శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 521 - 528 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 7
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 521 - 528 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 7 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥
108. మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా ।
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥ 🍀
🌻 521 to 528 నామ వివరణము - 7 🌻
ఆరు శక్తులు కూడిన శక్తిని ముఖ్య శక్తి అందురు. ఈ ముఖ్య శక్తినే కుమారు డందురు. కుమారుడు శ్రీమాతను అనుసరించి యుండును, అంటి పెట్టుకొని యుండును. అందువలననే కుమారుడు షణ్ముఖుడుగా కీర్తింప బడుచున్నాడు. కుమార శక్తియే శ్రీమాత శూలముగా ప్రకాశించుచుండును. దీనిని మించిన శక్తి లేదు. ఈ శక్తి ఎప్పుడునూ శ్రీమాతను అంటిపెట్టుకునే యుండును గనుక ముఖ్యశక్తి సమన్వితా అని కీర్తించుట జరిగినది. హంస స్వరూపిణి యని ముందు తెలుపబడినది కదా! శిష్టులకు ఈమె హంస స్వరూపిణి, దుష్టులకు ఈమె హింసా స్వరూపిణి. దుష్టులను సింహమువలె హింసించగలదు. అందువలన సింహవాహిని అయినది. శిష్టులకు హంసవలె గోచరించి ఉత్తమోత్తమ మగు దివ్యానుభూతి, రస సిద్ధి కలిగించు చుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 521 - 528 - 7 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥
108. Majasansdha hansavati mukhyashakti samanvita
haridranai karasika hakinirupa dharini ॥ 108 ॥ 🌻
🌻 521 to 528 Names Explanation - 7 🌻
The power of the six forces is called the main power. This main power is known as the son. The son follows the mother and sticks to her. That is why the son is glorified as Shanmukha. This Kumara Shakti shines as Srimata's trident. There is no power beyond this. Since this main power is always attached to Sri Mata, she is glorified as Mukhya Sakthi Samanvita. She was mentioned as Hamsa Swaroopini earlier. She is the form of a swan (Hamsa swaroopini) to the righteous and a form of violence (Himsa Swaroopini) to the wicked. She can torment the wicked like a lion. Hence she is Simha Vahini. She appears as a swan to the sages and bestows on them the best divine feeling and rasa siddhi.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment