శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 537 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 537 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 537 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 537 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।
స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀
🌻 537. 'అమతి' - 1 🌻
మతి లేనిది శ్రీమాత అని అర్థము. మతికి అతీతమైనది శ్రీమాత అని విశేష అర్థము. శ్రీమాత నుండియే మతి పుట్టును. సృష్టి యందు మతి పుట్టుటకు ముందు చాల సృష్టి కథ జరిగినది. ఎన్నియో ధర్మములు, తత్త్వములు, శబ్దములు, రంగులు, అంకెలు మతికన్న ముందు పుట్టినవి. కాలము, ఛందస్సు యివి అన్నియూ కూడ మతికి ముందున్నవే. ఇవి అన్నియూ శ్రీమాత నుండి ఉద్భవించినవి. వీటి అల్లిక నుండి అహంకారము, బుద్ధి, మనస్సు యిత్యాదివి పుట్టినవి. కావున శ్రీమాత ప్రాథమికముగ అమతియే! మనస్సునకు ఆవలి తత్త్వమంతయూ శ్రీమాతచే పరిపాలింప బడుచున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 537 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini
svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻
🌻 537. 'Amati' - 1 🌻
It means Srimata has no mind. The special meaning is that Srimata is beyond the mind. Mind is born from Srimata. There was a long saga before mind was born in the creation. Many dharmas, philosophies, sounds, colors and numbers were born before mind. Time and rhythm were all existent before the mind. All these were born from Srimata. Ego, intellect, mind, etc. were born from the interweaving of these. So Srimata is primarily Amati or one without mind! All the philosophy beyond the mind is ruled by Sri Mata.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment