గురువును పరమాత్మ గా భావిస్తూ ఆత్మచింతన చేయండి (Do self-contemplation considering Guru as Paramatma)

🌹 గురువును పరమాత్మ గా భావిస్తూ ఆత్మచింతన చేయండి. 🌹

పుణ్యాత్మలందరికీ నా నమస్కారాలు,

ఈ రోజు ఇక్కడ జర్మనీలోని యూరప్ ఆశ్రమం నుండి ఒక కథనం ద్వారా నా సందేశాన్ని మీకు తెలియ జేయాలను కుంటున్నాను. ఇది ఒక కథ, కానీ నా సందేశాన్ని మీకు చెప్పటానికి ఇది అత్యుత్తమమైన మార్గమని నాకు అనిపించింది. ఒక శిష్యుడు తన గురువునకు, దాదాపు 40 సంవత్సరాలు పూర్తి సమర్పణ భావంతో సేవ చేస్తూనే ఉన్నాడు, అయితే కేవలం శరీర భావంతోనే చేసాడు. కానీ గురువు యొక్క ఆత్మతో అనుసంధానం కాలేకపోయాడు. మరియు 40 ఏళ్లపాటు గురువు యొక్క దేహ చైతన్యంలో మునిగిపోయాడు. కానీ 40 ఏళ్ల తర్వాత ఒకరోజు గురువు అతనితో,రేపటినుండి
నీ మరియు నా దారులు వేరు అవబోతున్నాయి.

రేపు నేను నా దేహాన్ని త్యాగం చేయబోతున్నాను. నా జ్యోతి ప్రకాశం లో 40 ఏళ్లుగా నడుస్తూ ఉన్నావు.రేపటినుండి ఆ ప్రకాశం నీకు లభించదు. రేపటినుండి నీవు నీ ఆత్మ ప్రకాశంలోనే నీ జీవనపథం మీద నడవాల్సి ఉంటుంది అని అన్నారు. ఇప్పుడు నాకు ఏమవబోతుంది అంటూ శిష్యుడు ఏడవటం ప్రారంభిస్తాడు.

అప్పుడు గురువు, అందుకే నన్ను పరమాత్మగా నమ్మమని నీకు 40 ఏళ్ళ గా చెపుతూనే ఉన్నాను కానీ నీవు నమ్మలేదు.ఒకవేళ నమ్మి ఉంటే నువ్వు నా శరీరంతో కాకుండా నా ఆత్మతో అనుసంధానం అయి ఉండేవాడివి.మరియు ఆత్మతో అనుసంధానం అయి ఉంటే ఆత్మ ద్వారా నా సాధన యొక్క సూక్ష్మ శరీరంతో అనుసంధానం అయి ఉండి వాడివి. ఈ సూక్ష్మశరీరం యొక్క జీవితకాలం రాబోవు 800 సంవత్సరాలు ఉంటుంది.

గురుశక్తులు 800 ఏళ్ళ ప్రణాళికను ఎందుకు చేశారంటే, మోక్షం యొక్క మార్గాన్ని చూపిస్తానని నేను మాట ఇచ్చిన ఆత్మలు నా జీవిత కాలంలో ఏవైతే జన్మతీసుకోలేక పోయాయో, అవి దేహ ధారణ చేసేంతవరకు నేను సూక్ష్మరూపంలో ఉండాల్సిన అవసరం ఉన్నది, తద్వారా సూక్ష్మరూపంలో ఉంటూ నా ద్వారా వాటికి సరైన మార్గదర్శనం లభించాల్సి ఉన్నది.

మరియు రెండవది,ఏ ఆత్మలైతే నా జీవిత కాలంలో నా శిష్యులు గా ఉండి, నా ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని పొంది కూడా నియమం గా ధ్యాన సాధన చేయక జీవితాన్ని వ్యర్థం చేసుకుని,'నేను' అనే 'అహం' నుండి ముక్తిని పొందలేక, శరీరం నుండి ముక్తిని పొందారు, ఆ ఆత్మలకు కూడా నేను సూక్ష్మరూపంలో ఉండటం అవసరము.

వీళ్ళు కూడా ఇంకో జన్మ తీసుకుని వస్తారు. వీరందరూ మోక్షాన్ని పొందేవరకు నేను సూక్ష్మశరీరం లో వేచి ఉండాల్సి ఉన్నది.వీళ్ళందరు రాబోయే 800 ఏళ్ళ లో మళ్ళీ జన్మించబోతున్నారు. నా స్థితి శిక్షకుని వంటిది. అతను స్వయంగా ఏ క్షణమైనా ఇంటికి వెళ్ళవచ్చు కానీ, తన స్కూల్ లోని పిల్లలందరూ ఇళ్ళకు చేరనంత వరకు ఇంటికి వెళ్ళడు.ఆత్మ సాక్షాత్కారం ద్వారా కేవలం అనుభూతిని పొందటమే కాదు, తల్లి ,బిడ్డల మధ్యన ఉండే ఒక ఆత్మీయసంభందం వంటిది ఏర్పడుతుంది. ఎలాగైతే బిడ్డ తల్లిని వదిలినా కూడా తల్లి మాత్రం బిడ్డను ఎప్పటికి వదలలేదు.నా స్థితి కూడా ఈ కథలోని గురువు వంటిదే. అందుకే సజీవ గురువు యొక్క దర్శనం మరియు సాన్నిధ్యం ఎంతో దుర్లభం మరియు ఎన్నో ప్రయాసల అనంతరమే లభిస్తుందని ఎప్పుడూ చెప్తూ ఉంటాను.

అప్పుడు మీ అందరి ధ్యాస గురువు ఎటువంటి దుస్తులు ధరించారు, ఏమి చెప్తున్నారు అన్న దాని మీదనే ఉంటుంది. మీరు ఎప్పటికీ గురువు యొక్క లోపలి గురువును చేరనే లేరు ఎందుకంటే, మీకు అంత రిసీవింగ్ (గుణగ్రాహకత) ఉండదు.ఎప్పుడైతే మీరు గురువునే పరమాత్మగా నమ్ముతారో , అప్పుడు మీ రిసీవింగ్ 100%అవుతుంది. మరియు మీరు గురువు యొక్క శరీర మాధ్యమం

ద్వారా గురువు యొక్క సూక్ష్మ శరీరం వరకు చేరుకుంటారు. గురుసాన్నిధ్యం యొక్క అతిశ్రేష్ఠమైన ఉపయోగం ఇదే. అందుకే గురుసాక్షాత్ పరబ్రహ్మ అని అన్నారు. అంటే, ఈ జగత్తులో వర్తమాన పరమాత్మ ఎక్కడ ఉన్నారని అంటే,అది గురువు మాధ్యమం ద్వారానే. ఎందుకంటే పరమాత్మ ఒక విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక చేతనా శక్తి. అది ఏ శరీర మాధ్యమం ద్వారా ప్రవహిస్తుందో,

మనం ఆ శరీరమాధ్యమాన్నే పరమాత్మ అని పిలుస్తున్నాము. వాస్తవానికి ఏ శరీరం కూడా ఎప్పుడూ పరమాత్మ కానే కాదు.అందుకే ఈ రోజు వరకు ఏ పరమాత్మ మాధ్యమం కూడా నేనే "పరమాత్మ"ని అని అన లేదు.

హిమాలయాల్లోని అనేకమంది గురువులు తమ ఆత్మజ్ఞానాన్ని నాకు ధారపోసి వారు ముక్తులయ్యారు ఎందుకంటే జ్ఞాన సహితంగా ముక్తి ఉండదు.కానీ ఆ జ్ఞాన భండారం ఎంత విశాలమైందంటే నా జీవితకాలంలో అది పంచలేను.ఈ విషయం నాకు కొన్ని ఏళ్ళ ముందే అవగతమైనది. మరియు ఆ ఆత్మానుభూతి జ్ఞానభాండారాన్ని నేను నాతో తీసుకుని వెళ్ళా లని లేదు. అందుకే రాబోయే తరాల కోసం మంగళ మూర్తులను మాధ్యమాలుగా ఎంచుకున్నాను.

మరియు 45 రోజుల అనుష్ఠానం మాధ్యమం గా ఆ మంగళమూర్తులలో ప్రాణప్రతిష్ఠ విధి విధానం ద్వారా నా ఆత్మజ్ఞాన

భండారాన్ని ధారపోసాను తద్వారా నా తరువాత కూడా 800 ఏళ్ళ వరకు మంగళమూర్తులు మాధ్యమంగా ఆత్మానుభూతి తరువాతి తరాలవారికి ప్రాప్తిస్తుంది.లేదా మీరు ఈ జన్మలో మోక్షం పొందలేకపోతే మీకు తరువాతి జన్మలో మార్గదర్శనం చేస్తుంది.

ఇది నాకైతే చివరి జన్మ. మీరు కూడా జీవితములో ముక్తులైతేనే ఇది మీకు అంతిమ జన్మ అవుతుంది. ఇటీవల ఒక వృద్ధ సాధిక కు మోక్షం లభించినది.ఎందుకంటే

ఆమె జీవితం నుండి ముక్తిని పొందింది మరియు ఇంకా జీవించాలనే కోరిక కూడా మిగిలి లేదు.ఇంకా జీవించాలి అన్న మనిషి యొక్క కోరిక యే ఇంకొక జన్మ తీసుకోటానికి కారణం అవుతుంది. మీ అందరికి అనేక ఆశీర్వాదములు.

మీ

బాబాస్వామి

యూరోప్ సమర్పణ ఆశ్రమం,జర్మనీ

No comments:

Post a Comment