1) 🌹 05, FEBRUARY 2024 MONDAY సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 497 / Bhagavad-Gita - 497 🌹
🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -28 / Chapter 12 - Devotional Service - 28 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 852 / Sri Siva Maha Purana - 852 🌹
🌻. పుష్పదంతుడు శంఖచూడునకు నచ్చజెప్పుట - 1 / The Emissary is sent - 1 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 110 / Osho Daily Meditations - 110 🌹
🍀 110. ఉన్నత మార్గం కోసం బ్రహ్మచర్యం తప్పనిసరి / 110. BRAHMACHARYA IS MUST FOR HIGHER PATH 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 532 / Sri Lalitha Chaitanya Vijnanam - 532 🌹
🌻 532. 'శుక్ల సంస్థితా’ - 1 / 532. 'Shukla Sanstita' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 05, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 123 🍀*
*123. వ్రతాధిపః పరం బ్రహ్మ భక్తానాంపరమాగతిః |*
*విముక్తో ముక్తతేజాశ్చ శ్రీమానః శ్రీవర్ధనో జగతః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : అంతర్గమన, ఊర్ధ్వగమన ప్రయోజనాలు : లోలోపలకు చొచ్చి హృత్పురుష చేతనను ముందునకు గొనితెచ్చుట వలన అవరప్రకృతి యంతయూ దివ్యపరివర్తన కొరకు సన్నద్ధమగును. పిమ్మట ఊర్ధ్వగామి యగుటచే సాధకుడు మనస్సును అతిక్రమించ గలిగి, ఒక్కొక్కమెట్టే పైపైకి పోవుచుండు కొలదీ ఒక్కొక్క నూత్న చైతన్య ఉపలబ్ధిని పొందనేర్చుటే గాక, ఆ నూత్న చైతన్య ప్రభావముచే నాతని ప్రకృతి యెల్ల ప్రభావితమై పోవుటయు జరుగును. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
హేమంత ఋతువు, ఉత్తరాయణం,
పుష్య మాసము
తిథి: కృష్ణ దశమి 17:26:13 వరకు
తదుపరి కృష్ణ ఏకాదశి
నక్షత్రం: అనూరాధ 07:54:46
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: ధృవ 10:52:19 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: విష్టి 17:18:13 వరకు
వర్జ్యం: 13:25:48 - 15:00:36
దుర్ముహూర్తం: 12:52:54 - 13:38:39
మరియు 15:10:07 - 15:55:51
రాహు కాలం: 08:12:45 - 09:38:31
గుళిక కాలం: 13:55:48 - 15:21:33
యమ గండం: 11:04:16 - 12:30:02
అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52
అమృత కాలం: 22:54:36 - 24:29:24
సూర్యోదయం: 06:46:59
సూర్యాస్తమయం: 18:13:04
చంద్రోదయం: 02:13:49
చంద్రాస్తమయం: 13:27:27
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: మానస యోగం - కార్య
లాభం 07:54:46 వరకు తదుపరి
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 497 / Bhagavad-Gita - 497 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 08 🌴*
*08. అమానిత్వమదమ్భిత్వమహింసా క్షాన్తిరార్జవమ్ |*
*ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహ: ||*
*🌷. తాత్పర్యం : వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణిక గురువు నాశ్రయించుట, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము.,*
*🌷. భాష్యము : ఈ జ్ఞానవిధానము అల్పజ్ఞులైన మనుజులచే కొన్నిమార్లు కర్మక్షేత్రపు అంత:ప్రక్రియ యనుచు తప్పుగా భావింపబడును. కాని వాస్తవమునకు ఇదియే నిజమైన జ్ఞానవిధానము. ఇట్టి విధానము మనుజుడు స్వీకరించినచో పరతత్త్వమును చేరగల అవకాశము కలుగ గలదు. పూర్వము వివరించినట్లు ఈ జ్ఞానము కర్మక్షేత్రము నందలి ఇరువదినాలుగు అంశముల యొక్క అంత:ప్రక్రియ గాక వాటి బంధము నుండి ముక్తి నొందుట నిజమైన మార్గమై యున్నది.*
*మొదటిదైన వినమ్రత అనగా ఇతరులచే గౌరవమును పొందవలెనని ఆరాటపడకుండుట యని భావము.*
*అహింస యనునది చంపకుండుట లేదా దేహమును నశింపజేయకుండుటనెడి భావనలో స్వీకరించుబడుచుండును. కాని వాస్తవమునకు ఇతరులను కష్టపెట్టకుండుటయే అహింస యనుదాని భావము.*
*సహనమనగా ఇతరుల నుండి కలుగు మానావమానములను సహించు ఆభాసమును కలిగియుండుట యని భావము.*
*ఆర్జవమనగా ఎట్టి తంత్రము లేకుండా శత్రువునకు సైతము సత్యమును తెలుప గలిగనంత ఋజుత్వమును కలిగి యుండుట యని భావము.*
*ఆధ్యాత్మిక జీవనమున పురోగతి సాధింపవలెను దృఢ నిశ్చయమును మనుజుడు కలిగి యుండుటయే స్థిరత్వమను దాని భావము.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 497 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 08 🌴*
*08. amānitvam adambhitvam ahiṁsā kṣāntir ārjavam*
*ācāryopāsanaṁ śaucaṁ sthairyam ātma-vinigrahaḥ*
*🌷 Translation : Humility; pridelessness; nonviolence; tolerance; simplicity; approaching a bona fide spiritual master; cleanliness; steadiness; self-control;*
*🌹 Purport : This process of knowledge is sometimes misunderstood by less intelligent men as being the interaction of the field of activity. But actually this is the real process of knowledge. If one accepts this process, then the possibility of approaching the Absolute Truth exists. This is not the interaction of the twenty-four elements, as described before. This is actually the means to get out of the entanglement of those elements.*
*Humility means that one should not be anxious to have the satisfaction of being honored by others.*
*Nonviolence is generally taken to mean not killing or destroying the body, but actually nonviolence means not to put others into distress.*
*Tolerance means that one should be practiced to bear insult and dishonor from others.*
*Steadiness means that one should be very determined to make progress in spiritual life. Without such determination, one cannot make tangible progress.*
*Simplicity means that without diplomacy one should be so straightforward that he can disclose the real truth even to an enemy.*
*self-control means that one should not accept anything which is detrimental to the path of spiritual progress. One should become accustomed to this and reject anything which is against the path of spiritual progress.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 852 / Sri Siva Maha Purana - 852 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 32 🌴*
*🌻. పుష్పదంతుడు శంఖచూడునకు నచ్చజెప్పుట - 1 🌻*
*సనత్కుమారుడిట్లు పలికెను - తరువాత మహాభయంకరస్వరూపుడు, దుష్టులకు మృత్యువు, సత్పురుషులకు శరణు అగు ఈశ్వరుడు దేవతల కోర్కెపై శంఖచూడుని వధించవలెనని నిశ్చయించెను (1). తనకు ఇష్టుడగు చిత్రరథుడనే గంధర్వరాజును దూతను చేసి వెంటనే శంఖచూడుని వద్దకు ఆనందముతో పంపెను (2). ఆ దూత సర్వేశ్వరుని ఆజ్ఞచే, మహేంద్రనగరము వలె గొప్పదైన శంఖచూడుని నగరమునకు వెళ్లి, ఆ నగరమధ్యములో కుబేర భవనము కంటే గొప్పది, పన్నెండు ద్వారములతో ప్రకాశించునది, ద్వార పాలకులతో కూడినది అగు శంఖచూడుని శ్రేష్ఠమగు నివాసమును గాంచెను (3, 4).*
*ఆ పుష్పదంతుడు (చిత్రరథుడు) శ్రేష్టమగు ద్వారమును గాంచి తాను వచ్చిన పనిని నిర్భయముగా ద్వారపాలకునకు చెప్పెను (5). ఆతడు మిక్కిలి సుందరముగా అలంకరింపబడి యు%్‌న ఆ విశాలద్వారము దాటి ఆనందముతో లోపలకు వెళ్లెను (6). ఆతడు లోపలకు వెళ్లి వీరుల సముదాయము మధ్యలో రత్నసింహాసనము పైనున్న రాక్షసేశ్వరుడగు ఆ శంఖచూడుని గాంచెను (7). మూడు కోట్లమంది వీరులగు రాక్షసులచే చుట్టువారబడి యున్నవాడు, శస్త్రములను ధరించి తిరుగుతున్న వందకోటి ఇతరసైనికులచే సేవింపబడుచున్నవాడు (8) అగు ఆ శంఖచూడుని గాంచి పుష్పదంతుడు ఆశ్చర్యచకితుడై శంకరుడు చెప్పిన యుద్ధవృత్తాంతమునాతనికి చెప్పెను (9)*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 852 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 32 🌴*
*🌻 The Emissary is sent - 1 🌻*
Sanatkumāra said:—
1. Then lord Śiva, Death to the wicked, goal of the good, decided in his mind to slay Śaṅkhacūḍa in accordance with the wishes of the gods.
2. He made his friend the lord of Gandharvas his messenger and sent him in a wonderful chariot[1] hurriedly to Śaṅkhacūḍa joyously.
3. At the bidding of lord Śiva, the emissary went to the city of the Asura which was superior to Indra’s Amarāvatī and Kubera’s Palace.
4. Reaching there, he saw the excellent abode of śaṅkhacūḍa in the middle; it shone with its twelve entrance doors with gatekeepers in each.
5. Puspadanta (Puṣpadanta?) saw the main excellent entrance. Fearlessly he informed the gatekeeper.
6. Passing beyond that door he joyously went in. It was spacious, exquisitely fine and richly decorated.
7. Going in he saw Śaṅkhacūḍa, the ruler of Dānavas, seated on a gem-set throne in the midst of heroic warriors.
8. He was surrounded by leading Dānavas and served by three crores of attendants and guarded by another hundred crores of well armed soldiers moving to and fro.
9. Seeing him, Puṣpadanta was struck with wonder. He gave the message of war as conveyed by Śiva.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 110 / Osho Daily Meditations - 110 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 110. ఉన్నత మార్గం కోసం బ్రహ్మచర్యం తప్పనిసరి 🍀*
*🕉 ఉన్నతితో విలీనానికి బ్రహ్మచర్యం తప్పనిసరి అనే విషయాన్ని ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. మీరు లోతైన ప్రేమలో, లోతైన భక్తితో, ప్రార్థనలో కలిసి జీవిస్తున్నప్పుడు అది జరుగుతుంది. 🕉*
*భౌతిక శక్తి లైంగిక ప్రమేయం లేనప్పుడు, అది ఎత్తైన దశలకు చేరుకుంటుంది. ఇది అంతిమంగా, సమాధికి, ఎరుకకు చేరుకోగలదు. కానీ ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. శృంగారమే ముగింపు అని వారు భావిస్తారు. కానీ శృంగారం అనేది ప్రారంభం మాత్రమే. మీరు ఎవరినైనా ప్రేమించినప్పుడు, మొదట లోతైన ప్రేమలో కలిసి ఉండటాన్ని ధ్యేయం చేసుకోండి, మరియు మీరు సూక్ష్మమైన మరియు లోతైన స్థితికి చేరుకుంటారు. ఆ రకంగా క్రమంగా నిజమైన బ్రహ్మచర్యం పుడుతుంది.
*భారతదేశంలో మనం బ్రహ్మచర్యం అని పిలిచే నిజమైన బ్రహ్మచర్యం, శృంగారానికి వ్యతిరేకం కాదు: ఇది అంత కంటే ఎక్కువ. శృంగారం ఏది ఇవ్వగలదో అదే కాక బ్రహ్మచర్యం మరింత ఇస్తుంది. కాబట్టి మీ శక్తిని ఇంత ఉన్నత స్థాయిలో ఎలా ఉపయోగించాలో మీకు తెలిసినప్పుడు, తక్కువ విషయాల గురించి ఎవరు బాధపడతారు? ఎవ్వరూ బాధపడరు. లైంగిక జీవితాన్ని వదులుకోమని నేను చెప్పడం లేదు. కొన్నిసార్లు ఆందోళన చెందని స్వచ్ఛమైన, ప్రేమ గల ప్రదేశాలను అనుమతించమని నేను చెబుతున్నాను. లేకపోతే మీరు భూమి పైకి మళ్లీ మళ్లీ లాగబడతారు. ఎప్పటికీ ఆకాశంలోకి ఎగరలేరు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 110 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 110. BRAHMACHARYA IS MUST FOR HIGHER PATH 🍀*
*🕉 People have forgotten completely that Brahmacharya is must for the merger with the Higher. That happens when you are simply living together in deep love, in deep reverence, in prayer. 🕉*
*When physical energy is not sexually involved, it rises to higher altitudes. It can reach to the very ultimate, to samadhi, awakening. But people have forgotten completely. They think that sex is the end. But sex is only the beginning. Whenever you love someone, make it a point to first lie together in deep love, and you will reach to subtler and deeper orgasms.*
*That's how, by and by, real celibacy arises. What we call in India brahmacbarya, real celibacy, is not against sex: It is higher than sex. Whatever sex can give, it gives, but it gives more also. So when you know how to use your energy on such a high level, who bothers about the lower spaces? Nobody! I'm not saying to drop sex. I am saying sometimes to allow yourself pure, loving spaces where sex is not a concern. Otherwise you are pulled back to earth, and you can never fly into the sky.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 532 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 532 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 109. సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా ।*
*సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ॥ 109 ॥ 🍀*
*🌻 532. 'శుక్ల సంస్థితా’ - 1 🌻*
*వీర్యము నందుండునది శ్రీమాత అని అర్ధము. సర్వదిక్కులను శాసించుచు, పోషించుచు, దర్శించుచు, అనుగ్రహించుచూ వుండు మాత, ఈ పద్మమున ఆసీనురాలై యున్నదని తెలియనగును. పై తెలిపినట్టి పరిపూర్ణము అగు శ్రీ శివ శక్తి జీవుల వీర్యముగ దిగి వచ్చుచుండును. అట్టి వీర్యము ఎంత మహత్తరమైనది. దానిని జీవుడు ఉపయోగించు తీరు అతని సంస్కారమును తెలియజేయును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 532 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 Sahasradala padmasdha sarva varnopa shobhita*
*sarvayudha dhara shukla sansdhita sarvatomukhi ॥109 ॥ 🌻*
*🌻 532. 'Shukla Sanstita' - 1 🌻*
*The one who is in the semen is Srimata. Mother who rules, nurtures, sees and blesses all the directions, is seated in this lotus. As mentioned above, the perfection of Shiva and Sakthi comes down as the semen of living beings. How great is that semen. The manner in which a living being uses it reveals his culture.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
No comments:
Post a Comment