శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 570 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 570 -1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 570 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 570 -1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 115. నిత్యతృప్తా, భక్తనిధి, ర్నియంత్రీ, నిఖిలేశ్వరీ ।
మైత్ర్యాది వాసనాలభ్యా, మహాప్రళయ సాక్షిణీ ॥ 115 ॥ 🍀
🌻 570. 'మైత్ర్యాది వాసనాలభ్యా' - 1 🌻
మైత్రి, కరుణ, వందిత, ఉపేక్ష అను నాలుగు వాసనల ద్వారా లభ్యమగునది శ్రీమాత అని అర్థము. తమతో సమానమగు వారి యెడల మైత్రి, తమకన్న తక్కువ స్థితిగతులు కలవారి యెడల కరుణ, తమకన్నా ప్రతిభాపాటవములు కలవారిని చూచి సంతోషించుట, కుసంస్కారుల యెడల ఉపేక్ష అను ఈ నాలుగు గుణములను అభ్యసించువారు, పాటించువారు శ్రీమాత అనుగ్రహమునకు అర్హులు. సాధారణముగ లోకమున తమ సాటివారితో వైరముండును. తమకన్న తక్కువ వారిపై కరుణ చూపక, కాఠిన్యము వహించుట యుండును. నిర్లక్ష్య భావ ముండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 570 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 115. Nityatrupta bhaktanidhi rniyantri nikhileshvari
maityradi vasanalabhya mahapralayasakshini ॥115 ॥ 🌻
🌻 570. 'Maitryadi Vasanalabhya' - 1 🌻
It means that Sri Mata is attained through the four qualities (vasanas) of friendship (Maitri), compassion (Karuna), joy (Mudita), and equanimity (Upeksha). Maitri is towards those who are equal to oneself, Karuna towards those in lesser conditions, joy upon seeing those with greater talent and skills, and Upeksha towards those with bad tendencies. Those who practice and uphold these four qualities are worthy of the grace of Sri Mata.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment