✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 07 🌴
07. మమైవంశో జీవలోకే జీవభూత: సనాతన: |
మన:షష్టానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ||
🌷. తాత్పర్యం : ఈ బద్ధ భౌతిక జగము నందలి జీవులందరు నా శాశ్వతాంశలు. బద్ధజీవనము కారణముగా మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియములను గూడి వారు తీవ్రసంఘర్షణ కావించుచున్నారు.
🌷. భాష్యము : జీవుని యథార్థరూపము ఈ శ్లోకమునందు స్పష్టముగా ఒసగబడినది. యథార్థమునకు అతడు శ్రీకృష్ణభగవానుని శాశ్వతాంశము. అనగా అతడు బద్ధజీవితమున వ్యక్తిత్వమును పొంది, ముక్తస్థితిలో ఆ భగవానునితో ఐక్యమగునని కాదు. అతడు శాశ్వతముగా భగవానుని నుండి విడివడియే యుండును. ఈ విషయమే “సనాతన”యను పదము ద్వారా స్పష్టపరుపబడినది. వేదముల ప్రకారము శ్రీకృష్ణభగవానుడు అసంఖ్యాక రూపములలో వ్యక్తమై విస్తరించియుండును. వానిలో ప్రధానవిస్తారములు విష్ణుతత్త్వములనియు, అప్రధానవిస్తారములు జీవతత్త్వములనియు పిలువబడును. అనగా విష్ణుతత్త్వములు స్వీయ విస్తారములు కాగా, జీవులు విభక్తమైనట్టి విస్తారములు. ఈ రీతి శ్రీకృష్ణభగవానుడు తన స్వీయ విస్తారముతో రామ, నృసింహ, విష్ణుమూర్తి మరియు పలు వైకుంఠాధి పతుల రూపములందు వ్యక్తమగు చుండును.
విభక్తవిస్తారములైన జీవులు అతని నిత్య సేవకులే. భగవానుని స్వీయ విస్తారములు (విష్ణుతత్త్వములు) శాశ్వతముగా నిలుచునట్లే, భగవానుని విభక్తవిస్తారములైన జీవులు సైతము తమ వ్యక్తిత్వములను కలిగియున్నారు. దేవదేవుని అంశలుగా వారు అతని లక్షణములను అంశమాత్రము కలిగియున్నారు. దేవదేవుని అంశలుగా వారు అతని లక్షణములను అంశ మాత్రము కలిగియున్నారు. అట్టి లక్షణములలో స్వతంత్రమనునది యొకటి. అనగా ప్రతిజీవియు వ్యక్తిత్వమును మరియు స్వతంత్ర్య యొక్క సుక్ష్మాంశమును కలిగియున్నాడు. అట్టి సూక్ష్మస్వతంత్రతను దుర్వినియోగపరచుటచే అతడు బద్ధుడగుచుండ, సద్వినియోగముచే ముక్తుడగుచున్నాడు. బంధ, ముక్తస్థితులనెడి రెండింటి యందును అతడు దేవదేవుని వలనే గుణరీతి శాశ్వతుడు. ముక్తస్థితిలో అతడు భౌతికజీవనము నుండి విడివడియుండి శ్రీకృష్ణభగవానుని దివ్యసేవలో నియుక్తుడై యుండును. కాని బద్ధస్థితిలో గుణములచే ప్రభావితుడై ఆ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవను మరచియుండును. తత్పలితముగా అతడు భౌతిక జగమునందు తన జీవనమునకై తీవ్ర సంఘర్షణను కావింప వలసి వచ్చును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 558 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 15 - Purushothama Yoga - 07 🌴
07. mamaivāṁśo jīva-loke jīva-bhūtaḥ sanātanaḥ
manaḥ-ṣaṣṭhānīndriyāṇi prakṛti-sthāni karṣati
🌷 Translation : The living entities in this conditioned world are My eternal fragmental parts. Due to conditioned life, they are struggling very hard with the six senses, which include the mind.
🌹 Purport : In this verse the identity of the living being is clearly given. The living entity is the fragmental part and parcel of the Supreme Lord – eternally. It is not that he assumes individuality in his conditional life and in his liberated state becomes one with the Supreme Lord. He is eternally fragmented. It is clearly said, sanātanaḥ. According to the Vedic version, the Supreme Lord manifests and expands Himself in innumerable expansions, of which the primary expansions are called viṣṇu-tattva and the secondary expansions are called the living entities. In other words, the viṣṇu-tattva is the personal expansion, and the living entities are the separated expansions.
By His personal expansion, He is manifested in various forms like Lord Rāma, Nṛsiṁha-deva, Viṣṇumūrti and all the predominating Deities in the Vaikuṇṭha planets. The separated expansions, the living entities, are eternally servitors. The personal expansions of the Supreme Personality of Godhead, the individual identities of the Godhead, are always present. Similarly, the separated expansions of living entities have their identities. As fragmental parts and parcels of the Supreme Lord, the living entities also have fragmental portions of His qualities, of which independence is one. Every living entity, as an individual soul, has his personal individuality and a minute form of independence.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment