శ్రీమద్భగవద్గీత - 589: 16వ అధ్., శ్లో 18 / Bhagavad-Gita - 589: Chap. 16, Ver. 18


🌹. శ్రీమద్భగవద్గీత - 589 / Bhagavad-Gita - 589 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 18 🌴

18. అహంకార బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితా: |
మామాత్మపరదేహేషు ప్రద్విషన్తోభ్య సూయకా: ||


🌷. తాత్పర్యం : మిథ్యాహంకారము, బలము, గర్వము, కామము, క్రోధములచే భ్రాంతులైన అసురస్వభావులు తమ దేహమునందు మరియు ఇతరుల దేహములందు నిలిచియున్న దేవదేవుడైన నా యెడ అసూయగలవారై నిజమైన ధర్మమును దూషింతురు.

🌷. భాష్యము : భగవానుని దేవదేవత్వమును ఎల్లప్పుడు వ్యతిరేకించుటచే ఆసురస్వభావుడు శాస్త్రములను నమ్మ ఇచ్ఛగింపడు. శాస్త్రము నెడ మరియు దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ అతడు అసూయను కలిగియుండును. అట్టి భ్రాంతికి అతని నామమాట గౌరవము, ధనము, బలములే కారణము. వర్తమాన జన్మము భవిష్యజ్జన్మకు మూలమని తెలియనందునే ఆసురస్వభావుడు తన యెడ, ఇతరుల యెడ అసూయను కలిగియుండును.

తత్కారణముగా అతడు ఇతరులయెడ మరియు తనయెడ హింస నొనరించును. జ్ఞానరహితుడైనందున అట్టివాడు దేవదేవుడైన శ్రీకృష్ణుని పరమ నియామకత్వమును లెక్కచేయడు. శాస్త్రము మరియు భగవానుని యెడ అసూయగలవాడైనందున భగవానుని అస్తిత్వమునకు విరుద్ధముగా అతడు మిథ్యావాదము చేయుచు శాస్త్రప్రమాణమును త్రోసిపుచ్చును. ప్రతికార్యమునందు తనను స్వతంత్రునిగా మరియు శక్తిగలవానిగా అతడు భావించును. బలము, శక్తి లేదా ధనమునందు తనతో సమానులు ఎవ్వరును లేనందున తాను తోచిన రీతిలో వర్తింపవచ్చుననియు, తననెవ్వరును అడ్డగింపలేరనియు అతడు తలచును. అట్టి అసురస్వభావుడు తన భోగకర్మలను అడ్డగించు శత్రువున్నాడని తెలిసినచో అతనిని తన శక్తినుపయోగించి నశింపజేయుటకు ప్రణాళికలు రూపొందించును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 589 🌹

✍️ Sri Prabhupada 📚 Prasad Bharadwaj

🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 18 🌴

18. ahaṅkāraṁ balaṁ darpaṁ kāmaṁ krodhaṁ ca saṁśritāḥ
mām ātma-para-deheṣu pradviṣanto ’bhyasūyakāḥ


🌷 Translation : Bewildered by false ego, strength, pride, lust and anger, the demons become envious of the Supreme Personality of Godhead, who is situated in their own bodies and in the bodies of others, and blaspheme against the real religion.

🌹 Purport : A demoniac person, being always against God’s supremacy, does not like to believe in the scriptures. He is envious of both the scriptures and the existence of the Supreme Personality of Godhead. This is caused by his so-called prestige and his accumulation of wealth and strength. He does not know that the present life is a preparation for the next life. Not knowing this, he is actually envious of his own self, as well as of others. He commits violence on other bodies and on his own.

He does not care for the supreme control of the Personality of Godhead, because he has no knowledge. Being envious of the scriptures and the Supreme Personality of Godhead, he puts forward false arguments against the existence of God and denies the scriptural authority. He thinks himself independent and powerful in every action. He thinks that since no one can equal him in strength, power or wealth, he can act in any way and no one can stop him. If he has an enemy who might check the advancement of his sensual activities, he makes plans to cut him down by his own power.

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment