శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 562 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 562 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 562 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 562 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀

🌻 562. 'మోహినీ’ - 1 🌻


మోహింప జేయునది కావున మోహిని అని అర్థము. మోహము లేనిదే సృష్టి లేదు. మోహము వలన జీవుడు తనను తాను మరచును. ఇట్లు జీవులను మరపింప జేసి, సృష్టి యందు ప్రవేశింప జేసి వారికి అనుభవము, అనుభూతిని కలిగింపజేసి, వారందరిని పరిపూర్ణులుగను, సిద్ధులుగను తీర్చిదిద్దును. ఏ మోహము లేనివాడు ఏమియూ చేయడు. మోహ మాధారముగనే జీవులు తీరుబడి లేక పరుగిడుచున్నారు. అనేకానేక కార్యములను సాధించుచూ, సాధించితిమి అని భ్రమ పడుచున్నారు. స్వప్నమునకు లోనైనట్లుగ చరించుచున్నారు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 562 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha
mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻

🌻 561. 'Mohini' - 1 🌻


The word 'Mohini' means "one who enchants." Without delusion (moha), there is no creation. Due to delusion, the soul forgets itself. In this way, by making beings forget themselves, she involves them in creation, gives them experiences, and makes them undergo various realizations, ultimately shaping them into perfect beings, or siddhas. Without some form of attachment or delusion, no one would act. It is through the power of delusion that living beings are constantly running without rest, achieving numerous tasks, and being caught in the illusion that they have accomplished something. They behave as if caught in a dream.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment