శ్రీ శివ మహా పురాణము - 889 / Sri Siva Maha Purana - 889

🌹 . శ్రీ శివ మహా పురాణము - 889 / Sri Siva Maha Purana - 889 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 40 🌴

🌻. శంఖచూడ వధ - 4 🌻


శంఖచూడుని పైన ఆకాశము నందు క్షణకాలము తిరిగిన ఆ శూలము శివశాసనముచే ఆతనిపై పడి క్షణములో ఆతనిని భస్మము చేసెను (28). ఓ బ్రాహ్మణా! అపుడా మహేశ్వరుని శూలము తన పనిని పూర్తిచేసి మనో వేగముతో వెంటనే వెనుదిరిగి ఆకాశమార్గములో వెళ్లి శివుని చేరెను (29). స్వర్గములో దుందుభులు మ్రోగెను. గంధర్వులు, కిన్నరులు గానము చేసిరి. మునులు, దేవతలు శివుని స్తుతించిరి. అప్సరసల గణములు నాట్యమును చేసినవి (30).

శివునిపై ఎడతెరిపి లేని పూలవాన కురిసెను. విష్ణువు, బ్రహ్మ ఇంద్రుడు మొదలగు వారు మరియు మునులు ఆయనను ప్రశంసించిరి (31). దానవచక్రవర్తి యగు శంఖచూడుడు అపుడు శివుని కృపచే శాపమునుండి విముక్తుడై పూర్వరూపముపును పొందెను (32). శంఖచూడుని ఎముకలనుండి శంఖము పుట్టినది. శంకరుడు తక్క సర్వులకు శంఖమునందలి జలము ప్రశస్తమైనది (33). ఓ మహర్షీ! విష్ణువునకు , లక్ష్మికి మరియు వారి సహచరులకు శంఖజలము మిక్కిలి ప్రియమైనది. కాని శంకరునకు కాదు (34). శంకరుడీ తీరున వానిని సంహరించి వృషభము నధిష్ఠించి పార్వతి, కుమారస్వామి, గణములు వెంటరాగా మహానందముతో శివలోకమునకు వెళ్లెను (35).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 889 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 40 🌴

🌻 Śaṅkhacūḍa is slain - 4 🌻


28. That trident whirling round over the head of Śaṅkhacūḍa for a while fell on the head of the Dānava at the behest of Śiva and reduced him to ashes.

29. O brahmin, then it rapidly returned to Śiva and having finished its work went away by the aerial path with the speed of the mind.

30. The Dundubhis were sounded in the heaven. Gandharvas and Kinnaras sang. The sages and the gods eulogised and the celestial damsels danced.

31. A continuous shower of flowers fell over Śiva. Viṣṇu, Brahmā, Indra, other gods and sages praised him.

32. Saṅkhacūḍa the king of Dānavas was released from his curse by the favour of Śiva. He regained his original form.

33. All the conches in the world are formed of the bones of Śaṅkhacūḍa. Except for Śiva, the holy water from the conch is sacred for every one.

34. O great sage, particularly to Viṣṇu and Lakṣmī the water from the conch is pleasant. To all persons connected with Viṣṇu it is so but not to Siva.

35. After slaying him thus, Śiva went to Śivaloka seated on his bull, joyously, accompanied by Pārvatī, Kārttikeya and the Gaṇas.


Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment