శ్రీ శివ మహా పురాణము - 852 / Sri Siva Maha Purana - 852

🌹 . శ్రీ శివ మహా పురాణము - 852 / Sri Siva Maha Purana - 852 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 32 🌴

🌻. పుష్పదంతుడు శంఖచూడునకు నచ్చజెప్పుట - 1 🌻


సనత్కుమారుడిట్లు పలికెను - తరువాత మహాభయంకరస్వరూపుడు, దుష్టులకు మృత్యువు, సత్పురుషులకు శరణు అగు ఈశ్వరుడు దేవతల కోర్కెపై శంఖచూడుని వధించవలెనని నిశ్చయించెను (1). తనకు ఇష్టుడగు చిత్రరథుడనే గంధర్వరాజును దూతను చేసి వెంటనే శంఖచూడుని వద్దకు ఆనందముతో పంపెను (2). ఆ దూత సర్వేశ్వరుని ఆజ్ఞచే, మహేంద్రనగరము వలె గొప్పదైన శంఖచూడుని నగరమునకు వెళ్లి, ఆ నగరమధ్యములో కుబేర భవనము కంటే గొప్పది, పన్నెండు ద్వారములతో ప్రకాశించునది, ద్వార పాలకులతో కూడినది అగు శంఖచూడుని శ్రేష్ఠమగు నివాసమును గాంచెను (3, 4).

ఆ పుష్పదంతుడు (చిత్రరథుడు) శ్రేష్టమగు ద్వారమును గాంచి తాను వచ్చిన పనిని నిర్భయముగా ద్వారపాలకునకు చెప్పెను (5). ఆతడు మిక్కిలి సుందరముగా అలంకరింపబడి యు%్‌న ఆ విశాలద్వారము దాటి ఆనందముతో లోపలకు వెళ్లెను (6). ఆతడు లోపలకు వెళ్లి వీరుల సముదాయము మధ్యలో రత్నసింహాసనము పైనున్న రాక్షసేశ్వరుడగు ఆ శంఖచూడుని గాంచెను (7). మూడు కోట్లమంది వీరులగు రాక్షసులచే చుట్టువారబడి యున్నవాడు, శస్త్రములను ధరించి తిరుగుతున్న వందకోటి ఇతరసైనికులచే సేవింపబడుచున్నవాడు (8) అగు ఆ శంఖచూడుని గాంచి పుష్పదంతుడు ఆశ్చర్యచకితుడై శంకరుడు చెప్పిన యుద్ధవృత్తాంతమునాతనికి చెప్పెను (9)


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 852 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 32 🌴

🌻 The Emissary is sent - 1 🌻



Sanatkumāra said:—

1. Then lord Śiva, Death to the wicked, goal of the good, decided in his mind to slay Śaṅkhacūḍa in accordance with the wishes of the gods.

2. He made his friend the lord of Gandharvas his messenger and sent him in a wonderful chariot[1] hurriedly to Śaṅkhacūḍa joyously.

3. At the bidding of lord Śiva, the emissary went to the city of the Asura which was superior to Indra’s Amarāvatī and Kubera’s Palace.

4. Reaching there, he saw the excellent abode of śaṅkhacūḍa in the middle; it shone with its twelve entrance doors with gatekeepers in each.

5. Puspadanta (Puṣpadanta?) saw the main excellent entrance. Fearlessly he informed the gatekeeper.

6. Passing beyond that door he joyously went in. It was spacious, exquisitely fine and richly decorated.

7. Going in he saw Śaṅkhacūḍa, the ruler of Dānavas, seated on a gem-set throne in the midst of heroic warriors.

8. He was surrounded by leading Dānavas and served by three crores of attendants and guarded by another hundred crores of well armed soldiers moving to and fro.

9. Seeing him, Puṣpadanta was struck with wonder. He gave the message of war as conveyed by Śiva.


Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment