శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 520 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 5


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 520 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 5 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 107. ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ ।
ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥ 🍀

🌻 520. 'సాకిన్యంబా స్వరూపిణీ' - 5 🌻

మాంసముకన్న మినుమే బలమైనదని ఋషులు తేల్చి చెప్పినారు. మినుము ఇనుమే అను నానుడి కలదు. మాస్టర్ సి.వి.వి. అను పరమగురువు యోగ సాధకుల కందరికినీ సాధనకు మునుపే రెండు మినుప ఇడ్లీలు భుజింపుడని శాసించినారు. భారతదేశమున ఆహార సంప్రదాయము లన్నియూ కేవల ఆరోగ్యమునకే సంబంధించినవి కాక యోగమునకు కూడ ఉపకారములుగ యేర్పరచినారు. బియ్యము, మినుము సమపాళ్ళలో రుబ్బుకొని ఆవిరి కుడుములుగ నేర్పరచుకొని వాటిపై తగు మాత్రము ఆవు నెయ్యిని వేసుకొని ప్రథమ ఆహారముగ భుజించుట ఉత్తమము. మూలాధారము నుండియే నిద్రాణమైన శ్రీమాత చైతన్యము ఉద్భవించి జీవులను చైతన్య మార్గమున ఊర్ధ్వగతికి చేర్చును. దీనినే కుండలినీ ప్రచోదనమని అందురు.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 5 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻107. Mudgaodanasaktachitta sakinyanba svarupini
aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥ 🌻

🌻 520. Sakinyanba Svarupini - 5 🌻


Sages concluded that black gram is stronger than meat. There is a saying that black gram is strong as iron. Master C.V.V. a paramaguru has ruled that all yoga practitioners should eat two idlis made from black gram before practice. All the food traditions in India are not only related to health but also beneficial to yoga. It is best to grind rice and black gram evenly and make steamed dumplings and apply adequate amount of cow ghee on them and eat it as the first food. The dormant Sri Mata Chaitanya emerges from the source and guides the living beings to progress on the path of Chaitanya. This is called kundalini prachodana.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment