శ్రీ శివ మహా పురాణము - 846 / Sri Siva Maha Purana - 846

🌹 . శ్రీ శివ మహా పురాణము - 846 / Sri Siva Maha Purana - 846 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 31 🌴

🌻.బ్రహ్మవిష్ణువులకు శివుని ఉపదేశము - 1 🌻


సనత్కుమారుడిట్లు పలికెను - మిక్కిలి దీనులగు ఆ బ్రహ్మ విష్ణువుల ఈ మాటలను విని శంభుడు నవ్వి మేఘగర్జన వలె గంభీరమగు స్వరముతో నిట్లనెను (1).

శివుడిట్లు పలికెను - ఓ హరీ! కుమారా! ఓ బ్రహ్మా! శంఖచూడుని వలన కలిగిన భయమును మీరు పూర్తిగా విడిచిపెట్టుడు. మీకు నిస్సంశయముగా మంగళము కలుగగలదు (2). ఓ ప్రభూ! శంఖచూడుని వృత్తాంతమును నేను పూర్తిగా యథాతథముగా నెరుంగుదును. ఆతడు పూర్వజన్మలో కృష్ణభక్తుడు అగు సుదాముడనే గోపాలకుడు (3). ఇంద్రియాధిపతియగు విష్ణువు నాయాజ్ఞచే కృష్ణరూపమును దాల్చి నాచే శాసింపబడే సుందరమగు గోలోకము నందు గోశాలయందున్నాడు (4). పూర్వము ఆతడు తాను స్వతంత్రుడనని భావించి మోహితుడై స్వేచ్ఛాచారివలె అనేక క్రీడలను చేసెను (5). వాని ఆ మిక్కిలి తీవ్రమగు మోహమును గాంచి నేను నా మాయచే వారి మంచిబుద్ధిని ఉపసంహరించి శాపమునిప్పించితిని. (6). ఇట్లు నా లీలను ప్రకటించి, తరువాత నా మాయను ఉపసంహరించితిని అపుడు వారు తొలగిన మోహము గల వారై సద్బుద్ధిని, జ్ఞానమును పొందిరి (7). వారు దీనవదనులై నా వద్దకు వచ్చి వినయముతో నమస్కరించి చేతులు జోడించి భక్తితో చక్కని స్తోత్రమును చేసిరి (8).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 846 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 31 🌴

🌻 Śiva’s advice to Viṣṇu and Brahmā - 1 🌻



Sanatkumāra said:—

1. On hearing these words of the distressed Viṣṇu and Brahmā, Śiva laughingly spoke in the rumbling tone of the cloud.


Śiva said:—

2. “O dear Viṣṇu, O Brahmā, cast off your fear from all sides. Certainly something good will result from the activities of Śaṅkhacūḍa.

3. I know all the details of his activities factually as well as those of Sudāmā the cowherd devotee of Kṛṣṇa.

4. At my bidding Viṣṇu has assumed the form of Kṛṣṇa and is stationed in the cowshed in the beautiful Goloka presided over by me.

5. Considering himself independent under a delusion he indulged in many kinds of sportive dalliance like a deluded licentious person.

6. On seeing his excessive delusion as a result of my deceptive art I suppressed their virtuous intellect and made them suffer curse.

7. Having thus performed my sport, I suppressed the illusion. Regaining knowledge they got rid of delusion and became well-intentioned.

8. They came near me in a piteous plight. After bowing to me they eulogised me devoutly and humbly with palms joined in reverence.


Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment