శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀

🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 2 🌻


బాల్యము, విద్యాభ్యాసము, సంఘమునందు బాధ్యత, గృహస్తు ధర్మము పరిపూర్ణముగ నిర్వర్తించుటకు పెద్దలు ఈ సమయమును నిర్ణయించిరి. ఇట్టి బాధ్యతలను పూర్తిగ నిర్వర్తింపకయే మరణించుట అపమృత్యువు అనబడును. అట్లే అకాల మృత్యువు కూడ తెలియవచ్చును. బాధ్యతా నిర్వహణము పూర్ణము గాక అరువది సంవత్సరముల లోపలనే మరణించుట అకాల మృత్యువు. అంతియే గాక దుర్ఘటనల యందు, ప్రమాదముల యందు మరణించుట కూడ అకాల మృత్యువే. అంతియే గాక మరణమునకు పుణ్య తిథులు, పాప తిథులు కూడ యున్నవి. సరియగు తిథి వార నక్షత్రములలో దేహము విడువనిచో అదియును అకాల మృత్యువే.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh
sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻

🌻 552. 'Sarvamrutyu Nivarini' - 2 🌻

Elders have fixed this time for perfecting childhood, education, responsibility in society, household dharma. Dying without fulfilling these responsibilities is called untimely death. Likewise premature death may also be known. Death within sixty years without completion of responsibilities is premature death. Moreover, death due to mishaps and accidents is also premature death. Moreover, there are holy days and unholy days for death. If one does not leave the body in the right combination of the day, week and start, it is premature death.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment