శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 555 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 555 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀

🌻 555. 'కలికల్మష నాశినీ'- 1 🌻


కలి కల్మషమును నాశనము చేయునది శ్రీమాత అని అర్థము. కల్మష మనగా మలినము, పాపము, అజ్ఞానము, అహంకారము ఇత్యాదివి. సృష్టి ఒక మహత్తరమగు అగ్నికార్యము. కనుక అందు మలినము లేర్పడుచుండును. మలినములు తొలగించుకొననిచో క్రమముగ అజ్ఞాన మేర్పడును. అజ్ఞానము జ్ఞానమును ఎప్పటికప్పుడు ఆవరించు చుండును. ఆవరించు అజ్ఞాన మలినమును జ్ఞానముతో పరిహరింపవలెను. అజ్ఞాన మావరించినపుడు అహంకారము బలపడును. తాను, యితరులు అను భావము కలుగును. దాని నుండి భేదబుద్ధి పుట్టును. స్వార్థము కలుగును. దీనిని అనునిత్యము నిర్మూలించు కొనవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 555 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 113. Agraganya chintyarupa kalikalmashanashini
katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻

🌻 555. 'Kalikalmasha Nasini' - 1 🌻

Srimata destroys the impurities of Kali. Impurity is impurity, sin, ignorance, pride etc. Creation is a great work of fire. So impurities form within it. If impurities are not removed, ignorance will gradually arise. Ignorance keeps covering knowledge. The impurities of ignorance should be removed with knowledge. Ego becomes stronger when ignorance covers one. There is a sense of self and others. From that arises discrimination. Then comes selfishness. It should be eradicated continuously.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment