🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 547 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 547 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀
🌻 547. 'బర్బరాలకా’ - 2 🌻
సంస్కారవంతులు ఆపాద మస్తకము నిత్యమూ సంస్కరించుకొందురు. బహిరంతరములను కూడ అట్లే సంస్కరించుకొనుచుందురు. తమ పరిసరములను, దేహమును, యింద్రియములను, మనస్సును నిత్యమూ సంస్కరించు కొననిచో అపవిత్రత పేర్కొనుట తథ్యము. మనస్సు అద్దము వంటిది. అద్దముపై పడిన దుమ్ము తుడుచుకొననిచో ప్రతిబింబము స్పష్టముగ నుండదు.
నిత్యమూ శుచి, శౌచమునకు సంబంధించిన కార్యములు నిర్వర్తింపని వారు జీవితమున చిక్కులు పడుదురు. సంస్కారములను క్రతుబద్ధముగ నిర్వర్తించుకొనుట ఆర్య ధర్మము. అట్లు నిర్వర్తించుకొనని వారిని బర్బరులు అందురు. బర్బరు లనగా సంస్కారహీనులని అర్థము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 547 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana
pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻
🌻 547. 'Barbaralaka' - 2 🌻
Cultured people are constantly reforming their minds. In the same way they groom their bodies within and outside. If one does not constantly reform one's surroundings, body, senses and mind, it is certain for impurity to accumulate. Mind is like a mirror. If the dust on the mirror is not cleaned, the reflection will not be clear.
Those who do not perform the tasks related to cleanliness and hygiene will get tangled in life. Arya dharma is to perform the rites regularly. Those who do not do so are called barbarians. Barbarians are those who are uncivilized.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment