శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 7
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539 - 7 / Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 7 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।
స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀
🌻 539. 'శ్రుతిః' - 7 🌻
కల్మషములు యొక్క హెచ్చుతగ్గులను బట్టి వైవిధ్యము లేర్పడు చుండును. ఇట్లు నాలుగు వేదములు సృష్టి యందు, జీవుల యందు నిర్వహింప బడుచున్నవి. దీనిని తెలియుట వేదములను తెలియుట. ఇవి ఎచ్చటి నుండి పుట్టుచున్నవో తెలియుట వేదము తెలియుట. ఈ వేదమునే శ్రుతి యందురు. ఈ మాత శ్రుతిరూపిణి. ఈ వేదములను వివరించుటకే వేదాంగములు, ఉపనిషత్తులు యేర్పడినవి. వేదాంగములు ఆరు. అవి వరుసగా 1) ఛందస్సు, 2) కల్పము. 3) శిక్ష, 4) వ్యాకరణము, 5) నిరుక్తము, 6) జ్యోతిషము. వీని వలన సృష్టి స్వరూప స్వభావములు కొంత తెలియ వచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 7 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini
svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻
🌻 539. 'Shrutih' - 7 🌻
Fluctuations in impurities will cause variations. Thus the four Vedas are administered in the world and living beings. To know this is to know the Vedas. To know from where these are born is to know the Vedas. This Veda is called shruti. This mother is in the form of shruti. Vedangas and Upanishads are composed to explain these Vedas. Vedangams are six. They are respectively 1) Chandasu, 2) Kalpa. 3) Shiksha, 4) Grammar, 5) Nirukta, 6) Astrology. Because of this, the nature of creation can be known to some extent.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment