🌹 24, APRIL 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹

🍀🌹 24, APRIL 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 524 / Bhagavad-Gita - 524 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 35 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 35 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 878 / Sri Siva Maha Purana - 878 🌹
🌻. భద్రకాళీ శంఖచూడుల యుద్ధము - 2 / Kālī fights - 2 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 137 / Osho Daily Meditations  - 137 🌹
🍀 137. అవాస్తవమైనవి / 137. UNREAL 🍀
4) 🌹 సిద్దేశ్వరయానం - 46🌹
5) 🌹 అంతర్గత నిశ్చలత కోసం ''సమదృష్టి''ని సాధన చేయండి. / Practice Even-mindedness for Inner stillness 🌹  
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 542 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 542 - 2🌹 
🌻 542. 'పుణ్యకీర్తి' - 2 / 542. 'Punyakeerthi' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 524 / Bhagavad-Gita - 524 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 35 🌴*

*35. క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమన్తరం జ్ఞానచక్షుషా |*
*భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాన్తి తే పరమ్ ||*

*🌷. తాత్పర్యం : దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞునకు నడుమ గల భేదమును జ్ఞానదృష్టితో దర్శించి, ప్రకృతిబంధము నుండి మోక్షమును బడయ విధానము నెరుగగలిగినవారు పరమగతిని పొందగలరు.*

*🌷. భాష్యము : దేహము, దేహయజమానియైన ఆత్మ, పరమాత్ముడు అనెడి మూడు అంశముల నడుమ గల భేదమును మనుజుడు తప్పక తెలిసికొనవలెనని పలుకుటయే ఈ త్రయోదశాయాధ్యాయపు సారాంశము. ఈ అధ్యాయమునందు ఎనిమిదవశ్లోకము నుండి పండ్రెండవ శ్లోకము వరకు వివరించిన మోక్షవిధానమును సైతము ప్రతియొక్కరు గుర్తింపవలెను. అంతటవారు పరమగతిని పొందగలరు. శ్రద్ధావంతుడైన మనుజుడు తొలుత సజ్జనసాంగత్యమును పొంది శ్రీకృష్ణభగవానుని గూర్చి శ్రవణము చేయవలెను. తద్ద్వారా అతడు క్రమముగా ఆత్మవికాసము నొందగలడు. మనుజుడు గురువును స్వీకరించినచో ఆత్మ మరియు అనాత్మల (భౌతికపదార్థము) నడుమగల వ్యత్యాసమును తెలియగలుగును. అది యంతట మరింత ఆధ్యాత్మికానుభూతికి సోపానము కాగలదు. జీవితపు భౌతిక భావన నుండి ముక్తులు కావలసినదిగా శిష్యులకు ఆధ్యాత్మికగురువు తన వివిధ ఉపదేశముల ద్వారా బోధనల కావించును.*

*ఈ దేహము భౌతికపదార్థమనియు మరియు ఇరువది నాలుగు తత్త్వములచే విశ్లేషణీయమనియు ఎవ్వరైనను గ్రహింపవచ్చును. ఆత్మ మరియు పరమాత్మ భిన్నులేగాని ఏకము కాదు. ఆత్మ మరియు ఇరువదినాలుగు భౌతికాంశముల సంయోగము చేతనే భౌతికజగత్తు నడుచుచున్నది. భౌతికజగమును ఈ విధమైన ఆత్మ మరియు చతుర్వింశతి తత్త్వముల కలయికగా గాంచుచు పరమాత్ముని నిజస్థితిని దర్శింపగలిగినవాడు ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు అర్హుడగుచున్నాడు. ఈ విషయములన్నియును చింతనము మరియు ఆత్మానుభవము కొరకు ఉద్దేశింపబడియున్నవి. కనుక ఆధ్యాత్మికగురువు సహాయముచే ఈ అధ్యాయము నందలి విషయములను మనుజుడు సంపూర్ణముగా అవగాహనము చేసికొనవలెను.*

*శ్రీ మద్భగవద్గీత యందలి “క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము” అను త్రయోదశాధ్యాయమునకు భక్తివేదాంత భాష్యము సమాప్తము.*

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 524 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 35 🌴*

*35. ṣetra-kṣetrajñayor evam antaraṁ jñāna-cakṣuṣā*
*bhūta-prakṛti-mokṣaṁ ca ye vidur yānti te param*

*🌷 Translation : Those who see with eyes of knowledge the difference between the body and the knower of the body, and can also understand the process of liberation from bondage in material nature, attain to the supreme goal.*

*🌹 Purport : The purport of this Thirteenth Chapter is that one should know the distinction between the body, the owner of the body, and the Supersoul. One should recognize the process of liberation, as described in verses 8 through 12. Then one can go on to the supreme destination. A faithful person should at first have some good association to hear of God and thus gradually become enlightened. If one accepts a spiritual master, one can learn to distinguish between matter and spirit, and that becomes the stepping-stone for further spiritual realization.* 

*A spiritual master, by various instructions, teaches his students to get free from the material concept of life. For instance, in Bhagavad-gītā we find Kṛṣṇa instructing Arjuna to free him from materialistic considerations. One can understand that this body is matter; it can be analyzed with its twenty-four elements. The soul and the Supersoul are two. This material world is working by the conjunction of the soul and the twenty-four material elements. One who can see the constitution of the whole material manifestation as this combination of the soul and material elements and can also see the situation of the Supreme Soul becomes eligible for transfer to the spiritual world. These things are meant for contemplation and for realization, and one should have a complete understanding of this chapter with the help of the spiritual master.*

*Thus end the Bhaktivedanta Purports to the Thirteenth Chapter of the Śrīmad Bhagavad-gītā in the Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 878 / Sri Siva Maha Purana - 878 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 38 🌴*

*🌻. భద్రకాళీ శంఖచూడుల యుద్ధము - 2 🌻*

*అపుడా దానవవీరుడు కోపించి వేగముగా ధనుస్సును ఎక్కుపెట్టి మంత్రములను పఠిస్తూ దేవిపై దివ్యాస్త్రములను ప్రయోగించెను (11). ఆమె విశాలమగు నోరును తెరచి ఆ అస్త్రమును ఆహారమును వలె భుజించి గర్జించి అట్టహాసమును చేయగా దానవులు భయపడిరి (12). ఆతడు వందయోజనముల వెడల్పు గల శక్తిని కాళిపై ప్రయోగించగా, ఆ దేవి అనేక దివ్యాస్త్రములతో దానిని వంద ముక్కలుగా చేసెను (13). ఆతడు చండికపై వైష్ణవాస్త్రమును ప్రయోగించగా, ఆమె మహేశ్వరాస్త్రముతో దానిని తప్పించెను (14).*

*ఈ తీరున వారిద్దరి మధ్య చిరకాలము యుద్ధము జరిగెను. దేవదానవులందరు ప్రేక్షకులుగా నుండి పోయిరి (15). అపుడు యుద్ధములో మృత్యుసమానురాలగు కాళీమహాదేవి కోపించి మంత్రముచే పవిత్రమైన పాశుపతాస్త్రమును స్వీకరించెను (16). దానిని ప్రయోగించుటకు పూర్వమే ఆపివేయుటకై ఆకాశవాణి ఇట్లు పలికెను : ఓ దేవీ! కోపముతో ఈ అస్త్రమును శంఖచూడునిపై ప్రయోగించకుము (17). ఓ చండికా! పాశుపతాస్త్రము అమోఘమైనదే అయినా వీనికి దానివలన మరణము రాదు. వీరుడగు శంఖచూడుని వధించుటకు మరియొక ఉపాయము నాలోచించుము (18). ఈ మాటను విని భద్రకాళి ఆ అస్త్రమును ప్రయోగించలేదు. అపుడామె ఆకలితో కోటి మంది దానవులను అవలీలగా తినివేసెను (19).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 878 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 38 🌴*

*🌻 Kālī fights - 2 🌻*

11. Then the infuriated leader of the Dānavas drew the bow violently and discharged divine missiles at the goddess with due invocation through the mantras.

12. Opening the mouth very wide she swallowed the missiles and roared with a boisterous laugh. The Dānavas were terrified.

13. He then hurled a Śakti, a hundred Yojanas long at Kālī. By means of divine missiles she broke it into a hundred pieces.

14. He hurled the Vaiṣṇava missile on Kālī. She blocked it with the Māheśvara missile.

15. Thus the mutual combat went on for a long time. All the gods and Dānavas stood as mere onlookers.

16. Then the infuriated goddess Kālī, as fierce as the god of death on the battleground, took up angrily the Pāśupata arrow sanctified by mantras.

17. In order to prevent it from being hurled, an unembodied celestial voice said—“0 goddess, do not hurl this missile angrily at Śaṇkhacūḍa.”

18. “O Caṇḍikā, death of this Dānava will not take place even through the never failing Pāsupata missile. Think of some other means for slaying this warrior Śaṅkhacūḍa.”

19. On hearing this, Bhadrakālī did not hurl the missile. Sportively she devoured ten million Dānavas as if in hunger.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 137 / Osho Daily Meditations  - 137 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 137. అవాస్తవమైనవి 🍀*

*🕉 ముందుగా ఒకరు నకిలీ నాణేన్ని మోసుకెళ్తున్నారని గ్రహించాలి. వాస్తవానికి, ఇది మిమ్మల్ని బాధపెడుతుంది. మీరు ఏదో కోల్పోయినట్లు మీకు అనిపిస్తుంది - కానీ మీరు దానిని అసలు కలిగే ఉండలేదు. 🕉*

*ప్రజలు తమకు కరుణ ఉందని అనుకుంటారు. కరుణ చాలా అరుదైన గుణం. సానుభూతి సాధ్యమే, కానీ కరుణ అనేది చాలా ఉన్నత స్థాయి విషయం. కానీ మీకు కనికరం లేదని మీరు భావించినప్పుడు, మీరు దానిని కలిగి ఉండే అవకాశం ఉంటుంది. అదే తప్పుడు వస్తువులతో ఇబ్బంది: మీ జేబులో నకిలీ నాణేలు ఉన్నాయి మరియు మీరు ధనవంతులని భావిస్తే, ఎందుకు చింతించడం? మీరు బిచ్చగాడినని, నాణేలన్నీ అబద్ధమని తెలుసుకున్న తర్వాత, డబ్బు అంతా పోయినందుకు అకస్మాత్తుగా మీరు బాధపడతారు. కానీ ఇప్పుడు మీరు నిజమైన డబ్బు ఎక్కడ మరియు ఎలా పొందాలో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మీరు ఏది వాస్తవమైనది మరియు ఏది అవాస్తవమైనది అనే తేడాను గుర్తించలేరు.*

*అత్యంత సమగ్రమైన చైతన్యం ఏర్పడినప్పుడు మాత్రమే, మీరు దానిని చేయగలుగుతారు. మీ జీవితంలో కొన్ని విషయాలు వాస్తవమైనవి మరియు కొన్ని విషయాలు అవాస్తవమైనవి అని కాదు. ఈ స్థితిలో, మీకు తెలియనప్పుడు, ప్రతిదీ ఒక కలలాగా అవాస్తవంగా ఉంటుంది, కానీ ప్రతిదీ వాస్తవమైనదిగా కనిపిస్తుంది. మరొక స్థితిలో, మీరు మేల్కొన్నప్పుడు, బుద్ధుడిగా మారినప్పుడు, ప్రతిదీ వాస్తవమే; ఏదీ అవాస్తవం కాదు. కాబట్టి కొన్ని విషయాలు వాస్తవమైనవి మరియు కొన్ని అవాస్తవమైనవి అని కాదు. మీకు తెలియకపోతే, ప్రతిదీ అవాస్తవం. మీకు అవగాహన ఉంటే, ప్రతిదీ వాస్తవమే. కానీ మీరు మెలకువగా ఉన్నప్పుడే అసత్యం ఏమిటో తెలుసుకోగలుగుతారు, అంతకు ముందు కాదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 137 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 137. UNREAL 🍀*

*🕉  First one has to realize that one is carrying a counterfeit, a false coin. Of course, it makes you sad. You feel as if you have lost something — but you never had it in the first place.  🕉*

*People simply think they have compassion. Compassion is a very rare quality. Sympathy is possible, but compassion is a very high level thing. But when you come to feel that you don't have any compassion, now there will be a possibility of your having it. That is the trouble with false things: If your pocket is full of false coins and you think that you are rich, why worry? Once you come to know that you are a beggar and all coins are false, suddenly you become sad because all the money is lost. But now you can  find out where and how one gets real money. Right now you cannot make the distinction between what is real and what is unreal.*

*Only when a very integrated consciousness arises, will you be able to make it. It is not that a few things are real in your life and a few things are unreal. In this state, when you are unaware, everything is unreal like a dream, but everything looks real. In another state, when you become awakened, become a Buddha, then everything is real; nothing is unreal. So it is not that a few things are real and a few unreal. If you are not aware, then everything is unreal. If you are aware, everything is real. But you will be able to know what was unreal only when you are awake, not before that.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 46 🌹*

*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
        
*🏵 శ్రీశైలము: 1257 సం||– 🏵*

*యోగి కదిలి వెళ్ళాడు. యువకుడు బయటకు వచ్చాడు. సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు - అభిజిల్లగ్నం.*
*ఆ యువకుడు సరస్సు దగ్గరకు వెళ్ళి స్నానం చేసి గుహలోకి వచ్చాడు. జపం మొదలుపెడుతున్నాడు గనుక ఆహారం తీసుకోకుండా గురుస్మరణ చేసి నమస్కరించి ప్రారంభిస్తున్నాడు. ఇంతకు తనకు మంత్రమిచ్చిన గురునామమేమిటి? ఆయన చెప్పలేదు. సిధ్ధగురు దేవాయనమః అని కండ్లుమూసుకొన్నాడు. మనస్సులో నీలాచల యోగి అని పేరు స్ఫురిస్తున్నది. ఇదివరకు లేని స్ఫురణ బయలుదేరింది. మంత్రం ఉచ్చరిస్తున్నాడు. ఎవరూ ఇతర మానవులు లేరు గనుక పైకి పలుకుతున్నాడు. కొంత సేపటికి అలసట వచ్చింది. పెదవులు మాత్రం కదిలిస్తూ మంత్రం అంటున్నాడు. కాసేపటికి అదికూడా ఆగిపోయింది. మనసులో మంత్రం తిరుగుతున్నది. వాచికము, ఉపాంశువు దాటి మానసిక జపం జరుగుతున్నది. సంధ్యా సమయం దాకా ఇలా సాధన చేసి బయటకు వచ్చి చెట్టుపండ్లు కోసుకొని ఆకలి తీర్చుకొన్నాడు. రాత్రి నిద్రవచ్చినదాక జపం, తరువాత పడుకోటం, మధ్యలో మెలకువ వచ్చినప్పుడు మళ్ళీ కూచోటం జపంచేయటం, మళ్ళీ నిద్ర వస్తే శయనం, ప్రొద్దుననే స్నానపానాదులు, పునః జపం.*

*ఆహారం, నిద్ర జపం. ఇవి తప్ప వేరే ఏమీ కార్యక్రమం లేదు. అటువైపు ఎవరూ మనుష్యులు రాలేదు. క్రూరజంతువులు కూడా రాలేదు. బహుశా యోగి శక్తివల్ల ఇక్కడకు ఏ జంతువూ రాలేదేమో? ఏదైతేనేం? తనకెందుకు? తన తపస్సుకు ఏ విఘ్నము లేదు. తపస్సు అనుకుంటున్నాడు గాని తనది తపస్సా? తానేమి ఉపవాసాలు చేస్తున్నాడా? పంచాగ్ని మధ్యంలోనో, కంఠ దఘ్న జలంలోనో, నిల్చున్నాడా? తనను బతికించిన యోగి అవేమీ చెప్పలేదు. జపం మాత్రం చేయమన్నాడు. తను జపం చేసినంత మాత్రాన దేవత వస్తుందా? ఆ యోగి వస్తుందన్నాడు. గనుక వస్తుంది. ఆయన మాటవల్ల వచ్చేప్పుడు తాను జపం చేయటం దేనికి? కాని ఆ ఋషి జపం చేయమన్నాడు. కనుక తనకు తెలియని ప్రయోజనమేదో ఉన్నది. చెప్పినది చేయటం తన కర్తవ్యం.*

*ఇలా ఆలోచిస్తూనే జపం చేస్తున్నాడు. స్నానపానాలకు ఆహారానికి లేవాలికదా? సమయం ఎలా తెలుస్తుంది? జపమాల ఉంటే కండ్లు మధ్యమధ్యలో తెరుస్తూ ఎన్ని మాలలైనవో చూసుకొంటూ చేస్తే తెలుస్తుంది. ఆ గుహలో వెదికితే జపమాల ఉన్నది. తనకోసమే యోగి అక్కడ ఉంచాడేమో? మొత్తం మీద రోజులు గడుస్తున్నవి. ఇరవై రోజులు గడిచిన తరువాత కంటిముందు ఏవో వెలుగులు కనబడుతున్నవి. ఇంకా గడుస్తున్న కొద్దీ ఎవరో తనముందు కదలుతున్నట్లు అనిపించింది. లీలగా ఎవరో స్త్రీ దగ్గరకు వస్తున్నట్లు భాసించింది. మంత్రం చైతన్యవంతమై ఏదో మార్పు వస్తున్నది.*

*ఇలా రకరకాల అనుభవాలతో 40 రోజులు గడిచినవి. నలభై ఒకటవరోజు ఉదయం స్నానం చేసి మళ్ళీ కొంతసేవు జపం చేశాడు. దేవత వచ్చినట్లు మధ్యమధ్యలో అనిపించటం తప్ప పూర్ణ సాక్షాత్కారం కాలేదు. అంటే మంత్రం సిద్ధించలేదా? సిద్ధి తన సాధన మీద ఆధారపడి ఉన్నదా? తానెప్పుడూ అలా అనుకోలేదు. సిద్ధగురువు చేయమంటే చేశాడు. ఆయన కృప - ఆయన సంకల్పం. తాను దీనిని గురించి అలోచించవలసిన పనిలేదు. ఆలోచించి చేసేదికూడా ఏమీ లేదు. మధ్యాహ్నం ఆహారం తీసుకున్నానని అనిపించాడు. విశ్రాంతి. గాఢంగా నిద్రపట్టింది. సంధ్యాసమయం అయింది. లేచి ముఖ ప్రక్షాళనాదులు చేసుకొని గురుని దేవతను స్మరిస్తున్నాడు. ఇంతలో ఏదో అలికిడి అయింది. ఎవరో స్త్రీ నడిచి వస్తున్నది. మధ్యవయస్కురాలు, కళగలముఖం. ఎవరైతేనేమి? తానున్న చోటికి వచ్చింది గనుక అతిథి. ఆహ్వానించి ఆసీనురాలు కావలసిందన్నాడు. అక్కడ కూచోటానికి కుర్చీలున్నవా? ఒక పెద్ద బండరాయి చూపిస్తే ఆమె కూచున్నది. ఇతడింకో రాతిమీద కూర్చున్నాడు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అంతర్గత నిశ్చలత కోసం ''సమదృష్టి''ని సాధన చేయండి. / Practice Even-mindedness for Inner stillness 🌹*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*దేవుని ఉనికి మనలోని ప్రతి ఒక్కరిలో ఆత్మగా, మన నిజమైన నేనుగా ప్రతిబింబిస్తుంది అని లేఖనాలు బోధిస్తాయి. మా గురువు తరచూ మాకు ఈ దృష్టాంతాన్ని ఇచ్చేవారు. 'చంద్రుని ప్రతిబింబం గాలి వల్ల ఏర్పడిన అలలతో కూడిన సరస్సులో వక్రీకరించినట్లు కనిపిస్తుంది; అదే విధంగా, శరీరంలో ప్రతిబింబించే ఆత్మ, అశాంతి యొక్క అలల వల్ల ఇంద్రియాలతో గుర్తించబడే మనస్సులో, స్పష్టంగా కనిపించదు. భగవంతుని ప్రతిరూపం స్పష్టంగా ప్రతిబింబించాలంటే, ఒకరి చైతన్య స్పృహ యొక్క సరస్సు సంపూర్ణంగా నిశ్చలంగా ఉండాలి. జీవిత తుఫానులు, ద్వంద్వత్వ మరియు సాపేక్షత యొక్క మార్పులకు చలించని విధంగా స్పష్టంగా ఉండాలి.*

*ఆ అంతర్గత నిశ్చలతను సాధించడానికి ధ్యానం చాలా అవసరం. బాహ్యంగా జీవితంలో నిమగ్నమై ఇరుక్కు పోయినప్పుడు భగవంతుడిని గ్రహించే ఏకైక మార్గం ''సమదృష్టిని సాధన చేయడం'' అని భగవద్గీత బోధిస్తుంది.*
🌹🌹🌹🌹🌹

*🌹 Practice Even-mindedness for Inner stillness 🌹*

*The scriptures teach that's God's presence is reflected in each of us as the soul, our true Self; and our Guru often gave us this illustration: "A reflection of the moon appears distorted in a wind ruffled lake; similarly, the reflected soul in the body is not clearly seen in a restless, sense identified mind." In order to fully reflect the image of God, the Lake of one's consciousness must be perfectly still, unruffled by the storms of life, the constant change of dualities and relativities.*

*Meditation , of course, is essential for attaining that inner stillness. And the Bhagavad Gita teaches, the only way to perceive God while outwardly engaged in life is by practising even-mindedness.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 542 - 2  / Sri Lalitha Chaitanya Vijnanam  - 542 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।*
*పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀*

*🌻 542. 'పుణ్యకీర్తి' - 2 🌻*

*అట్లే పుణ్యకార్యము చేయువారు పోటీలు పడరాదు. ప్రక్కవాని కన్న ఎక్కువ చేయవలెను, బాగుగా చేయవలెను అను పోటీ భావము కలుషితము.  పుణ్యము చేయువారిని చూసి ఈర్ష్య పడరాదు. విమర్శించ రాదు. చేయుటలో అశ్రద్ధ, అలసత్వము కూడదు. శ్రద్ధా భక్తులతో నిర్వర్తించవలెను. అపుడు మాత్రమే చేయు కార్యముల వలన పుణ్యము లభించును. సుఖము లభించును. అప్రయత్నముగ కీర్తి వరించును. ఈ హెచ్చరిక తగు మాత్రము అవసరము. పుణ్య కార్యములు చేయుచూ దుఃఖపడువారు కలరు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 542 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana*
*pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻*

*🌻 542. 'Punyakeerthi' - 2 🌻*

*Similarly those who do pious work should not compete. The sense of competition that one should do more and do better than others is contaminated. Should not be jealous of those who do good deeds. Should not criticize. There should be no carelessness and laziness in actions. Should be done with dedication and devotion. Only then will merit be obtained from deeds. You will get happiness. Effortless fame will flow. This warning is only necessary. There are those who do pious deeds and are sad.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment