శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 521 - 528 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 521 - 528 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥

108. మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా ।
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥ 🍀


🌻 521 to 528 నామ వివరణము - 1 🌻


అత్యంత ప్రధానము, మహిమాన్వితము, సౌందర్యమగు ఆజ్ఞా పద్మమందలి శ్రీమాత వర్ణింపబడుచున్నది. ఆజ్ఞా పద్మము రెండు దళములు గలదియై యున్నది. ఇడ పింగళ ప్రజ్ఞలు రెండు దళములుగ వికసింపగ దాని మధ్యమున అమితమగు తెల్లని ప్రకాశముతో శ్రీమాత యుండును. వజ్ర సమానమైన ప్రకాశమది. సూర్యుని కాధారమై సూర్యుని నుండి దిగివచ్చు వెలుగు. అమిత కాంతివంతము, అత్యాకర్షణ వంతము - ఇచ్చటి శ్రీమాత రూపము. మిగిలిన ఐదు పద్మములకు ఆధార మీ పద్మము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥

108. Majasansdha hansavati mukhyashakti samanvita
haridranai karasika hakinirupa dharini ॥ 108 ॥ 🌻


🌻 521 to 528 Names Explanation - 1🌻


The most important, glorious and beautiful Srimata in the Ajna Padma is described. Ajna Padma has two petals. Where the Ida Pingala forces bloom as two petals Srimata resides in the middle with a dazzling white residence. It is equivalent to the radiance of a diamond. It is the Light that supports the Sun and coming from the Sun. Immensely radiant and immensely beautiful is the form of Srimata here. This lotus is the basis for the remaining five lotuses.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment