శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 5


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 5 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀

🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 5 🌻

అట్లే ధ్యానోపాసనము, యోగ విద్యాభ్యాసము యిత్యాదివి కూడ ఉపాయములే. మార్గమేదైననూ మృత్యువను అజ్ఞానపు తెరను తొలగింప వలసినది శ్రీమాతయే కదా! దేహికిని, దేహమునకు అనుసంధానము కూర్చునది ప్రాణము. దేహికి దేహముతో ప్రాణము వలన ముడిపడును. ప్రాణము ముడిని యోగము ద్వారా, జ్ఞానము ద్వారా విడదీసుకొని అందు వసించుట నిజమగు స్వేచ్ఛా జీవనము. అప్పుడు దేహమును ఒక నివాసముగ వినియోగించుకొన వచ్చును. ఈ ఉపాయమును నేర్వనివారు స్వేచ్ఛలేక దేహమను కారాగారమున యుందురు. ఇట్టి కారాగారము నుండి బయలు వెడలుటకే తారణవిద్య లన్నియును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 5 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh
sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻

🌻 552. 'Sarvamrutyu Nivarini' - 5 🌻


Similarly, meditation, yoga etc. are also ways. It is Sri Mata who has to remove the veil of ignorance called death in any way! Prana is the connection between the body and the one in the body. The soul gets tangled in the body through prana.A true life of freedom is to live by disentangling with body through yoga and knowledge. Then the body can be used as an abode. Those who do not learn this method are not free and are in the body like in a prison. All the Taranavidyas are to free oneself from this prison.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment