శ్రీమద్భగవద్గీత - 562: 15వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 562: Chap. 15, Ver. 11

🌹. శ్రీమద్భగవద్గీత - 562 / Bhagavad-Gita - 562 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 11 🌴

11. యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్ |
యతన్తోప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతస: ||


🌷. తాత్పర్యం : ఆత్మానుభవమునందు స్థితిని పొందిన యత్నశీలురైన యోగులు దీనినంతటిని స్పష్టముగా గాంచ గలుగుదురు. కాని అచేతసులు మరియు ఆత్మానుభవము నందు స్థితిని పొందని వారు ప్రయత్నించినను ఏమి జరుగుచున్నదో గాంచలేరు.

🌷. భాష్యము : ఆత్మానుభవ మార్గమున పలువురు యోగులున్నను ఆత్మానుభవము నందు స్థితుడు కానివాడు దేహి యొక్క దేహము నందు మార్పులెట్లు కలుగుచున్నవో గాంచలేడు. కనుకనే ఈ విషయమున “యోగిన:” అను పదము మిక్కిలి ప్రాధాన్యమును సంతరించుకొన్నది. నేటికాలమున పలువురు నామమాత్ర యోగులు మరియు నామమాత్ర యోగసంఘములున్నను వాస్తవమునకు ఆత్మానుభవ విషయమున వారందరును అంధులై యున్నారు. వారు కేవలము ఏదియోనొక దేహ వ్యాయామమునకు అలవాటుపడి, దేహము దృఢముగా మరియు ఆరోగ్యముగా నున్నచో తృప్తినొందుచున్నారు.

దానికి అన్యమైన విషయము వారికి తెలియదు. అట్టివారే “యతన్తోప్యకృతాత్మాన:” యనబడుదురు. వారు అట్టి నామమాత్రయోగమును అభ్యసించినను ఆత్మవిదులు కాజాలరు. వారెన్నడును ఆత్మా యొక్క పునర్జన్మ విధానమును అవగతము చేసికొనజాలరు. వాస్తవముగా యోగమునందు నిలిచి ఆత్మ, జగత్తు, శ్రీకృష్ణభగవానుడు అనెడి అంశములను అవగాహన చేసికొనినవారే (అనగా కృష్ణభక్తిభావన యందు విశుద్ధ భక్తియోగమున నియుక్తులైన భక్తియోగులు) ఏది యెట్లు జరుగుచున్నదో అవగతము చేసికొనగలరు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 562 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 15 - Purushothama Yoga - 11 🌴

11. yatanto yoginaś cainaṁ paśyanty ātmany avasthitam
yatanto ’py akṛtātmāno nainaṁ paśyanty acetasaḥ


🌷 Translation : The endeavoring transcendentalists who are situated in self-realization can see all this clearly. But those whose minds are not developed and who are not situated in self-realization cannot see what is taking place, though they may try.

🌹 Purport : There are many transcendentalists on the path of spiritual self-realization, but one who is not situated in self-realization cannot see how things are changing in the body of the living entity. The word yoginaḥ is significant in this connection. In the present day there are many so-called yogīs, and there are many so-called associations of yogīs, but they are actually blind in the matter of self-realization. They are simply addicted to some sort of gymnastic exercise and are satisfied if the body is well built and healthy. They have no other information.

They are called yatanto ’py akṛtātmānaḥ. Even though they are endeavoring in a so-called yoga system, they are not self-realized. Such people cannot understand the process of the transmigration of the soul. Only those who are actually in the yoga system and have realized the self, the world and the Supreme Lord – in other words, the bhakti-yogīs, those engaged in pure devotional service in Kṛṣṇa consciousness – can understand how things are taking place.

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment