిపై సవ్యముగ నిర్వర్తించగల శక్తి సిద్ధులకు ఉండును. ఇతరులు అట్టి శక్తిని పొందునంత వరకు భూమిపై అనుభవము చెందుచూ, జనన మరణముల చక్రమందు తిరుగు చుందురు. యోగ శాస్త్రమున హృదయమునకు కాకినీమాత నిర్వచింప బడినది. యోగ శాస్త్రమున ఈ కేంద్రమునకు స్వాధిష్ఠాన పద్మమున రాకినీమాత తెలుపబడగ, యిచ్చట కాకినీ అని తెలుపబడినది. స్వాధ్యాయమున తెలియవలసిన కొన్ని విషయములు ఈ విధముగ వ్యత్యాసముతో గోచరించుట కద్దు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 513 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻105. Medhonishta maduprita bandinyadi samanvita
dadyannasakta hrudaya kakini rupadharini ॥ 105 ॥ 🌻
🌻 513. 'Kakini Roopa Dharini' - 1🌻
It is said in Lalita Sahasram that the Goddess of the Sacral chakra is Kakini Devi. Ka syllable is seat of desire. Desire is divine, filled with fulfilment. Siddhas have the power to perform it properly on earth. Others, till they reach the siddha stage, get trapped in experiences on earth and thus go round in the cycles of birth and death. In Yoga Shastra Kakinimata is defined as the heart. In Yoga Shastra, Rakinimata is told as the presiding goddess of this chakra. But here, kakinimata is days to be the presiding goddess. Things should not be confused with this kind of difference in the explanations but they have to be understood by self experience.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment